breaking news
Ugadi 2022
-
కెనడాలో ‘తాకా’ ఆధ్వర్యంలో వైభవంగా ఉగాది ఉత్సవాలు
కెనడా లో తెలుగు అలయెన్స్ ఆఫ్ కెనడా (తాకా) ఆధ్వర్యంలో శుభకృత్ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలను టొరంటోలోని టొరంటో పెవిలియన్ వేదికలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1200 మందికి పైగా కెనడాలోని తెలుగు వారు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి రేణు కుందెమ్, అనిత సజ్జ, ఖాజిల్ మహమ్మద్, విద్య భవనం వ్యాఖ్యాతలు గా వ్యవహరించారు. తాకా అధ్యక్షులు కల్పనా మోటూరితోపాటు రంజిత హంసాల, రజిని లయం, గీత దేసు, వీణ మార్పిన జ్యోతి ప్రజ్వలనతో ఉగాది సంబరాలను ప్రారంభించారు. అనంతరం కెనడా -భారత దేశ జాతీయ గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమానికి టొరంటో ఇండియన్ కాన్సులేట్ జనరల్ అపూర్వ శ్రీవాస్తవ ముఖ్య అతిథిగా విచ్చేశారు.. అపూర్వ ‘తాకా’ విశిష్టత గురించి , టొరంటోలోని తెలుగు కమ్యూనిటీ కోసం తాకా వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు గురించి కొనియాడారు. తాకా అధ్యక్షులు కల్పన మోటూరి, తాకా కార్య వర్గ సంఘం సభ్యులు అపూర్వ శ్రీవాస్తవను సత్కరించారు. అలాగే ఈ కార్యక్రమానికి ప్రధాన ధాత గెట్ హోమ్ రియాల్టీ రమేష్ గొల్లు , ఆనంద్ పేరిచర్ల ను సత్కరించారు. వారికి మొమెంటో అందజేశారు. ఈ సందర్భంగా తాకా కార్యవర్గం తాకా ప్రధాన వ్యవస్థాపక సభ్యులు చారి సామంతపూడి కమ్యూనిటీకి చేస్తున్న పలు రకాల సేవా కార్యక్రమాలని ఎంతగానో ప్రశంసించి చిరు సత్కారంతో గౌరవించారు. తాకా అధ్యక్షులు కల్పన మోటూరి తాకా వ్యవస్థాపకతను వివరిస్తూ తాకా చేస్తున్న కార్యక్రమాలను, ముఖ్యంగా గత రెండు సంవత్సరాలలో జరిపించిన కార్యక్రమాలను వివరించారు. టొరంటో లో ఉన్న తెలుగు పూజారి మంజునాథ సిద్ధాంతి ఉగాది పంచాంగ శ్రవణం గావించారు. ఆరు గంటల పాటు దాదాపు 35 సాంస్కృతిక కార్యక్రమాలతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా సాగింది. 130 కి పైగా చిన్నారులు పెద్దలు చేసిన తెలుగు సాంస్కృతిక.. చలన చిత్ర నృత్య ప్రదర్శనలు, ఫ్యాషన్ షో, పాడిన గీతాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసాల, కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి, కోశాధికారి మల్లికార్జున చారి పదిర, సాంస్కృతిక కార్యదర్శి రాజారామ్ మోహన్ రాయ్ పుల్లంశెట్టి, డైరెక్టర్స్ అనిత సజ్జ, గణేష్ తెరాల,రాణి మద్దెల, యూత్ డైరెక్టర్స్ విద్య భావనం, ఖాజిల్ మహమ్మద్ , బోర్డు ఆఫ్ ట్రస్టీ చైర్మన్ మునాఫ్ అబ్దుల్, సభ్యులు రాఘవ అల్లం, సురేష్ కూన, వాణి జయంతి, ప్రవీణ్ పెనుబాక, ఇతర వ్యవస్థాపక చైర్మన్ రవి వారణాసి, సభ్యులు చారి సామంతపూడి, అరుణ్ లయం ,లోకేష్ చిల్లకూరు,రమేష్ మునుకుంట్ల, రాకేష్ గరికపాటి, శ్రీనాథ్ కుందూరు, రామ చంద్ర రావు దుగ్గిన అందరి వాలంటీర్లను తాకా అధ్యక్షులు కల్పన మోటూరి అభినందించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వచ్చంధ కార్యకర్తలకు తాకా కార్యవర్గం ధన్య వాదాలు తెలిపింది.. చివరిగా తాకా ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసాల, అరుణ్ లయం, తాకా కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి గారు కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు వారందరికీ, దాతలకు, అతిధులకు ధన్యవాదాలను తెలిపారు. చదవండి: భారతీయులకు స్వాగతం.. ఛాయ్ సమోసా అన్నీ సిద్ధం -
జర్మనీలో ఘనంగా ఉగాది వేడుకలు
