వైరల్‌: అయ్యో.. బర్త్‌ డే అనుకుంటే.. డెత్‌ డేకు దాపురించిందే..!

Two American Girls On Roller Coaster Ride Hit By Seagull Video Goes Viral - Sakshi

జీవితంలో కొన్ని సరదా క్షణాలు ఉండాలని ఎంతో మంది కోరుకుంటారు. అది పుట్టిన రోజైతే చాలా మంది స్పెషల్‌గా ప్లాన్‌ చేస్తారు. ఆ మదుర క్షణాలు గుర్తు చేసుకున్నప్పడు మనసులో అదో రకమైన ఫీలింగ్‌ కలగాలి అనుకుంటారు. దాన్ని వర్ణించడం మాటల కందని విషయంగా.. అది మనిషిలో ఓ తెలియని భావాన్ని కలిగించేలా.. ఎంత బాగుండు అనిపిస్తుంది. అప్పుడప్పుడు గాల్లో ఎగరాలి అనిపించడం, రోలర్ కోస్టర్‌పై సరదాగా తిరగాలి అనిపించడం కూడా ఈ కోవలోకే వస్తాయి. 

వాషింగ్టన్‌: అమెరికాలోని న్యూజెర్సీలో ఇద్దరు అమ్మాయిలు తమ పుట్టిరోజును సరదాగా గడపాలని ప్లాన్‌ చేసుకున్నారు. ఇందులో భాగంగా రోలర్ కోస్టర్‌పై ఎక్కారు. అయితే భయంతో కూడిన ఉత్సాహంతో రైడ్‌ కోసం ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో రోలర్ కోస్టర్‌ రైడ్‌ మొదలైన కొద్ది సేపటికే ఓ సీగల్‌ పక్షి వచ్చి ఓ అమ్మాయిపై పడింది. దీంతో చచ్చేంత భయంతో చెవులు గల్లలు పోయేల మొత్తుకుంది. కానీ ఆ అరుపు గాల్లో అలాగే కలిసి పోయింది.

చివరకు ధైర్యం చేసి పక్షిని తనే స్వయంగా తీసివేసి ఊపిరి పీల్చుకుంది. కానీ ఆ అమ్మాయి పక్కనే కూర్చున్న మరో బాలిక కళ్లు బిగ్గరగా మూసుకోవడంతో ఇవేవీ గమనించలేదు. ఈ వీడియోను టైరోన్ పవర్ సోషల్‌ మీడియా యూజర్‌ నెట్టింట పంచుకోగా తెగ వైరలవుతోంది. దీని పై ఓ నెటిజన్‌ స్పందిస్తూ..‘‘ పుట్టిన రోజు శుభాకాంక్షలు! మీ భయం నిజం అయ్యింది. దెబ్బకు చచ్చినంత పనైంది.’’ అంటూ కామెంట్‌ చేశాడు. మరో నెటిజన్‌ ‘‘ భయపడనేలా.. రోలర్ కోస్టర్‌ను ఎక్కనేలా.. ఇది మీకు మంచి అనుభవాన్నే ఇచ్చినట్టుంది?’’ అంటూ రాసుకొచ్చారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top