గాఢమైన ముద్దు.. నాలుక కట్‌, ట్విస్టు ఏంటంటే!

Viral: Scotland Woman Bites Man Tongue In Violent Street Fight - Sakshi

లండన్‌: బ్రిటన్‌లో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తనతో వాగ్వాదానికి దిగిన వ్యక్తి నాలుకను కొరికింది. దీంతో తెగిపడిన నాలుక ముక్కను పక్షి ఎత్తుకుపోయిన వింత సంఘటన స్కాంట్లాండ్‌లో జరిగింది. 2019లో జరిగిన ఈ సంఘటనలో మహిళకు ఇటీవల కోర్టు జరిమాన విధించింది. వివరాలు... ఎడిన్‌బర్గ్‌కు చెందిన బెథానీ ర్యాన్‌‌ అనే మహిళకు జేమ్స్‌ మెకెంజీలు అనే వ్యక్తికి మధ్య చిన్న వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో వారిద్దరు రోడ్డుపైనే గొడవకు దిగారు. ఈ క్రమంలో మెకెంజీ పడికిలి బిగించి ర్యాన్‌‌పై దాడి చేసేందుకు వెళ్లడంతో ఆమె ఊహించని రీతిలో అతడికి ముద్దు పెట్టింది. అక్కడితో ఆగకుండా మెకెంజీ నాలుక చివరి భాగాన్ని గట్టిగా కొరకడంతో రెండు ఇంచుల మేర అతడి నాలుక తెగి కింద పడిపోయింది. అయితే అది గమనించుకోకుండా వారిద్దరూ గొడవ పడుతూనే ఉన్నారు.

ఇక తెగిపడిన ఆ నాలుక భాగం చెట్టుపై ఉన్న సిగుల్‌ పక్షి కంట పడింది. దీంతో ఆ నాలుక భాగాన్ని దాని ముక్కుతో కరుచుకుని సిగూల్‌ పక్షిఎగిరిపోయింది. కాసేపటికి అతడి నాలుక తెగిపోయిన విషయం గమనించిన స్థానికులు మెకెంజీని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిక్షించి అతడికి సర్జరీ చేయాలని సూచించారు. అందుకు తెగిన నాలుక భాగం కావాలని చెప్పారు. అయితే జరిగిన విషయాన్ని డాక్టర్లకు చెప్పడంతో అది లేకపోతే ఆపరేషన్‌ చేయడం కుదరదని స్పష్టం చేశారు. కాగా, ర్యాన్‌పై అతడు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. గత వారం ఈ కేసు విచారణ చేపట్టిన ఎడిన్‌బర్గ్‌ ఫరీఫ్ కోర్టులో ర్యాన్‌ తను చేసిన తప్పిదానికి క్షమాపణలు కోరింది. అయితే ఆమెకు శిక్ష విధించకుండా కోర్టు జరిమాన విధించింది.

చదవండి: డివిలియర్స్‌పై మనసుపడ్డ షాహిద్‌ భార్య!
             రామ్‌దేవ్‌ బాబాను అరెస్టు చేస్తారా?

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top