జర్మనీలో మన తెలుగు అసోసియేషన్(MATA) ఆధ్వర్యంలో ఉగాది-2022 పండుగ వేడుకలు వైభవంగా జరిగాయి. ఉగాది ఉత్సవాలను తెలుగు సంఘం సభ్యులు మ్యూనిచ్‌లోని సమావేశమై వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలతో తెలుగుదనం ఉట్టిపడేలా వేడుకలను జరుపుకున్నారు. మంచు కారణంగా వాతావరణం చాలా అధ్వాన్నంగా ఉన్నప్పటికీ...ఉగాది-2022 పండుగ వేడుకలను జరుపుకోవడానికి తెలుగువారు భారీ సంఖ్యలో హాజరైనారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మ్యూనిచ్ కాన్సులేట్ జనరల్ (CGI) విచ్చేశారు. గత 5 సంవత్సరాలుగా పిల్లల కోసం తెలుగు తరగతులను మన తెలుగు అసోసియేషన్ నిర్వహిస్తోంది. అంతేకాకుండా పిల్లల కోసం మన తెలుగు బడి బృందం ఒక పాఠ్య పుస్తకాన్ని తయారు చేసింది. దీనిని ముఖ్య అతిథి మ్యూనిచ్ కాన్సులేట్ జనరల్ (CGI) ఆవిష్కరించారు. వేడుకలకు విచ్చేసిన అతిథులందరికీ ఉగాది పచ్చడిని, పంచాగం శ్రవణం కూడా నిర్వహించారు. సభ్యులందరికీ సంప్రదాయ వంటకాలను మన తెలుగు అసోసియేషన్ ఏర్పాటు చేసింది. చదవండి: చిత్రలేఖనంతో అబ్బురపరుస్తున్న ఎన్ఆర్ఐ..! -
అల్లు అర్జున్ జాతకం అలా, అఖిల్ జాతకం ఇలా!.. జ్యోతిష్యుడి జోస్యం వైరల్
ప్లవనామ సంవత్సరం నుంచి శుభకృత్ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ సందర్భంగా అందరూ వారి జాతకాలు ఎలా ఉన్నాయో అని ఓసారి పంచాంగాన్ని తిరగేస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది తమ అభిమాన తారల జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలని తహతహలాడుతున్నారు. దీంతో యూట్యూబ్‌లో పలువురు పండితులు ఈ ఏడాది రాజకీయ నాయకులతో పాటు సినీ తారల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ వీడియోలు చేస్తున్నారు. ఈ క్రమంలో వేణు స్వామి అనే పండితుడు టాలీవుడ్ సెలబ్రిటీలపై చెప్పిన జోస్యం ప్రస్తుతం వైరల్‌గా మారింది. వేణుస్వామి మాట్లాడుతూ.. 'నాగచైతన్య, సమంత విడిపోతారని పెళ్లికి ముందే చెప్పాను. అప్పుడు నన్ను నానాబూతులు తిట్టారు. కానీ చివరకు అదే నిజం కావడంతో చాలామంది రియలైజ్ అయ్యారు. పబ్లిక్ డొమైన్లో ఉన్నవాళ్ల గురించి నేను మాట్లాడి తీరతాను. ఉదాహరణకు ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీలో ఇద్దరు హీరోలకు సంబంధించి సంచలనాలు నమోదు కాబోతున్నాయి. వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తి సినిమాలు ఆగిపోయే చాన్స్ ఉంది. టాలీవుడ్లో మంచి జాతకమున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది అల్లు అర్జున్ ఒక్కరే. రాబోయే ఐదు సంవత్సరాల్లో ఆయన జాతకంలో ఎటువంటి మార్పులుండవు. ఆయన తీసే ప్రతి సినిమా పాన్ ఇండియా లెవల్లో రూ.200 కోట్ల పైనే బిజినెస్ చేస్తుంది. ఆయనొక బంగారు బాతు. జూనియర్ ఎన్టీఆర్, రానా, మహేశ్‌బాబుల జాతకం కూడా బాగానే ఉంది. అక్కినేని అఖిల్ జాతకంలో నాగదోషం ఉంది. ఎవరి ఇన్ఫ్లూయెన్స్ లేకుండా సినిమాలు చేస్తే కచ్చితంగా హిట్ కొడతాడు. సమంత జాతకం బాగుంది. చైతో విడాకుల తర్వాత ఆమెపై పెరిగిన నెగెటివిటీ ఈ సంవత్సరం తగ్గబోతోంది. 2024 వరకు టాలీవుడ్లో రష్మిక, సమంత, పూజా హెగ్డేలకు తిరుగులేదు. ఏలినాటి శని ఉన్న పెద్ద దర్శకులకు ఊహించిన విజయాలు రాకపోవచ్చు' అని జోస్యం పలికాడు. చదవండి: ప్రేమకు ఎండ్ కార్డ్, లైగర్ బ్యూటీ బ్రేకప్! -
డైలాంగ్ కింగ్ సాయి కుమార్ ‘వన్ బై టూ’ ట్రైలర్ విడుదల
డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రధాన పాత్రలో ఆనంద్, శ్రీ పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం వన్ బై టు. శివ ఏటూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపద్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ట్రైలర్ విషయానికి వస్తే.. హీరోయిన్ శ్రీపల్లవి లుక్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఇక ట్రైలర్ చివరిలో తన పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది. ఇందులో సాయికుమార్‌ను చాలా పవర్ ఫుల్‌గా చూపించారు. ఎవరైనా మహిళల పై అనుచితంగా ప్రవర్తిస్తే వాళ్ళను శిక్షించే పాత్రలో సాయికుమార్ ఒదిగిపోయారు. హీరోయిన్ తండ్రిగా కాశీ విశ్వనాథ్ ముఖ్యమైన పాత్ర పోషించారు, కొడుకు ప్రేమను అర్థం చేసుకునే మధ్యతరగతి తండ్రిగా దేవీ ప్రసాద్ కనిపించారు. విజయ భారతి రాసిన ‘నొప్పి తెలియకుండా మనిషిని సక్కగా చేయటానికి నేను డాక్టర్ ని కాదు, రోజుకొకలా హింసించే యమధర్మరాజుని’సాలీడ్ డైలాగ్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. కాగా ఈ మూవీని చెర్రీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై కరణం శ్రీనివాసరావు నిర్మించారు. ఇప్పటికే సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని ఏప్రిల్ 22వ తేదీన విడుదల చేయబోతున్నారు. -
సీజేఐ నివాసంలో ఉగాది వేడుకలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నివాసంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. శనివారం సాయంత్రం జరిగిన వేడుకలకు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ హిమా కోహ్లీ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ పాటు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయవాదులు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, డీఆర్డీవో చైర్మన్ సతీశ్ రెడ్డి, తెలుగు సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం, వేద ఆశీర్వచనం, సినీ గాయకులు కారుణ్య, సాహితీల సంగీత విభావరి జరిగింది. తెలుగు వంటకాలతో ఘనంగా విందు ఏర్పాటు చేశారు. -
కేసీఆర్‌కు రాజయోగమే
సాక్షి, హైదరాబాద్: ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశిలో జన్మించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ సంవత్సరం చాలా బాగుంటుందని శృంగేరీ ఆస్థాన పండితులు, పౌరాణికులు బాచంపల్లి సంతోషకుమార్ శాస్త్రి తెలిపారు. ‘రాహులో రవి అంతర్దశ ఫిబ్రవరి 27తో ముగిసింది. అనుకూలం కాని సమయం ముగిసిపోయింది. ఇక గుహ నుంచి బయటకు వచ్చుడే తర్వాయి అన్నట్టుగా ఉంటుంది. జాతక బలం గతేడాది కంటే మెరుగ్గా ఉంటుంది. ఏప్రిల్ నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉంది. శని గోచారం వల్ల ప్రత్యర్థులు నిరంతరం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నా వారికి ఏమాత్రం సందివ్వకుండా వారినే ఆక్రమించేలా ముందుకు సాగుతారు. దేశం మొత్తం కూడా దృష్టి సారించదగ్గ సాహసోపేత నిర్ణయాలను కేసీఆర్ తీసుకుంటారు. విశ్వరూపమే చూపిస్తారు..’అని చెప్పారు. ఈ ఏడాది కరోనా భయం ఉండదని, శుభకృత్ నామ సంవత్సరంలో మానవాళి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని పేర్కొన్నారు. శుభకృత్ నామ ఉగాది సందర్భంగా శనివారం ప్రగతి భవన్లో ప్రభుత్వపరంగా నిర్వహించిన వేడుకల్లో బాచంపల్లి పంచాంగాన్ని పఠించి వివరించారు. అద్భుత పాలన చూస్తాం ‘తృతీయాధిపతి రవి రాజ్యస్థానంలో ఉండటం వల్ల మందీ మార్బలం, వాగ్ధాటి ఉన్నవారిదే ఇక హవా. జాతక రీత్యా పంటలతో పాటు తెలంగాణలో అద్భుత పాలనను మనం ఈ సంవత్సరం చూస్తాం. దేశం దృష్టి తెలంగాణపై పడేలా రాష్ట్రం పురోగమిస్తుంది. చక్కటి పాలనతో ముఖ్యమంత్రి కేసీఆర్ రంజింపజేస్తారు. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పాలన సాగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కేసీఆర్‌కు ఇంటెలిజెన్స్ రూపంలో మూడో కన్ను ఉంది. ఎవరు ఎవరిని కలుస్తున్నారో తెలుసుకుంటూనే ఉంటారు. పార్టీలు మారే వారికి గడ్డుకాలం..’అని చెప్పారు. మంచి వానలు, పంటలతో రైతు రాజ్యం ‘మంచి వానలు, మంచి పంటలతో రైతు రాజ్యం వెల్లివిరుస్తుంది. కర్షక ప్రజాస్వామ్యం కోరుకుంటున్నందున, ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్న తెలంగాణలో రైతులే రాజులు కానున్నారు. 