ఉగాది స్పెషల్‌ పోస్టర్లు: ఫిదా అంటున్న సినీ లవర్స్‌

Ugadi Special Posters From Tollywood Movies - Sakshi

ఉగాది పండగ అంటే అందరికీ కొత్త సంవత్సరంగానే తెలుసు.. కానీ సినీ ప్రియులకు మాత్రం ఇది కొత్త పోస్టర్ల పండగ. తెలుగు రాష్ట్రాల ప్రజలు కొత్త సంవత్సరాన్ని ప్రారంభించే ఈ రోజు అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తూ ఎన్నో పోస్టర్లు రిలీజ్‌ అయ్యాయి. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ఆరగిస్తూ ఆ పోస్టర్లేంటో చూసేద్దాం..

ఆయుధమైనా.. అమ్మాయి అయినా.. సిద్ధుడి చేతిలో ఒదిగిపోతుంది అంటూ ఆచార్య నుంచి కొత్త పోస్టర్‌ రిలీజైంది. ఇందులో మెగాస్టార్‌ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ పూజా హెగ్డే కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మే 13న థియేటర్లలో సందడి చేయనుంది. లేదంటే కరోనా విస్తృతిని దృష్టిలో పెట్టుకుని విడుదల వాయిదా పడే అవకాశం ఉంది.

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం లవ్‌స్టోరీ. ఉగాది రోజు స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది చిత్రయూనిట్‌. ఈ సినిమా ఏప్రిల్‌ 16న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా బాట పట్టింది. కొత్త రిలీజ్‌ డేట్‌ ఇంకా ఫిక్స్‌ చేయలేదు.

పండగ రోజు కొత్త షెడ్యూల్‌ మొదలు పెట్టాం అంటున్నారు ఎఫ్‌ 3 యూనిట్‌ సభ్యులు. ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌ ఓ రేంజ్‌లో ఉంటుందని చెప్తున్న ఈ సినిమాను ఆగస్టు 27న రిలీజ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు.

సత్యదేవ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం తిమ్మరుసు. ఉగాది పండగను పురస్కరించుకుని ఈ సినిమా నుంచి సత్యదేవ్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. చిక్కుముడులను విప్పేందుకు తీక్షణంగా ఆలోచిస్తున్నట్లున్న కనిపిస్తున్న ఈ లుక్‌ ఉగాది పచ్చడిలా బాగుందంటున్నారు సినీ లవర్స్‌. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 21న విడుదల కానుంది.

కుటుంబంతో కలిసి బయటకు పయనమయ్యాడు నారప్ప. ఇంతకుముందు ఉగ్రరూపంలో కనిపించి భయపెట్టిన వెంకటేశ్‌ ఇందులో మాత్రం ఫ్యామిలీమ్యాన్‌గా ఆకట్టుకున్నాడు.

సాయి పల్లవి అచ్చమైన గ్రామీణ యువతిగా నటిస్తున్న చిత్రం విరాట పర్వం. ఉగాది పర్వదినాన స్పెషల్‌ పోస్టర్‌తో విందు భోజనం పెట్టింది చిత్రయూనిట్‌. సాయిపల్లవి కడప మీద ముగ్గు వేస్తున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్‌ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. రానా దగ్గుబాటి నక్సలైట్‌ నాయకుడిగా కనిపించనున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 30న విడుదలవుతోంది.

కన్నడ స్టార్‌ కిచ్చా సుదీప్‌ హీరోగా నటిస్తున్న చిత్రం కే3 కోటికొక్కడు. తాజాగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌లో స్మార్ట్‌గా కనిపిస్తున్నాడు సుదీప్‌. డబ్బింగ్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయంటోంది చిత్రయూనిట్‌.

ఫ్యామిలీ పిక్‌ను షేర్‌ చేసింది టక్‌ జగదీష్‌ టీమ్‌. ఇందులో నేచురల్‌ స్టార్‌ నాని సకుటుంబ సపరిమేతవారంగా పండగ వేడుకలు జరుపుకుటున్నట్లుగా ఉంది. అందరూ నవ్వులు చిందిస్తోన్న ఈ లుక్‌ నాని ఫ్యాన్స్‌కు తెగ నచ్చింది. ఏప్రిల్‌ 23న విడుదల కావాల్సిన టక్‌ జగదీష్‌ను కరోనా వల్ల వాయిదా వేశారు.

గోపీచంద్‌ సిటీమార్‌ నుంచి మాస్‌ లుక్‌ను రిలీజ్‌ చేసింది చిత్రయూనిట్‌. ఐదుగురు ఆడవాళ్లు బైక్‌ నడుపుతున్న పోస్టర్‌ను రిలీజ్‌ చేయగా ఇది ఊరమాస్‌గా ఉందంటున్నారు నెటిజన్లు.

సన్‌ ఆఫ్‌ ఇండియా నుంచి మోహన్‌బాబు లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాను విష్ణు మంచ్‌ నిర్మిస్తున్నాడు.

సీతాయణం నుంచి ఉగాది స్పెషల్‌ పోస్టర్‌ రిలీజైంది.

మేలో వస్తున్నామంటున్న కోతి కొమ్మచ్చి..

సెకండ్‌ షెడ్యూల్‌ మొదలు పెట్టామంటున్న సర్కారు వారి పాట

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top