breaking news
Seagull bird
-
ప్రాణాలు తీస్తున్న ప్లాస్టికోసిస్ వ్యాధి.. వాటి ఉనికే ప్రశ్నార్థకం
సాక్షి, అమరావతి: మానవాళి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ప్లాస్టిక్.. సముద్ర పక్షులను సైతం పొట్టన పెట్టుకుంటోంది. సముద్ర జలాల్లోకి చేరుతున్న చిన్నచిన్న ప్లాస్టిక్ ముక్కలను ఆహారంగా భావించి తింటున్న పక్షులు మూకుమ్మడిగా మరణిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇటీవల ఆస్ట్రేలియా సమీపంలోని లార్డ్ హోవ్ ద్వీపంలో బ్రౌన్ సీగల్స్పై అధ్యయనం చేసి.. మరణించిన పక్షుల శరీరాలను పరీక్షించగా కడుపులో ప్రమాదకరమైన స్థాయిలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నట్టు తేలింది. అక్కడి ద్వీపంలోని 90 శాతం పక్షుల్లో ప్లాస్టిక్ ఆనవాళ్లు ఉన్నట్టు తేల్చారు. లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం శాస్త్రవేత్తలు ఈ పరిస్థితికి ‘ప్లాస్టికోసిస్’ వ్యాధిగా నామకరణం చేశారు. వర్తమాన ప్రపంచంలో ప్లాస్టిక్ ద్వారా వచ్చే సమస్యకు పేరు పెట్టడం ఇదే తొలిసారి. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు దాదాపు 8 మిలియన్ ప్లాస్టిక్ ముక్కలు సముద్రాల్లోకి చేరుతున్నాయని, అందులో ఎక్కువ భాగం సముద్ర పక్షులు ఆహారంగా తీసుకున్నప్పుడు వాటి జీర్ణవ్యవస్థను నాశనం చేసి మరణానికి దారి తీస్తున్నట్టు తేల్చారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తిన్న పక్షులు చూడ్డానికి ఆరోగ్యంగా కనిపించినా తక్కువ కాలంలోనే జీర్ణ వ్యవస్థ పనిచేయక చనిపోతున్నట్టు నేచురల్ హిస్టరీ మ్యూజియం జీవశాస్త్రవేత్త అలెక్స్ బాండ్ ప్రకటించారు. తరుణోపాయం ఇదొక్కటే ప్లాస్టిక్ విచ్చలవిడి వినియోగం భవిష్యత్‌లో మరింత ప్రమాదకారిగా మారుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ)–2022 నివేదిక ప్రకారం మనం వినియోగిస్తున్న ప్లాస్టిక్‌లో కేవలం 9 శాతం మాత్రమే రీసైకిల్ చేస్తున్నట్టు తేలింది. ఇప్పటివరకు ఉత్పత్తి చేసిన 10 బిలియన్ టన్నుల ప్లాస్టిక్‌లో దాదాపు 6 బిలియన్ టన్నులు భూమిని, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నట్టు తేల్చారు. సాధ్యమైన మేర ప్లాస్టిక్‌ను వాడకపోవడమే ఉత్తమమని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ఇప్పటికే యూరోపియన్ యూనియన్ ప్రభుత్వాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్లు, కట్లర్లు, స్ట్రాలు, బెలూన్ స్టిక్స్, కాటన్ బడ్స్‌ను పూర్తిగా నిషేధించాయి. గతేడాది 175 దేశాలు 2024 నాటికి ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడానికి చట్టబద్ధమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. భారతదేశంలో సైతం సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించారు. అయినప్పటికీ మార్కెట్లో దాని వినియోగం మాత్రం తగ్గలేదు. ప్లాస్టికోసిస్ అంటే.. పక్షులు ఆహారంగా భావించి తింటున్న ప్లాస్టిక్ వాటి జీర్ణ వ్యవస్థను దెబ్బతీసి ప్రాణాలను హరిస్తోంది. ఇది పక్షి కడుపులోని గ్రంథులను, జీర్ణ ప్రక్రియను నాశనం చేసి మరణానికి చేరువ చేస్తోందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ మొత్తం ప్రక్రియకు ‘ప్లాస్టికోసిస్’గా పేరు పెట్టారు. హవాయి ద్వీపంలోని అల్బట్రాస్ పక్షులు కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు తిని మరణిస్తున్నాయని, ఏటా 2.50 లక్షల అల్బట్రాస్ పక్షి పిల్లలు ఇలా ప్రాణాలు కోల్పోతున్నాయని గుర్తించారు. ఈ తరహా లక్షణాలు చాలా సముద్ర జంతువులు, జీవుల్లో కూడా కనిపించాయని పేర్కొన్నారు. ప్లాస్టికోసిస్ లక్షణాలు మానవుల్లోనూ కనిపించాయని, ఇటీవల ఆ్రస్టేలియాలో 52 మంది ప్రేగుల్లో మైక్రోప్లాస్టిక్ కణాలను గుర్తించడంతో శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల ఆకలి మందగించడంతో పాటు ఇతర పరాన్నజీవులు శరీరంలోకి ప్రవేశించి మరణానికి దారితీయవచ్చని చెబుతున్నారు. 