2015 నుంచి ఇప్పటివరకు వానలకు ఇబ్బంది లేనట్టే ఈ యేడు కూడా మంచి వానలు కురుస్తాయి. వరి, గోధుమలు, వేరుశనగలు, ధనియాలు, జొన్న, రబీ పంటలు అద్భుతంగా పండుతాయి. మొక్కజొన్న, రాగి, కందులు, నువ్వులు, ఇతర పప్పు ధాన్యాలు లాంటి పంటలకు కొంత ఇబ్బంది తప్పదు. శ్రావణ, భాద్రపద ఆశ్వయుజ మాసాల్లో భారీ వర్షాలు కురుస్తాయి..’అని బాచంపల్లి తెలిపారు. మహిళకు దేశంలో అత్యున్నత పదవి ‘విద్యారంగంలో సంస్కరణలు, కొత్త విధివిధానాలపై ప్రభుత్వాలు దృష్టి సారిస్తాయి. తెలంగాణ నిరుద్యోగుల కలలు నెరవేరబోతున్నాయి. దీన్ని ఉద్యోగనామ సంవత్సరంగా భావించొచ్చు. దేశంలో అత్యున్నత పదవి మహిళకు వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ సంవత్సరం వేములవాడ రాజరాజేశ్వరుడి ప్రభ వెలగబోనుంది. ప్రజలకు క్షేమాన్ని, ఆరోగ్యాన్ని వృద్ధి చేసే ఉత్సవాలతో సంవత్సరం గడుస్తుంది. ఆన్లైన్ క్లాసులుండవు, బడి గంటలే వినిపిస్తాయి. ఆర్టీపీసీఆర్ టెస్టులు, మాస్కుల అవసరం ఉండదు. ఆనందంగా ఊపిరి పీల్చుకోవచ్చు..’అని చెప్పారు. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు. ‘సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొంత పెరుగుతాయి. రాజకీయంగా చాలా మార్పులు జరుగుతాయి. ఏప్రిల్, మేలలో ముఖ్యనేతలకు భద్రతాపరంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మత ఉద్రిక్తతలు కూడా చోటు చేసుకుంటాయి. పాకిస్తాన్‌తో దౌత్యపరమైన యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. హైదరాబాద్ వరకు రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకోనుండగా, మిగతా ప్రాంతాల్లో అనుకూలంగా ఉండదు. యావత్ భారతదేశం దృష్టి హైదరాబాద్ మీదే ఉంటుంది..’అని వివరించారు. -
ఉగాది ఫీస్ట్ ఇచ్చిన బీస్ట్, ఆకట్టుకుంటున్న ట్రైలర్
Vijay Beast Trailer Launched : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే జోడిగా నటించిన చిత్రం 'బీస్ట్'. ఈ సినిమా గురించి తాజా అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. డాక్టర్ ఫేం నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి తాజా అప్డేట్ వచ్చేసింది. ఉగాది రోజు ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే ఏప్రిల్ 2(ఉగాది) కొద్ది సేపటి క్రితం ట్రైలర్‌ను లాంచ్ చేశారు. చదవండి: సర్కారు వారి పాట.. మహేష్‌బాబు ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే అప్డేట్.. కాగా సౌత్ ప్రేక్షకులు ఎప్పటి నుంచో బీస్ట్ ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో మేకర్స్ నేడు విడుదల చేశారు. దీంతో ట్రైలర్ విడులైన కొద్ది క్షణాల్లోనే వేలల్లో వ్యూస్ రాబట్టింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్లో కళానిధి మారన్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 13న విడుదల చేయబోతున్నట్లు ఇటీవల చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. యాక్షన్ సీన్స్ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. చదవండి: కృతిశెట్టి నో చెప్పిన ప్రాజెక్ట్‌కు ‘మహానటి’ గ్రీన్ సిగ్నల్ ‘రాజకీయ నాయకుడిని కాదు.. సైనికుడిని’ అనే డైలాగ్ ఈళలు వేయించాలే ఉంది. ఇక ఇందులో విజయ్ లుక్, ఫైట్ సీన్స్ మరో లెవల్లో ఉన్నాయి. 2.56 నిమిషాల నిడివితో విడుదలైన ఈ ట్రైలర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేస్తుంది. చెప్పాలంటే ఈ ఉగాది సందర్భంగా విజయ్ ఫ్యాన్స్‌కు బీస్ట్ ట్రైలర్ మంచి ఫీస్ట్ ఇచ్చేలా కనిపిస్తుంది. కాగా యంగ్ మ్యూజిక్ సన్సెషన్ అనిరుద్ రవిచంద్రన్ స్వరాలను అందిస్తున్న ఈ మూవీలోని పాటలకు వీపరితమైన రెస్పాన్స్ వస్తుంది. ఇటీవల విడుదలైన అరబిక్ కుత్తు పాట సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
సర్కారు వారి పాట.. మహేష్‌బాబు ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే అప్డేట్..
