పుట్టగానే ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో కట్టి పడేశారు.. 40 ఏళ్ల తర్వాత ఇలా..! | UK Man Reunites With Birth Family After Four Decades | Sakshi
Sakshi News home page

పుట్టగానే ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో కట్టి పడేశారు.. 40 ఏళ్ల తర్వాత ఇలా..!

Jun 27 2025 8:40 PM | Updated on Jun 27 2025 9:11 PM

UK Man Reunites With Birth Family After Four Decades

నీకు ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుందనేది మనం కాదనలేని సత్యం.  బ్రతకాలని రాసిపెట్టి ఉంటే ఎలా పడేసినా, ఎక్కడ పడేసినా బ్రతుకుతాం. కర్మ బాలేకపోతే ఎక్కడికి కదలకుండా ఉన్నా కూడా చావును మాత్రం తప్పించలేం. అందుకే విధి రాతను ఎవరూ తప్పించలేరనేది.  అప్పుడే పుట్టిన శిశువును ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో కట్టేసి పడేస్తే ఎవరైనా బ్రతుకుతాడని అనుకుంటారా..? విధి అంటే వింత నాటకం అంటే ఇదేనేమో.. 

యూకేకు చెందిన  ఓ వ్యక్తి.. పుట్టగానే ప్లాస్టిక్‌ బ్యాగ్‌లోకి వెళ్లిపోయాడు.  అతని ఇంట్లో  ఏ పరిస్థితుల కారణమో కానీ ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో కట్టేసి ఓ చోట పడేశారు. ఆ సమయంలో ఆ ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో ఉన్న శిశువును ముగ్గురు టీనేజర్లు బయటకు తీసి జన్మనిచ్చారు. ఆ తర్వాత అతను ఓ కుటుంబానికి దత్తత వెళ్లాడు. 

ఇప్పుడతను తనకు జన్మనిచ్చిన కుటుంబాన్ని కలిశాడు. అది కూడా 40 ఏళ్ల తర్వాత కావడం విశేషం. యూకేలోని ఓ టెలివిజస్‌ నిర్వహించే ‘లాంగ్‌ లాస్ట్‌ లైఫ్‌’ కార్యక్రమానికి వెళ్లిన జాన్‌ స్కార్‌లెట్‌ ఫిలిప్స్‌కు మళ్లీ పుట్టిన వాళ్లను కలిసే భాగ్యం దక్కింది. ఈ షో ద్వారా తన అన్న అతనే అని తెలుసుకున్న సోదరీ, సోదరీమణులు.. ఫిలిప్స్‌ను కలిశారు.  

అయితే తల్లి మాత్రం కలిసే పరిస్థితుల్లో లేదు. మానసికంగా, శారీరకంగా  ఆమె అనారోగ్యంగా ఉండటంతో కేవలం తన కుమారుడికి ఓ సందేశాన్ని మాత్రమే పంపింది. కన్నవాళ్లను నాలుగు దశాబ్దాల తర్వాత కలిస్తే అదొక అరుదైన ఘటనగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పెళ్లి చేసుకుని భార్యతో ఉంటున్న ఫిలిప్స్‌.. ఇకమై కుటుంబంతో కలిసే ఉంటానని అంటున్నాడు. తన సోదరుడు కోసం ఇప్పటి వరకూ చేయని ప్రయత్నం లేదని, ఇన్నాళ్లకు ఇలా కలిశామని అతని కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగితేలుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement