బీజింగ్: ప్రముఖ చైనా పండితుడు, దివంగత ప్రొఫెసర్ జి.జియాన్‌లిన్ అనువదించిన రామాయణం ఆధారంగా రూపొందించిన ‘ఆది కావ్యం–మొదటి కవిత’అనే నృత్య రూపకాన్ని చైనా కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు. భారత నాట్యంలో నిపుణురాలైన చైనా కళాకారిణి జిన్ షాన్షాన్ దర్శకత్వంలో, 50 మందికి పైగా ప్రతిభావంతులైన స్థానిక కళాకారులతో కూడిన బృందం ఈ నాటకాన్ని శనివారం ఇక్కడి భారత రాయబార కార్యాలయంలో ప్రదర్శించింది.
ఇది ‘అద్భుతమైన సాంస్కృతిక సమ్మేళనం’.. అని భారత రాయబార కార్యాలయం ట్విట్టర్‌లో అభివరి్ణంచింది. ఈ ప్రదర్శనను పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు వీక్షించారు. ఈ నృత్య రూపకాన్ని బీజింగ్‌లో ప్రదర్శించడం ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలో మొదటిసారి ప్రదర్శించారు. గత నెలలో, రాయబార కార్యాలయం ’సంగమం–భారతీయ తాతి్వక సంప్రదాయాల సమ్మేళనం’ అనే అంశంపై ఒక సదస్సును నిర్వహించింది. ఇందులో ప్రముఖ చైనా పండితులు భగవద్గీత, భారతీయ నాగరికతా విలువలపై ప్రసంగించారు.