ఉగాది పండగ సందర్భంగా మహేశ్‌బాబు ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే అప్డేట్ ఇచ్చింది ‘సర్కారు వారి పాట’ మూవీ టీం. తాజాగా ఈ మూవీలోని మహేశ్ న్యూలుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా మేకర్స్ ‘ఈ న్యూయర్కు మాస్ కొత్త నిర్వచనం’ అంటూ మహేశ్ మాస్ లుక్‌ను పంచుకున్నారు. ఇది విడుదలైన కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఈ పోస్టర్లో మహేశ్‌ను చూస్తుంటే.. విలన్‌ను ఇరగదీసేందుకు రెడీ అవుతున్నట్టుగా ఉంది. ఈ మాస్‌లుక్ చూసి మహేశ్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. కాగా పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ హీరోయిన్గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో మహేశ్ బ్యాంకు ఉద్యోగిగా కనిపించనున్నాడు. This new year, MASS has a new definition 😎 Happy Ugadi ❤️ Get ready for exciting updates for #SarkaruVaariPaata soon 💥#SVPOnMay12 Super 🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @madhie1 @MusicThaman @14ReelsPlus @GMBents @saregamasouth pic.twitter.com/6b58yn8xWD — Mythri Movie Makers (@MythriOfficial) April 2, 2022 -
శుభకృత్ నామ సంవత్సర పంచాంగ శ్రవణం
-
ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
-
సీఎం జగన్ దంపతులకు పట్టువస్త్రాలు సమర్పణ
-
రాష్ట్ర ప్రజలందరికీ శుభాలు కలగాలి: సీఎం జగన్
-
సినీ తారల శుభాకాంక్షలు.. నెట్టింట ఉగాది సందడి
Cine Celebrities Wishes On Ugadi 2022: ఏప్రిల్ 2 శనివారం.. అంటే తెలుగువారికి కొత్త సంవత్సరం. ఈరోజు నుంచి 'శ్రీ శుభకృత్ నామ' తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు సాంప్రదాయకంగా భావించే ఈ ఉగాది పర్వదినాన్ని దక్షిణ భారతదేశంలో ఎక్కువగా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో న్యూ తెలుగు ఇయర్ ప్రారంభంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా సినీ తారలు సోషల్ మీడియా వేదికగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఉగాది శుభాకాంక్షలతో సోషల్ మీడియాలో పండుగ హడావిడి కనిపిస్తూ సందడిగా మారింది. 'శ్రీ శుభకృత్ నామ' సంవత్సరంలో ప్రతి ఒక్కరికీ అన్ని శుభాలే జరగాలని మెగాస్టార్ చిరంజీవి కోరుకున్నారు. సోషల్ మీడియా వేదికగా శనివారం ఉదయం అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవితోపాటు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మహేశ్ బాబు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మహానటి కీర్తి సురేష్, డైరెక్టర్ శ్రీనువైట్ల, యంగ్ హీరో సుధీర్ బాబు, బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ సహా పలువురు సినీ ప్రముఖులు నెట్టింట తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ శ్రీ శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు ! ఈ ఉగాది అందరికీ అన్ని శుభాలు కలిగించాలని, అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లి విరియాలని కోరుకుంటున్నాను! 💐 pic.twitter.com/oFmh1H8IWQ — Chiranjeevi Konidela (@KChiruTweets) April 2, 2022 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, అంటే ఉగాది. ఈ ఉగాది నుంచైనా మనందరికీ మంచి జరగాలని భగవంతుడ్ని కోరుకుంటున్నాను. "శ్రీ శుభకృత్" నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!! మీ మోహన్ బాబు#HappyUgadi #ఉగాది pic.twitter.com/3deIDbWYns — Mohan Babu M (@themohanbabu) April 2, 2022 Wishing you all a very happy Ugadi! May this day usher in love, harmony and prosperity! 