breaking news
Deputy Prime Minister
-
పెట్టుబడులతో రండి!
మాస్కో: సంక్లిష్టమైన భౌగోళిక సవాళ్లు ఎదుర్కోవడానికి భారత్–రష్యా కలిసికట్టుగా పనిచేయాలని, ఇందుకోసం సృజనాత్మక, నూతన మార్గాలు అన్వేషించాలని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పిలుపునిచ్చారు. రెండు దేశాలు పరస్పర సహకార ఎజెండాను మరింత విస్తృతపర్చుకోవాలని, వైవిధ్య భరితంగా మార్చుకోవాలని చెప్పారు. మరిన్ని ఉమ్మడి కార్యక్రమాల ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యంలో వైవిధ్యం కృషి చేయాలని అన్నారు. భారత్–రష్యా సంబంధాలను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లడం, విభిన్నమైన వాణిజ్య సంబంధాలు నెలకొల్పడం మనం ఆశయం కావాలని స్పష్టం చేశారు. జైశంకర్ బుధవారం మాస్కోలో రష్యా ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్‌మినిస్టర్ డెనిస్ మంతురోవ్‌తో సమావేశమయ్యారు. భారత్–రష్యా సంబంధాలు, తాజా పరిణామలపై చర్చించారు. ఇండియా–రష్యా ఇంటర్–గవర్నమెంటల్ కమిషన్ ఫర్ ట్రేడ్, ఎకనామిక్, సైంటిఫిక్, టెక్నాలాజికల్, కల్చరల్ కో–ఆపరేషన్(ఐఆర్ఐజీసీ–టీఈసీ) ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా ఈ చర్చలు జరిగాయి. భారత్‌పై అమెరికా ప్రభుత్వం భారీగా టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో భారత్–రష్యా సంబంధాల ఆవశ్యకతను జైశంకర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రధానంగా ఇరుదేశాల నడుమ ఆర్థిక బంధం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పూర్తి సామర్థ్యం మేరకు కలిసి పనిచేద్దాం భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని రష్యా పారిశ్రామికవేత్తలకు జైశంకర్ విజ్ఞప్తి చేశారు. వ్యాపార అభివృద్ధికి భారత్‌లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, వీటిని ఉపయోగించుకోవాలని చెప్పారు. నూతన రంగాల్లోనూ స్నేహ సంబంధాలను విస్తరింపజేసుకోవాలని సూచించారు. వ్యాపార, పెట్టుబడుల సంబంధాల్లో పూర్తి సామర్థ్యం మేరకు కలిసి పని చేద్దామని కోరారు. ఇందుకోసం కొన్ని లక్ష్యాలు, గడువులు నిర్దేశించుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. సమున్నత లక్ష్య సాధన కోసం మనకు మనమే సవాలు విసురుకోవాలని వ్యాఖ్యానించారు. చేతులు కలిపి ఉమ్మడిగా పనిచేస్తే నిర్దేశించుకున్న లక్ష్యానికి మించి సాధించవచ్చని స్పష్టంచేశారు. ఐఆర్ఐజీసీకి సంబంధించిన వేర్వేరు వర్కింగ్ గ్రూప్‌లు, బిజినెస్ ఫోరమ్ మధ్య సహకారం కోసం ఒక యంత్రాంగం ఏర్పాటు చేసుకుందామని ప్రతిపాదించారు. ఒకరి ఆలోచనలను మరొకరితో పంచుకోవాలన్నారు. ఇండియా, రష్యాలోని వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఐఆర్ఐజీసీ తోడ్పడుతుందని తెలిపారు. నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, కారి్మకులను రష్యాకు పంపించబోతున్నట్లు జైశంకర్ చెప్పారు. సెర్గీ లావ్రోవ్తో సమావేశం ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సమతుల, స్థిరమైన విధానంలో విస్తరింపజేసుకోవాలని భారత్, రష్యా నిర్ణయించుకున్నాయి. వాణిజ్యం విషయంలో నియంత్రణలు, అవరోధాలను వేగంగా పరిష్కరించుకోవాలని జైశంకర్ చెప్పారు. ఆయన రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్తో భేటీ అయ్యారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో స్థిరంగా కొనసాగుతున్న అతిపెద్ద సంబంధాల్లో భారత్–రష్యా సంబంధాలు కూడా ఉన్నాయని తెలిపారు. వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవాలని జైశంకర్, లావ్రోవ్ నిర్ణయానికొచ్చారు. -
Singapore PM: మే 15న పదవి నుంచి తప్పుకుంటా: లూంగ్
