సాక్షి హైదరాబాద్ : కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. ప్రమాదవశాత్తు చైనా మాంజా మెడకు చుట్టుకొని గాయాలు కావడంతో ఓ బాలిక మృతి చెందింది. తండ్రితో బైక్‌పై వెళుతున్న ఓ బాలికకు చైనా మాంజా మెడకు చుట్టుకొని తీవ్రగాయాలయ్యాయి. దీంతో బాలికకు తీవ్ర రక్తస్రావం అయ్యింది. దీంతో ఆ బాలిక తండ్రి హుటాహుటీన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది.
ఇటీవల జరిగిన బొటానికల్ గార్డెన్ వద్ద ఇద్దరు యువకులు బైక్‌పై వెళుతుండగా చైనా మాంజా తగిలి యువకులకు తీవ్రగాయాలయ్యాయి. అంతేకాకుండా ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న నాగరాజు అనే వ్యక్తికి సైతం మంజా తగిలి గోంతు కోసుకుపోయి తీవ్ర రక్తస్రావమయ్యింది. కర్ణాటకలో ఓ వ్యక్తి చైనా మాంజా ప్రమాదంలో మృతి చెందారు.
అయితే చైనా మాంజాపై రాష్ట్ర పోలీసులు సైతం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మంజాను అమ్మినా కొన్నా వారిపై కేసులుపెడతామని ఆదేశాలు జారీ చేశారు. నగరంలో పెద్దమెుత్తంలో మాంజాను పట్టుకొని సీజ్ చేశారు. అయినప్పటికీ కొంతమంది నిషేదిత చైనా మాంజాలతో పతంగులు ఎగురవేసి అమాయకులు ప్రాణాలు బలిగొనడం తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది.
ఆ చిన్నారి చావుకు బాధ్యులెవరు..?
చైనా మాంజాతో గాలి పటాలు ఎగరేయకండని, అవి ప్రమాదమని చెప్పినా ఇంకా ప్రాణాలే పోతున్నాయ్
కూకట్‌పల్లిలో ఓ చిన్నారి తండ్రితో పాటు బైక్‌పై వెళుతూ ప్రాణాలు కోల్పోయింది
నాన్నా.. నాన్నా అరిచేటప్పటికీ మెడ చుట్టూ తీవ్ర గాయమైంది
ఆస్పత్రికి తరలించినా ప్రాణం మాత్రం దక్కలేదు
ఆ చిన్నారికి చావుక ఎవరు బాధ్యులు..
మనకి మనం మారదాం.. మనకు మనం తెలుసుకుందాం
ఆ చిన్నారి ప్రాణాన్ని తీసుకొచ్చేదెవరూ..?
ఆ కుటుంబం అరణ్య రోదనకు కారణం ఎవ్వరూ..?
మనం మారాలి.. ఈ సమాజం మారాలి.
సరదా కంటే ప్రాణం ముఖ్యమనే సంగతి తెలుసుకోవాలి