🙏 — Mahesh Babu (@urstrulyMahesh) April 2, 2022 మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. Wishing everyone a Happy Ugadi, Gudi Padwa and Chaitra Sukhladi. — Jr NTR (@tarak9999) April 2, 2022 I wish you all a very Happy Ugadi ♥️ May God bless us all with peace and positivity ♥️ — Sai Pallavi (@Sai_Pallavi92) April 2, 2022 శుభకృత నామ సంవత్సరం మన అందరికీ సకల శుభాలను చేకూర్చాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు 🪴🥭🌺🍃 May the New Year bring happiness , wisdom, health and prosperity!! pic.twitter.com/ks7NopD9fv — Sreenu Vaitla (@SreenuVaitla) April 2, 2022 ఈ కొత్త ఏడాది మీకు ఆనందాన్ని , ఆరోగ్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను. అందరికి శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) April 2, 2022 అందరికి ఉగాది శుభాకాంక్షలు 😊🥭🌾 pic.twitter.com/uxjaFSbDnR — Ritu Varma (@riturv) April 2, 2022 వికారి, శార్వరి , దాటి ఆశలు మొలకెత్తించే ప్లవ నామంలోకి వచ్చి , ఇప్పుడు శుభాలు అందించే శుభకృత్ నామ వసంతంలోకి అడుగుపెట్టాము 😃ఈ శుభకృత్ మీకు మీ కుటుంబ సభ్యులకు సకల శుభాలు చెయ్యాలని కోరుకుంటూ , నూతన తెలుగు వత్సర శుభాకాంక్షలు 🌹 pic.twitter.com/7nnTO69XJL — Paruchuri GK (@GkParuchuri) April 2, 2022 Looking forward to another year of happiness, love and prosperity for all! Gudi Padwa aur Ugadi ki sabhi ko shubhkaamnayein ✨#happygudipadwa — Ajay Devgn (@ajaydevgn) April 2, 2022 -
ఉగాది పచ్చడి కలుపుతున్న ఎమ్మెల్సీ కవిత
-
విశాఖ శారదపీఠంలో ఉగాది వేడుకలు
-
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు
-
ప్రగతి భవన్ లో ఉగాది వేడుకలు
-
వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు
సాక్షి,తాడేపల్లి: శుభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగకు తెలుగు లోగిళ్లు ముస్తాబయ్యాయి. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం అన్ని ఆలయాల్లో పంచాంగ శ్రవణంతో పాటు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించనుంది.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు ప్రారంభమయ్యాయి. పండుగ రోజు పురస్కరించుకుని వైఎస్సార్సీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మేరుగు నాగార్జున పాల్గొన్నారు. -
AP: శుభకృత్‌లో అన్నీ శుభాలే
సాక్షి, అమరావతి: శుభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ శుభాలు జరుగుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ పంచకట్టులో సీఎం వైఎస్ జగన్, సతీమణి భారతితో కలిసి ఈ వేడుకలకు ముఖ్య అతి«థులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ రోజు శుభకృత్ నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామని, పంచాంగాలన్నీ ఈ పేరులోనే శుభం అన్న మాట కనిపిస్తోందని చెబుతున్నాయని తెలిపారు. సతీమణి భారతీరెడ్డికి కంకణం కడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో విప్ చెవిరెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి తదితరులు ఈ సంవత్సరం అంతా రాష్ట్ర ప్రజలందరికీ శుభం జరుగుతుందని చెబుతున్న నేపథ్యంలో దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు మనందరి ప్రభుత్వానికి ఇంకా బలాన్నివ్వాలని కోరుకుంటున్నానన్నారు. ఈ సంవత్సరం అంతా ప్రజలందరికీ ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని మనసారా కోరుకుంటున్నానని చెప్పారు. ఇక్కడ ఉన్న అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, మిత్రులే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మకు, ప్రతి తాతకు, అవ్వకు, ప్రతి సోదరుడు, స్నేహితుడికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. క్యాలెండర్లు, పుస్తకాలు ఆవిష్కరించారు. సీఎం దంపతులకు ఘన స్వాగతం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన సీఎం దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. వేద ఆశీర్వచనం అందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, సాంస్కృతిక, పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, ఇతర అధికారులు స్వాగతం పలికారు. పంచాంగ శ్రవణ వేదిక వద్దకు వస్తున్న సమయంలో సీఎం వైఎస్ జగన్ నుదిటిపై తిలకం దిద్దుతున్న ఆయన సతీమణి వైఎస్ భారతి ప్రత్యేక వేదిక వద్ద ఏర్పాటు చేసిన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సీఎం దంపతులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సంప్రదాయ పంచకట్టులో వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నుదిటిపై సతీమణి భారతి తిలకం దిద్దగా, ఆమె నుదిటిపై సీఎం కుంకుమ అద్దడంఅక్కడున్న వారందరినీ ఆకర్షించింది. వేద పండితులు సీఎం చేతికి కంకణ ధారణ చేయగా, భారతి చేతికి సీఎం కంకణ ధారణ చేశారు. అనంతరం వారు వేదం నేర్చుకుంటున్న చిన్నారులతో కలిసి ప్రాంగణమంతా కలియ తిరుగుతూ ప్రతి ఒక్కరినీ పేరుపేరున పలకరిస్తూ సభా వేదికపైకి చేరుకున్నారు. వైఎస్ భారతి నుదిటిపై తిలకం అద్దుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాలెండర్ల ఆవిష్కరణ సమాచార శాఖ రూపొందించిన ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్, వ్యవసాయ పంచాంగం 2022–23, ఉద్యానవన పంచాంగం 2022–23, సాంస్కృతిక శాఖ రూపొందించిన శిల్పారామం క్యాలెండర్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలు జయశ్రీ రచించిన ‘ఆమెకు తోడుగా న్యాయదేవత’, అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించిన ‘తెలుగు సాహిత్యం, సమాజం చరిత్ర – రెండువేల సంవత్సరాలు’ అనే పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్రంలో వివిధ దేవస్థానాలకు చెందిన వేద పండితులను సీఎం సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న పథకాలపై చిన్నారుల నృత్య రూపకాన్ని తిలకించి, వారితో కలసి ఫొటోలు దిగారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్.మల్లిఖార్జునరావు రూపొందించిన డీ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ గుడ్ గవర్నెన్స్ చిత్రపటాన్ని సీఎం ఆవిష్కరించారు. ఐఏఎస్ ఆఫీసర్స్ వైఫ్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్ రూపంలో విరాళం అందజేశారు. ఈ కార్యక్రమాలను ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆద్యంతం దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం సీఎం దంపతులకు శ్రీవారి దశావతార కళారూపం అందజేశారు. శుభకృత్ నామ సంవత్సర పంచాంగాన్ని సిద్ధాంతి సోమయాజులుకు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉగాది వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి (ప్రజా వ్యవహారాలు), జీవీడీ కృష్ణమోహన్ (కమ్యూనికేషన్స్), పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజలు హాయిగా ఉంటారు.. సంప్రదాయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన సిద్ధాంతి కప్పగన్తు సుబ్బరామ సోమయాజులు పంచాంగ పఠనం చేశారు. పేరుకు తగ్గట్లుగానే శుభకృత్ నామ సంవత్సరంలో అన్నీ శుభాలే జరుగుతాయని సిద్ధాంతి చెప్పారు. ప్రభువుల చల్లని పాలనకు తగ్గట్లే ప్రజలూ హాయిగా ఉంటారని, చాలా మంచి పథకాలతో ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఈ ప్రభుత్వానికి దొరుకుతుందన్నారు. ఓర్పుగా అవాంతరాలను ఎదుర్కొంటూ మంచి పాలన అందిస్తారని సీఎం జగన్‌ను సిద్ధాంతి ఆశీర్వదించారు. ఉగాది పచ్చడిని స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు శుభకృత్ నామ సంవత్సర పంచాంగాన్ని సీఎం ఆవిష్కరించి, కప్పగన్తు సుబ్బరామ సోమయాజులకు అందజేశారు. అనంతరం ఆయన సీఎం దంపతులకు ఉగాది పచ్చడి అందించారు. సిద్ధాంతిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం సత్కరించారు. పంచాంగ శ్రవణం అనంతరం ముఖ్యమంత్రి దంపతులకు టీటీడీ, శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం స్థానాచార్యులు, అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందించారు. ఉట్టిపడిన గ్రామీణ వాతావరణం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లతో ఒక గ్రామ నమూనా ఏర్పాటు చేశారు. గ్రామ సచివాలయంలో ఒక అరుగు మీద సీఎం దంపతులు కూర్చోగా, వారికి ఎదురుగా మరో అరుగుపై సిద్ధాంతి కూర్చొన్నారు. సచివాలయం ఎదురుగా ఆహుతులు కూర్చొని తిలకించేలా ఏర్పాట్లు చేశారు. పంచాంగ శ్రవణం, ఇతర కార్యక్రమాలతో వేడుకలు ఘనంగా నిర్వహించారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Ugadi 2022: మనమే మార్గదర్శి