సింగపూర్: సింగపూర్ ప్రధానిగా దాదాపు రెండు దశాబ్దాలపాటు కొనసాగిన లీ సీయన్ లూంగ్(72) రిటైర్మెంట్ ప్రకటించారు. మే 15వ తేదీన బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు లూంగ్ సోమవారం తెలిపారు. అదే రోజూన ఉప ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్(51) ప్రధానిగా బాధ్యతలు చేపడతారన్నారు. సింగపూర్ మూడో ప్రధానిగా 2004లో లూంగ్ బాధ్యతలు చేపట్టారు. ఏ దేశానికైనా నాయకత్వ మార్పిడి ఎంతో ముఖ్యమైన విషయమని ఆయన ఫేస్బుక్లో పేర్కొన్నారు. సింగపూర్‌కు మరింత ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు వాంగ్ ప్రభుత్వానికి సహకారం అందించాల్సిందిగా ప్రజలను ఆయన కోరారు. -
బ్రిటన్ ఉప ప్రధాని రాజీనామా
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు అక్కడ ఎదురు గాలి వీస్తోంది. బ్రిటన్ ఉప ప్రధాని, న్యాయశాఖ మంత్రి డొమినిక్ రాబ్ తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. న్యాయశాఖలో పాటు వైట్హాల్ విభాగాల్లో ఆయన సిబ్బందిపై వేధింపులకు పాల్పడ్డారంటూ గత కొంతకాలంగా ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు కమిటీ రిపోర్ట్ గురువారం ప్రధాని సునాక్‌కు చేరింది. ఈ నేపథ్యంలో శుక్రవారం డొమినిక్ రాబ్ తన పదవులకు రాజీనామా ప్రకటించారు. ఈ సీనియర్ కన్జర్వేటివ్ ఎంపీ తన పేషీలో పని చేసే సిబ్బందిని వేధించినట్లు, అవమానించినట్లు, ఏడ్పించినట్లు.. సిబ్బంది ఫిర్యాదులు చేశారు. ఈ విషయాన్ని బ్రిటిష్ టాబ్లాయిడ్ గార్డియన్ తొలుత బయటపెట్టింది. అయితే.. ఆరోపణలను డొమినిక్ రాబ్ ఖండిస్తూ వస్తున్నప్పటికీ, ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాల్సిందిగా సీనియర్ న్యాయవాది అడమ్ టోలీని కిందటి ఏడాది నవంబర్‌లో నియమించారు ప్రధాని సునాక్. రెండు ఫిర్యాదుల మీద మొదలైన ఈ వ్యవహారంలో దర్యాప్తు.. మలుపులు తీసుకుంటూ ఎక్కడికో పోయింది. రాబ్‌కు వ్యతిరేకంగా ఆధారాలను సేకరించుకుంటూ పోయింది అడమ్ టీం. రాబ్ దగ్గర పని చేసే సిబ్బంది నుంచి వాంగ్మూలం సేకరించి.. నివేదికను సిద్ధం చేసింది. గురువారం ఆ నివేదికను రిషి సునాక్‌కు సమర్పించారు అడమ్ టోలీ. ఆ నివేదిక ఇంకా బహిర్గతం కావాల్సి ఉంది. ఈ లోపే రాబ్ అనూహ్యాంగా రాజీనామా ప్రకటించారు. My resignation statement.👇 pic.twitter.com/DLjBfChlFq — Dominic Raab (@DominicRaab) April 21, 2023 అయితే.. తీవ్ర ఆరోపణలు, రాబ్‌పై దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ సునాక్‌ను.. మంత్రిగా కొనసాగించడంపై ప్రధాని రిషి సునాక్ రాజకీయపరంగా విమర్శలు ఎదుర్కొనే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు కిందటి ఏడాది అక్టోబర్‌లో రిషి సునాక్ యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టగా.. ఈ ఆరు నెలల కాలంలో ముగ్గురు కేబినెట్ మంత్రులు వ్యక్తిగత ప్రవర్తన కారణంగానే పదవుల నుంచి వైదొలగాల్సి రావడం గమనార్హం. -
ఉపప్రధాని భార్యను అపహరించిన ఉగ్రవాదులు
బోకో హరామ్ ఉగ్రవాదులు తెగ రెచ్చిపోతున్నారు. సొంత దేశం నైజీరియాలోనే కాదు, పొరుగున ఉన్న కామెరూన్ లోనూ అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. సరిహద్దు దాటి వచ్చి మరీ కామెరూన్ లోని కోలోఫాటా నగరంపై దాడి చేశారు. చేయడమే కాదు ఏకంగా ఆ దేశ ఉప ప్రధాని అమదౌ అలీ భార్యను, నగర మేయర్ ను, మరి కొంత మందిని అపహరించుకుపోయారు. ఉగ్రవాదులు తమ దేశంలోని తమ రహస్య స్థావరాలకు వీరిని తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. కామెరూన్ ప్రస్తుతం తన సైన్యాలను సరిహద్దు వెంబడి మొహరించింది. ఇప్పటికే నైజీరియాకు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాదులు పొరుగు దేశాల్లో బీభత్సాన్ని సృష్టిస్తున్నారు. బోకో హరామ్ ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తోంది. దీనికి అల్ కాయిదాతో సంబంధాలున్నాయి. పాశ్చత్య విద్యా విధానానికి వ్యతిరేకంగా కూడా బోకో హరామ్ పోరాడుతోంది. ఇప్పటికే నైజీరియాలోని 200 మందికి పైగా విద్యార్థినులను బోకో హరాం ఉగ్రవాదులు అపహరించుకుపోయి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. -
కనీసం ఉప ప్రధాని పోస్టయినా!
