
లండన్: యూకే ఉప ప్రధానమంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎంజెలా రేనెర్ పదవి నుంచి వైదొలిగారు. ఇటీవల కొనుగోలు చేసిన ఇంటికి తక్కువ పన్ను చెల్లించినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. స్పెషలిస్ట్ ట్యాక్స్ సలహా తీసుకోకుండానే తక్కువ స్టాంప్ డ్యూటీని చెల్లించడం ద్వారా నైతిక ఉల్లంఘనకు పాల్పడినట్లు ప్రచారం జరిగింది.
అధికార లేబర్ పార్టీలో పలుకుబడి కలిగిన నేతగా పేరున్న ఎంజెల్ తనపై వచ్చిన ఆరోపణలపై మంత్రివర్గ స్వతంత్ర కమిటీతో విచారణ చేయించారు. ఈ కమిటీ దర్యాప్తులో ఆరోపణలు నిజమని తేలింది. దీంతో, పదవికి రాజీనామా చేసినట్లు శుక్రవారం ఎంజెలా వెల్లడించారు. రాజీనామా చేయాలని ఎంజెలా తీసుకున్న నిర్ణయం సరైందేనని ప్రధాని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు. సీనియర్ మంత్రిని కోల్పోవడం బాధ కలిగిస్తోందన్నారు.