చికాగోలో ఘనంగా సీఏఏ తృతీయ వార్షికోత్సవ వేడుకలు

CAA Ugadi celebrations held in Chicago - Sakshi

చికాగో : వికారినామ సంవత్సర ఉగాది పండుగ రోజున చికాగో ఆంధ్రా సంఘం(సీఏఏ) తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హిందూ టెంపుల్ అఫ్ గ్రేటర్ చికాగో ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకల్లో వెయ్యి మందికి పైగా పాల్గొన్నారు. ఆటా, పాటలు, హాస్య, పౌరాణిక నాటికలు, సంప్రదాయ భరతనాట్యం, కూచిపూడి నాట్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఇల్లినాయిస్ రాష్ట్ర సెనేట్‌కు ఎన్నికైన తొలి భారతీయుడు, తెలుగువాడు, ఆంధ్ర ప్రాంతంలో మూలాలున్న శ్రీ రామ్ విల్లివాలం ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి యువతరాన్ని ఉద్దేశించి మాట్లాడారు. నేటి యువతరం డాక్టర్, ఇంజనీర్ వృత్తులనే కాకుండా నచ్చిన ఏ రంగంలోనైనా నిరంతర కృషితో తమ కలలను సాకారం చేసుకోవచ్చని ప్రోత్సహించారు. ఫౌండర్స్ ప్రెసిడెంట్ దినకర్ కారుమూరి మాట్లాడుతూ రామ్  విల్లివాలం కూడా చిన్ననాటి నుంచి మన తెలుగు సంస్థలలో ప్రాతినిధ్యం వహించి, నేటి యువతకి మార్గదర్శకంగా నిలిచారని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత  చిత్రకారులు పద్మశ్రీ ఎస్‌వీ రామారావుకి చిత్ర లేఖనం, కవిత్వం, రచనా రంగాలలో వారు చేసిన విశేష కృషిని అభినందిస్తూ జీవిత సాఫల్య పురస్కారం అందించారు. ఈ కార్యక్రమానికి చికాగో ఆంధ్ర సమితి సభ్యులే కాకుండా చికాగో ఇండియన్ ఔట్ రీచ్ అసోసియేషన్ చైర్మన్ కృష్ణ బన్సల్ వంటి పలువురు విచ్చేసి చికాగో ఆంధ్రా సమితి సభ్యులకి ప్రోత్సహం అందించారు. చికాగో ఆంధ్ర సంఘం వారి సేవా విభాగం ఏపీడీఎఫ్‌ఎన్‌ఏ ప్రస్తుత, భవిష్యత్ ప్రణాళికలను ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ వాణి దిట్టకవి వివరించారు.

చికాగో ఆంధ్రా సంఘం వ్యవస్థాపకులు, కార్యవర్గ సభ్యులు సహా 125 మందిపైగా వాలంటీర్లు, 30 మంది నృత్య గురువులు 3 నెలలపాటు శ్రమించి ఈ కార్యక్రమం విజయానికి కృషిచేశారు. శ్రీచైత్య పొనిపిరెడ్డి నాయకత్వంలో జయశ్రీ సోమిశెట్టి, సవిత యాలమూరి-వెర్నేకర్, మల్లేశ్వరి పెదమల్లు, రాజ్ మునగా వేదికను అందంగా అలంకరించగా, ఈ కార్యక్రమాన్ని సాంస్కృతిక బృందం సభ్యులు సాహితి ఆదిమూలం, రామకృష్ణ తాడేపల్లి, సమత పెద్దమారు, పావని కొత్తపల్లి అందరి ప్రశంసలనూ పొందేలా చక్కగా కూర్చి ఆద్యంతమూ చురుకుగా నడిపించారు. ఈ కార్యక్రమానికి సుందర్ దిట్టకవి, అన్విత పంచాగ్నుల, సవిత యాలమూరి-వెర్నేకర్, కార్తీక్ దమ్మాలపాటి వాఖ్యాతలుగా వ్యవహరించి తమ మాటలతో పాటలతో అలరించారు. ఉగాది  సందర్భంగా షడ్రుచుల ఉగాది పచ్చడితో పాటు ఆంధ్ర ప్రాంత రుచులతో భోజనం వడ్డించారు. 

చికాగో ఆంధ్ర సంఘం ప్రెసిడెంట్ పద్మారావు అప్పాలనేని మాట్లాడుతూ, ఈ కార్యక్రమం విజయానికి సీఏఏ కార్యవర్గ  సభ్యులు, వాలంటీర్ల కృషి మరువలేనిదని అన్నారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్,ఉపాధ్యక్షులు డాక్టర్ భార్గవి నెట్టెం మాట్లాడుతూ ఫౌండర్స్ కమిటీ చైర్మన్ దినకర్ కారుమూరి, సంఘ సహ వ్యవస్థాపకులు శ్రీనివాస్ పెదమల్లు, సుందర్ దిట్టకవి, రాఘవ జాట్ల, తన్వి జాట్ల, సంధ్య అప్పలనేని, సెక్రటరి శైలేష్ మద్ది, జాయింట్ సెక్రటరి రాజ్ పొట్లూరి, ట్రెజరర్ అను గంపాల, కార్యవర్గ సభ్యులు శిరీష కోలా, నీలిమ బొడ్డు, సురేష్ శనక్కాయల, సాయి రవి సూరిభొట్ల,  సునీత రాచపల్లి, కిరణ్ వంకాయలపాటి, వెబ్ అండ్‌ డిజిటల్  డైరెక్టర్‌ శ్రీకృష్ణ మతుకుమల్లి, ఏపీడీఎఫ్‌ఎన్‌ఏ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ వాణి దిట్టకవి, రామకృష్ణ తాడేపల్లి, లాజిస్టిక్స్ డైరెక్టర్ గౌరీశంకర్ అద్దంకి, మురళి రెడ్డివారి, సీనియర్స్ కమిటీ సభ్యులు శ్యామ్ పప్పు  రమణమూర్తి ఎడవల్లి, రఘు బడ్డి, యూత్ కమిటీ సభ్యులు నిఖిల్ దిట్టకవి, శృతి మోత్కూరు, మైత్రి అద్దంకిలకు కృతజ్ఞతలు తెలిపారు. 

కార్యక్రమ విజయానికి ఎంతో శ్రమించిన కార్యకర్తలు విజయ్ కొరపాటి, సురేశ్ పొనిపిరెడ్డి, విష్ణు పెద్దమారు, సత్య తోట, సత్య నెక్కంటి, రమేశ్ నెక్కంటి, సురేశ్ ఐనపూడి, సరిత ఐనపూడి, వెంకట్ మక్కెన, మాలతి దామరాజు, మణి తెల్లాప్రగడ, హరచంద్ గంపాల, లక్ష్మీనాగ్ సూరిభొట్ల, ప్రోమో వీడియోలలో పాల్గొన్న సభ్యులకు, రామాలయ ట్రస్ట్ అధ్యక్షులు లక్ష్మణ్, వనమూర్తి, సతీశ్ అమృతూర్, అన్నపూర్ణ విశ్వనాధన్, వీడియో అండ్‌ ఫోటోగ్రఫీ సేవలందించిన యుగంధర్ నాగేశ్‌లతోపాటూ పలువురు కార్యకర్తలకు, అలాగే ఆర్థిక చేయూతనిస్తున్న స్పాన్సర్లకు అధ్యక్షులు పద్మారావు కృతజ్ఞతలు తెలిపారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top