ఆనాడు అవకాశం వచ్చినా ప్రధానమంత్రి పదవి కాదనుకున్నా.. ఈనాడు కనీసం ఉప ప్రధానిని కాలేకపోతానా...? అని అనుకుంటున్నారట టీడీపీ అధినేత. ఆలూ లేదు.. చూలూ లేదు.. కొడుకు పేరు ఏదో అన్నట్టు ఇదెక్కడి లెక్కబ్బా... అని తెలుగు తమ్ముళ్లు బుర్రబద్దలు కొట్టుకుంటున్నారట. అసలు ఎన్నికలే లేవు.. పైగా పార్టీ గెలుస్తుందన్న నమ్మకం పార్టీలో ఎవరికీ లేనేలేదు. అలాంటప్పుడు అదీ కేంద్రంలో పెద్ద పోస్టుమీద కన్నేయడంలోని ఆంతర్యమేంటని నేతలు కిందామీదా పడుతున్నారు. ముందేదో చెప్పినా ఇప్పుడు మూడో ఫ్రంట్ ఊసే ఎత్తడం లేదు. మోడీతో జోడీ కట్టాలని ఉబలాటపడుతున్నా అదింకా కుదరనే లేదు. అయినా కాబోయే ఉప ప్రధాని అని ఎందుకు చెప్పుకుంటున్నట్టు...! నేతలకేం పాలుపోవడం లేదట. కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారంతో కొందరు నేతలు అసలు దీనివెనుక ఉన్న మర్మమేంటని తెలుసుకునే పనిలో పడ్డారు. మరోవైపు ‘సుదీర్ఘకాలం సీఎంగా చేశారు. అపొజిషన్ లీడర్‌గా చేశారు. అందుకే ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించార’ంటూ కొందరు నేతలు విలేకరుల వద్ద పనిగట్టుకుని ప్రచారం మొదలుపెట్టారు. మీ నాయకుడు ఏం చేసినా దానివెనుక ఏదో ఒక మతలబు ఉంటుంది కదా...! దీనివెనుకా ఏదో ఉండే ఉంటుందని మీడియా మిత్రులు అడిగినప్పుడు ఒక నేత అసలు గుట్టును విప్పారు. ‘గత నాలుగేళ్లుగా కాంగ్రెస్‌ను కాపాడుతున్నందుకు మా నాయకుడిపై ఈగ కూడా వాలలేదు. రేపటి రోజున కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటారో తెలియదు. రాష్ట్రంలో అధికారం దక్కదని తేలిపోయింది. అందుకే సెంటర్లో అన్ని ఆప్షన్స్ ఓపెన్‌గా పెట్టుకున్నారు. కేంద్రంలో ఎవరొచ్చినా ఎమ్మార్, ఐఎంజీ లాంటి కేసులేవీ తిరగదోడే అవకాశం రాకూడదు..!’ అని ఆ నాయకుడు ఏవో లెక్కలు చెబుతుంటే... ఉప ప్రధాని కథ చెప్పమన్నప్పుడు... ‘అన్నా...! ఉప ప్రధాని పదవి అంటే అందులో హోం శాఖ ఉండే అవకాశమూ ఉంది. దాని పరిధిలోనే సీబీఐ ఉంటుంది...’ అంటూ అసలు గుట్టు విప్పడంతో విస్మయపోవడం మీడియా మిత్రుల వంతైందట.