1,200కు పైగా జీవుల ఉనికి ప్రశ్నార్థకం లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం నుంచి వెళ్లిన శాస్త్రవేత్తల బృందం ఆస్ట్రేలియాకు 600 మైళ్ల దూరంలోని లార్డ్హోవ్ ద్వీపంలో పక్షుల మరణాలపై అధ్యయనం చేపట్టింది. అక్కడ డజన్లకొద్దీ చనిపోయి పడి ఉన్న బ్రౌన్ సీగల్స్ పక్షుల కళేబరాలను ల్యాబ్‌లో పరీక్షించి ఒక్కో పక్షి కడుపులో దాదాపు 200కు పైగా ప్లాస్టిక్ ముక్కలను వెలికితీశారు. ఈ తరహా ప్లాస్టిక్ ముక్కలు కేవలం సముద్ర పక్షులనే కాకుండా దాదాపు 1200కు పైగా సముద్ర జీవుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నట్టు గుర్తించారు. వాస్తవానికి 5 మి.మీ. కంటే చిన్న పరిమాణంలో ఉండే ప్లాస్టిక్ ముక్కలు జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తున్నట్టు రెండేళ్ల క్రితం ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో తేలింది. కానీ.. బయట వాతావరణంలో ఇలాంటి జబ్బును లార్డ్ హోవ్ ద్వీపంలోనే మొదటిసారి గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది. పైగా.. జీవించి ఉన్న చాలా పక్షులు బరువు తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. వాస్తవానికి 2010లోనే ఈ పక్షులు తక్కువ బరువు ఉన్నట్టు గుర్తించినా కారణాలను మాత్రం అంచనా వేయలేకపోయారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన పరిశోధనల ప్రకారం వాటి కడుపులోని ప్లాస్టిక్ ముక్కలు జీర్ణం కాకపోవడం వల్లనే అవి ఆహారం తీసుకోవడం లేదని, ఫలితంగా రోజుల వ్యవధిలోనే మరణిస్తున్నట్టు గుర్తించారు. -
వైరల్: అయ్యో.. బర్త్ డే అనుకుంటే.. డెత్ డేకు దాపురించిందే..!
జీవితంలో కొన్ని సరదా క్షణాలు ఉండాలని ఎంతో మంది కోరుకుంటారు. అది పుట్టిన రోజైతే చాలా మంది స్పెషల్‌గా ప్లాన్ చేస్తారు. ఆ మదుర క్షణాలు గుర్తు చేసుకున్నప్పడు మనసులో అదో రకమైన ఫీలింగ్ కలగాలి అనుకుంటారు. దాన్ని వర్ణించడం మాటల కందని విషయంగా.. అది మనిషిలో ఓ తెలియని భావాన్ని కలిగించేలా.. ఎంత బాగుండు అనిపిస్తుంది. అప్పుడప్పుడు గాల్లో ఎగరాలి అనిపించడం, రోలర్ కోస్టర్‌పై సరదాగా తిరగాలి అనిపించడం కూడా ఈ కోవలోకే వస్తాయి. వాషింగ్టన్: అమెరికాలోని న్యూజెర్సీలో ఇద్దరు అమ్మాయిలు తమ పుట్టిరోజును సరదాగా గడపాలని ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగా రోలర్ కోస్టర్‌పై ఎక్కారు. అయితే భయంతో కూడిన ఉత్సాహంతో రైడ్ కోసం ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో రోలర్ కోస్టర్ రైడ్ మొదలైన కొద్ది సేపటికే ఓ సీగల్ పక్షి వచ్చి ఓ అమ్మాయిపై పడింది. దీంతో చచ్చేంత భయంతో చెవులు గల్లలు పోయేల మొత్తుకుంది. కానీ ఆ అరుపు గాల్లో అలాగే కలిసి పోయింది. చివరకు ధైర్యం చేసి పక్షిని తనే స్వయంగా తీసివేసి ఊపిరి పీల్చుకుంది. కానీ ఆ అమ్మాయి పక్కనే కూర్చున్న మరో బాలిక కళ్లు బిగ్గరగా మూసుకోవడంతో ఇవేవీ గమనించలేదు. ఈ వీడియోను టైరోన్ పవర్ సోషల్ మీడియా యూజర్ నెట్టింట పంచుకోగా తెగ వైరలవుతోంది. దీని పై ఓ నెటిజన్ స్పందిస్తూ..‘‘ పుట్టిన రోజు శుభాకాంక్షలు! మీ భయం నిజం అయ్యింది. దెబ్బకు చచ్చినంత పనైంది.’’ అంటూ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ ‘‘ భయపడనేలా.. రోలర్ కోస్టర్‌ను ఎక్కనేలా.. ఇది మీకు మంచి అనుభవాన్నే ఇచ్చినట్టుంది?’’ అంటూ రాసుకొచ్చారు. -
గాఢమైన ముద్దు.. నాలుక కట్, ట్విస్టు ఏంటంటే!
