భారత్ అభ్యంతరం నడుమ చైనా ప్రకటన
చైనా–పాక్‌ల సరిహద్దు ఒప్పందం చెల్లదంటున్న భారత్
బీజింగ్: సరిహద్దుల్లోని షక్స్‌గామ్ లోయ ప్రాంతం తమదేనంటూ చైనా మళ్లీ ప్రకటించుకుంది. భారత్ అభ్యంతరం తెలపడంతో ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన చేసింది. లోయలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు అభ్యంతరాలకు తావులేకుండా నిర్మిస్తున్నవని తెలిపింది. షక్స్‌గామ్‌లోయలో చైనా ఆధ్వర్యంలో మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులపై భారత్ శుక్రవారం అభ్యంతరం తెలిపింది.
భారత దేశ ప్రాదేశిక సమగ్రతకు, ప్రయోజనాలకు భంగం కలిగిన పక్షంలో తగు చర్యలు తీసుకునే హక్కు తమకుందని స్పష్టం చేసింది. పాకిస్తాన్ ఆక్రమించుకున్న జమ్మూకశీ్మర్‌లోని భాగమే షక్స్‌లోయ. సుమారు 5,180 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న ఈ లోయను పాక్ ప్రభుత్వం 1963లో చైనాకు అప్పగించి, సరిహద్దు ఒప్పందం కుదుర్చుకుంది. ‘షక్స్‌గామ్ లోయ భారత్‌లోనిదే.
1963లో చైనా–పాకిస్తాన్ కుదుర్చుకున్న సరిహద్దు ఒప్పందాన్ని మేం ఎన్నడూ గుర్తించలేదు. ఈ ఒప్పందం చట్టవిరుద్ధం, చెల్లుబాటు కాదని పలుమార్లు తెలిపాం’అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ«దీర్ జైశ్వాల్ తెలిపారు. అదేవిధంగా, బలవంతంగా ఆక్రమించుకున్న భారత భూభాగం మీదుగా వెళ్లే చైనా–పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)ను కూడా భారత్ గుర్తించడం లేదని ఆయన స్పష్టం చేశారు. జమ్మూకశీ్మర్, లద్దాఖ్‌లలోని పూర్తి ప్రాంతం భారత్‌లో విడదీయరాని భాగమని చెప్పారు.
ఇదే అంశాన్ని చైనా, పాక్ అధికారులు పలు మార్లు తెలిపామని జైశ్వాల్ వెల్లడించారు. జైశ్వాల్ ప్రకటనపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ సోమవారం మీడియా సమక్షంలో స్పందించారు. భారత్ పేర్కొన్న భూభాగం చైనాదేనన్నారు. చైనా తన భూభాగంలోనే మౌలిక వసతుల నిర్మాణాలను చేపట్టింది. 1960ల్లో చైనా, పాకిస్తాన్‌లు సరిహద్దు ఒప్పందం కుదుర్చుకున్నాయి. తమ ఉమ్మడి సరిహద్దును అంగీకరించాయి’అని తెలిపారు.
సీపెక్‌పై మావో నింగ్ మాట్లాడుతూ..ఇది దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని, సామాజికారి్థక అభివృద్ధికి ఉద్దేశించిన ప్రాజెక్టని చెప్పారు. సీపెక్, సరిహద్దు ఒప్పందాలతో కశ్మీర్ విషయంలో తమ వైఖరి మారబోదన్నారు. ఈ వివాదాన్ని ఐరాస, మండలి తీర్మానాలకు లోబడి పరిష్కరించుకోవాలన్నదే తమ అభిమతమన్నారు. ఇలాఉండగా, కశీ్మర్ వివాదం పరిష్కారమయ్యాక అధికారికంగా ఒప్పందంపై సంతకాలు చేద్దామంటూ 1963నాటి ఒప్పందంలో చైనా–పాక్‌లు పేర్కొనడం గమనార్హం.


