
భారత సంతతి అమ్మాయి అసాధారణమైన ఘనతను సాధించింది. అతి చిన్న వయసులోనే ఇంగ్లాండ్, వేల్స్‌లలో సొలిసిటర్ అయ్యారు. అతి చన్ని వయసులోనే ఈ ఘనతను సాధించి..అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఎవరంటే..
ఆ అమ్మాయే పశ్చిమ బెంగాల్‌కి చెందిన కృషాంగి మేష్రామ్. కేవలం 21 ఏళ్ల వసులోనే సొలిసిటర్ అయ్యింది. 15 ఏళ్లకే మిల్టన్ కీన్స్ ది ఓపెన్ యూనివర్శిటీలో తన లా చదువును ప్రారంభించి.. న్యాయశాస్త్రంలో ఫస్ట్‌క్లాస్ ఆనర్స్ డిగ్రీని పొందింది.
అయితే కృషాంగి మాత్రం 15 ఏళ్లకే ఓపెన్ యూనివర్సిటీలో చదివే అవకాశం లభించడం వల్లే ఈ ఘనత సాధించగలిగానని ఆనందంగా చెప్పుకొచ్చింది. తనకు న్యాయశాస్త్ర పట్ల ఉన్న ప్రగాఢమైన అభిరుచే ఈ విజయానికి కారణమని అంటోందామె. ఓపెన్‌యూనివర్సిటీ ద్వారా లాగ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మరీ ఈ విజయాన్ని అందుకుందామె.
ఎవరీ కృషాంగి మేష్రామ్ అంటే..
పశ్చిమ బెంగాల్‌లో జన్మించి కృషాంగీ ఇస్కాన్ మాయాపూర్ కమ్యూనిటీలో పెరిగింది. 15 ఏళ్ల వయసుకే మాయాపూర్‌లోని ఒక అంతర్జాతీయ పాఠశాలలో మాధ్యమిక విద్యను పూర్తి చేసింది. తర్వాత ఒపెన్ యూనివర్సిటీ(ఓయూ)లో మూడేళ్లలో డిగ్రీ పూర్తి చేసి న్యాయ పట్టా పొందింది. అలా 18 ఏళ్లకే న్యాయశాస్త్రంలో ఫస్ట్‌క్లాస్ ఆనర్స్ డిగ్రీతో పట్టభద్రురాలైందామె.
2022లో ఒక అంతర్జాతీయ న్యాయసంస్థలో ప్రాక్టీసు కూడా ప్రారంభించింది. అలాగే ఆమె హార్వర్డ్ ఆన్‌లైన్‌లో గ్లోబల్ ప్రోగ్రామ్‌లు కూడా చేసింది. పైగా సింగపూర్‌లో వృత్తిపరమైన అనుభవాన్ని సంపాదించింది. ప్రస్తుతం యూకే, యూఏఈలలో చట్టపరమైన అవకాశాలను అన్వేషిస్తోంది. ఇక కృషాంగికి చట్టపరంగా ఫిన్‌టెక్, బ్లాక్‌చెయిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీలునామాలు, ప్రొబేట్ వంటి ప్రైవేట్ క్లయింట్ తదితర సేవలపై ఆసక్తి ఎక్కువ.
(చదవండి: Gaurav Kheterpal: భారతీయ కుటుంబ వ్యవస్థ చనిపోయిందా?)