లండన్: బ్రిటన్‌లో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తనతో వాగ్వాదానికి దిగిన వ్యక్తి నాలుకను కొరికింది. దీంతో తెగిపడిన నాలుక ముక్కను పక్షి ఎత్తుకుపోయిన వింత సంఘటన స్కాంట్లాండ్లో జరిగింది. 2019లో జరిగిన ఈ సంఘటనలో మహిళకు ఇటీవల కోర్టు జరిమాన విధించింది. వివరాలు... ఎడిన్‌బర్గ్‌కు చెందిన బెథానీ ర్యాన్ అనే మహిళకు జేమ్స్ మెకెంజీలు అనే వ్యక్తికి మధ్య చిన్న వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో వారిద్దరు రోడ్డుపైనే గొడవకు దిగారు. ఈ క్రమంలో మెకెంజీ పడికిలి బిగించి ర్యాన్‌పై దాడి చేసేందుకు వెళ్లడంతో ఆమె ఊహించని రీతిలో అతడికి ముద్దు పెట్టింది. అక్కడితో ఆగకుండా మెకెంజీ నాలుక చివరి భాగాన్ని గట్టిగా కొరకడంతో రెండు ఇంచుల మేర అతడి నాలుక తెగి కింద పడిపోయింది. అయితే అది గమనించుకోకుండా వారిద్దరూ గొడవ పడుతూనే ఉన్నారు. ఇక తెగిపడిన ఆ నాలుక భాగం చెట్టుపై ఉన్న సిగుల్ పక్షి కంట పడింది. దీంతో ఆ నాలుక భాగాన్ని దాని ముక్కుతో కరుచుకుని సిగూల్ పక్షిఎగిరిపోయింది. కాసేపటికి అతడి నాలుక తెగిపోయిన విషయం గమనించిన స్థానికులు మెకెంజీని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిక్షించి అతడికి సర్జరీ చేయాలని సూచించారు. అందుకు తెగిన నాలుక భాగం కావాలని చెప్పారు. అయితే జరిగిన విషయాన్ని డాక్టర్లకు చెప్పడంతో అది లేకపోతే ఆపరేషన్ చేయడం కుదరదని స్పష్టం చేశారు. కాగా, ర్యాన్‌పై అతడు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. గత వారం ఈ కేసు విచారణ చేపట్టిన ఎడిన్బర్గ్ ఫరీఫ్ కోర్టులో ర్యాన్ తను చేసిన తప్పిదానికి క్షమాపణలు కోరింది. అయితే ఆమెకు శిక్ష విధించకుండా కోర్టు జరిమాన విధించింది. చదవండి: డివిలియర్స్‌పై మనసుపడ్డ షాహిద్ భార్య! రామ్‌దేవ్ బాబాను అరెస్టు చేస్తారా? -
నేను సైతం..!
నేనేం తక్కువా? అన్నట్లు ఉంది కదూ ఈ సీగుల్ పక్షి ఫోజు. ఎసెక్స్కు చెందిన డేవిక్ బ్లాక్ తన కుటుంబంతో కలిసి ఎయిర్ షోకు వెళ్లాడు. అక్కడ విన్యాసాలు చేస్తున్న విమానాలను తన కెమెరాలో బంధించే ప్రయత్నం చేశాడు. అనుకోకుండా ఫ్రేమ్‌లోకి వచ్చేసిందీ సీగుల్ పక్షి. వెంటనే క్లిక్‌మనిపించాడు బ్లాక్. విన్యాసాల్లో సీగుల్ పక్షి విమానాలతో పోటీపడుతున్నట్లుగా చక్కటి ఫొటో కెమెరాకు చిక్కింది.