
ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీశైలానికి పాదయాత్రగా తరలివస్తున్నారు

మండుటెండలను సైతం లెక్కచేయకుండా భక్తి మార్గంలో మల్లన్న చెంతకు చేరుకుంటున్నారు

భజనలు చేసుకుంటూ మల్లన్నను కీర్తిస్తూ.. కావడీలు భుజనా ఎత్తుకుని శ్రీగిరి వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు

శ్రీశైల భ్రమరాంబాదేవిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి చీర, సారె సమర్పించేందుకు బయలుదేరారు

కొంత మంది ఇంటి నుంచి పాదయాత్రగా వస్తుండగా.. మరికొందరు ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురం నుంచి నల్లమల అడవుల్లో సుమారు 42 కిలో మీటర్లు పాదయాత్రగా తరలివస్తున్నారు

వృద్ధులు, మహిళలు, చంటి పిల్లల తల్లులు సైతం శ్రీశైలం చేరుకుంటున్నారు

కైలాసద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించుకుని, అక్కడే కొంతసేపు సేదతీరి మల్లన్న, భ్రమరాంబ దర్శనం కోసం కూలైన్లలో బారులుదీరుతున్నారు. శ్రీగిరి భక్తజన సంద్రాన్ని తలపిస్తోంది







