విజేతలకు రూ.58 లక్షల పారితోషికం
లండన్: ప్రపంచంలోని అత్యంత ప్రముఖమైన సాహితీ పురస్కారాల్లో ఒకటైన బుకర్ ప్రైజ్‌ను అందించే బుకర్ ప్రైజ్ చారిటీ శుక్రవారం మరో విశేషమైన ప్రకటన చేసింది. బాలల సాహిత్యానికి బుకర్ పురస్కారాన్ని అందజేయనున్నట్లు తెలిపింది.
‘ఈ సాహిత్యం 8– 12 ఏళ్ల వయస్సున్న పిల్లల కోసం రాసిన లేదా ఆంగ్లంలోకి అనువదించిన అత్యుత్తమ సమకాలీన కాల్పనిక సాహిత్యమై ఉండాలి. యూకే లేదా ఐర్లాండ్‌లో ప్రచురించినదై ఉండాలి’అని బుకర్ ప్రైజ్ చారిటీ తెలిపింది. ప్రముఖులతోపాటు పిల్లలే జడ్జీలుగా వ్యవహరిస్తూ విజేతను ఎంపిక చేస్తారని పేర్కొంది. ఎంపికైన రచయితకు చిల్డ్రన్స్ బుకర్ ప్రైజ్‌గా 50వేల పౌండ్లు, అంటే సుమారు రూ.58 లక్షలను అందజేస్తామని తెలిపింది.


