Ugadi 2022: శ్రీ శుభకృత్‌ నామ సంవత్సర కర్తరీ నిర్ణయం

Ugadi 2022 Telugu Panchangam Subhakruth Nama Kartari Nirnayam - Sakshi

డొల్లు కర్తరీ ప్రారంభం: 04–05–2022, రా.12:04లకు అనగా (05/05) శుభకృత్‌నామ సంవత్సర వైశాఖ శుద్ధ చవితి బుధవారం రాత్రి తెల్లవారితే గురువారం మృగశిరా నక్షత్రం రోజున రవి భరణి నక్షత్రం మూడవ పాదంలో ప్రవేశించడంతో డొల్లుకర్తరీ ప్రారంభం అవుతుంది.
పెద్ద కర్తరీ ప్రారంభం: 11–05–2022, రా.10:04లకు శుభకృత్‌ నామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి తత్కాల ఏకాదశి బుధవారం ఉత్తరఫల్గుణీ నక్షత్రం రోజున రవి కృత్తికలో ప్రథమపాదంలో ప్రవేశించడంతో పెద్దకర్తరీ ప్రారంభం అవుతుంది.  ‘మృద్దారు శిలాగృహకర్మాణి వర్జయేత్‌’ మట్టి, కర్ర, రాయి ఉపయోగించి చేయు గృహకర్మలు ప్రారంభించడానికి కర్తరీకాలం సరైనది కాదు. పై సూత్రం ఆధారంగా దీనికి వాస్తుకర్తరీ అని పేరు. శంఖుస్థాపన, ద్వారం ఎత్తుట, పాకలు, షెడ్‌లు, పెంకుటిళ్ళు, పైకప్పు నిర్మాణ పనులు ప్రారంభించడం శ్రేయస్కరం కాదు.    
కర్తరీ పూర్తి (త్యాగం): 29–05–2022, ఉ.7:37లకు వైశాఖ బహుళ చతుర్దశి ఆదివారం కృత్తికా నక్షత్రం రోజున రవి రోహిణి నక్షత్రం రెండవ పాదంలో ప్రవేశించడంతో కర్తరీకాలం పూర్తవుతుంది.

మూఢమి వివరములు
శుక్ర మూఢమి: (15–09–2022 నుంచి 1–12–2022 వరకు)
మూఢమి ప్రారంభం: 15–9–2022 శుభకృత్‌ నామ సంవత్సరం భాద్రపద బహుళ పంచమి గురువారం రోజున శుక్రుడు రవి నుండి ప్రాగస్తం (అనగా తూర్పుదిశగా అస్తమించడం వలన) మూఢమి ప్రారంభం అయినది. 
మూఢమి అంత్యం: 1–12–2022 మార్గశిర శుద్ధ అష్టమి రోజున శుక్రుడు రవి నుండి పశ్చాదుదయం (అనగా పశ్చిమ దిశగా ఉదయించడం) వలన మూఢమి పూర్తవుతుంది. నోట్‌: మూఢమికి ముందు కొన్ని రోజులు గ్రహాలకు వృద్ధత్వం అని పేరు. మూఢమి తరువాత బాలత్వం అని పేరు. ఆ రోజులలో శుభకార్యములు చేయరాదు.
మకర సంక్రాంతి పురుష లక్షణమ్‌: 14–01–2023, రా.గం.2:14లకు (ఘ.49–01) స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం హేమంత ఋతువు పుష్య మాసం బహుళ సప్తమి తత్కాల అష్టమి శనివారం రాత్రి తెల్లవారితే ఆదివారం చిత్తా నక్షత్రం రెండవ పాదం కన్యారాశి సుకర్మయోగం బాలవకరణం తులాలగ్నం సమయంలో రవి మకరరాశి ప్రవేశం. సూ.ఉ.6:38. సూ.అ.5:40. దినప్రమాణం 27:36.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top