బీజింగ్: చైనాలో మాగ్లేవ్ రైలు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. కొత్తగా అభివృద్ధి చేసిన ఈ రైలు కేవలం రెండు సెకన్లలోనే గంటకు 700 కిలోమీటర్ల వేగాన్ని చేరి రికార్డు సృష్టించింది. చాంగ్షాలో నిర్వహించిన ఈ ప్రయోగం చైనాలో సాంకేతిక ఆధిపత్యాన్ని మరోసారి చాటింది.
మాగ్లేవ్ ట్రైన్ సాంకేతికతలో రైలు పట్టాలపై నేరుగా నడవదు. బలమైన అయస్కాంత శక్తి సహాయంతో గాల్లో తేలుతూ ముందుకు సాగుతుంది. దీని వల్ల ఘర్షణ తగ్గి అత్యధిక వేగాన్ని సాధించడం సాధ్యమవుతుంది. ఈ రికార్డు స్థాయి వేగం భవిష్యత్తులో రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీయనుంది.
నిపుణుల అంచనా ప్రకారం, బీజింగ్ నుంచి షాంఘై వరకు ప్రయాణం కేవలం రెండు గంటల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు. పర్యావరణహితమైన ఈ రైలు ఇంధన వినియోగాన్ని తగ్గించడమే కాకుండా శబ్ద కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. చైనా ప్రభుత్వం దీన్ని జాతీయ గర్వంగా భావిస్తూ, రాబోయే దశాబ్దాల్లో దేశవ్యాప్తంగా మాగ్లేవ్ రైళ్లను ప్రవేశపెట్టే ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ విజయంతో చైనా ప్రపంచ రవాణా రంగంలో ముందంజలో నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అమెరికా, జపాన్, యూరప్ వంటి దేశాలు కూడా మాగ్లేవ్ ట్రైన్ సాంకేతికతపై పరిశోధనలు చేస్తున్నప్పటికీ, చైనా సాధించిన ఈ వేగం వారిని ఆశ్చర్యపరిచింది. మొత్తంగా, ఈ ప్రయోగం కేవలం చైనాకే కాకుండా ప్రపంచ సాంకేతికతలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది.
Reporter left speechless after witnessing Japan's new $70 million Maglev train in action at 310 mphpic.twitter.com/nexIApcmRh
— Massimo (@Rainmaker1973) November 25, 2025