విద్య, విద్యుత్తు, విద్వత్తు, తలసరి ఆదాయం, తలసరి విద్యుత్తు వినియోగం.. ఇలా చదివితే చాంతాడంత లిస్టు అయ్యేన్ని రంగాల్లో తెలంగాణ ముందుంది. కొన్ని దుష్టశక్తులు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసినా.. తెలంగాణ ప్రజలు ఏకోన్ముఖంగా ముందుకు కలిసిరావటం వల్లనే ఈ పురోగతి సాధ్యమైంది. ప్రజల అండ, భగవంతుడి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం కలగటం వ్యక్తిగతంగా నాకు ఎంతో సంతృప్తి నిచ్చింది. మనకు జాతి, కులం, మతం భేదం లేదు. తెలంగాణ జాతి అంతా ఒకటే. అందరూ సుఖసంతోషాలతో ఉండాలి. మన బంగారు తెలంగాణ స్వప్నం నిజం కావాలి. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం సాధించనంత అద్భుత ఫలితాలు ఎన్నిం టినో తెలంగాణ సాధించి చూపిందని సీఎం కె.చంద్రశేఖరరావు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో కరెంటు కష్టాలు, తాగునీరు, సాగునీటి వసతి.. తదితరాలపై ఎన్నో సందేహాలు, అనుమానాలు రేకెత్తించారన్నారు. వాటన్నింటినీ అధిగమించి తెలంగాణ దేశంలోనే వేగంగా ప్రగతిపథంలో దూసుకుపోతోందని పేర్కొన్నారు. ఎన్నో దశాబ్దాలుగా అభివృద్ధి పథంలో ఉన్న తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌లాంటి రాష్ట్రాల కంటే ముందు వరసలో ఉండి అభివృద్ధి దిశలో పరుగుపెడుతోందన్నారు. కుల, మత, వర్గ భేదాలకతీతంగా, అన్ని వర్గాల సహకారంతో తెలం గాణ గొప్పగా రాణిస్తోందని, ఎలాంటి పథకంలోనైనా యావత్తు దేశం తెలంగాణను చూసి నేర్చుకోవాల్సిన స్థితికి చేరిందని చెప్పారు. శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు శనివారం ప్రగతి భవన్లో ఘనంగా జరిగాయి. శృంగేరీ ఆస్థాన పౌరాణికులు బాచంపల్లి సంతోష్‌కుమారశాస్త్రి పంచాంగాన్ని పఠించారు. అనంతరం సీఎం యావత్తు తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగించారు. కేసీఆర్ ప్రసంగానికి ఉపక్రమించగానే ‘లాంగ్‌లివ్ కేసీఆర్’ అంటూ నేతలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే.. సమైక్య రాష్ట్రాన్ని మించి ఆదాయం ‘పంచాంగ పఠనం సందర్భంలో పౌరాణికులు కొన్ని మంచి మాటలు చెప్పారు. ఇక మాస్కుల్లేవు, ఆర్టీపీసీఆర్ లేదు, పీసీఆర్ లేదు.. వాటి గొడవే లేదంటూ శుభం పలికారు. చాలా సంతోషం. సర్వజనులకు శుభకృత్ నామ సంవత్సరంలో సుఖ శాంతి ఐశ్వర్యాలు కలగాలని భగవంతుడిని నిండు మనసుతో ప్రార్థిస్తున్నాను. అపోహలు, అనుమానాలు, అసహాయతలు, నిస్సహాయతలు, ఔతుందా కాదా అన్న సందిగ్ధం, చర్చోప చర్చల మధ్య 15 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ప్రస్తుతం అన్నిరంగాల్లో ముందున్నాం. గత ఏడాది రాష్ట్రం రూ.1,77,630 కోట్ల ఆదాయాన్ని సాధించినట్టుగా రిజర్వు బ్యాంకు తేల్చిందని అధికారులు చెప్పారు. 23 జిల్లాల సమైక్య రాష్ట్రాన్ని మనం ఎప్పుడో దాటిపోయామని, అంతకుమించిన ఆదాయాన్ని సాధిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ కలిసి రావడం వల్లే ఈ విధంగా ఎంతో సంపద సృష్టించాం. ఇప్పుడు తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతానికి పోయి పరిశీలించినా ఎకరం రూ.25 లక్షలు, రూ.30 లక్షల లోపు లేదు. మరి ఈ సంపద ఎలా సృష్టించగలిగాం. ఇది ఒక్క అధికారుల ఘనతే కాదు, అనేక అంశాలు కలిసి రావటంతోనే ఇది సాధ్యమైంది..’అని కేసీఆర్ చెప్పారు. దళిత బంధుతో అద్భుతాలు ‘దళితుల జీవితాలు మార్చేందుకు తెచ్చిన దళిత బంధు అద్భుతాలు ఆవిష్కరించబోతోంది. దళిత జాతి వజ్రాలు అద్భుత ఫలితాలు సాధించబోతున్నారు. దేశానికే కొత్త మార్గనిర్దేశం ఇచ్చే దిశగా తెలంగాణ నిలవబోతోందని శుభకృత్ సంవత్సరం తొలిరోజు నేను సంకల్పిస్తున్నాను. ఎన్నికల కోసం, రాజకీయ స్టంట్ల కోసం కాకుండా ఈ విషయంలో ఎవరూ చేయని సాహసాన్ని మనస్ఫూర్తిగా చేశాను. దళితుల సంక్షేమం విషయంలో ఇప్పుడు యావత్తు దేశం తెలంగాణ నుంచే నేర్చుకునే పరిస్థితి కల్పించాం. ఇదొక్కటే కాదు.. ఏ పథకం అయినా దేశం మొత్తం తెలంగాణ నుంచే నేర్చుకునేలా చేశాం..’అని అన్నారు. అన్ని వర్గాల సమున్నతికి కృషి ‘ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి బడ్జెట్ ఏనాడూ రూ.10 వేల కోట్లు కూడా దాటలేదు. తాజా బడ్జెట్‌ను మనం రూ.రెండున్నర లక్షల కోట్లుగా పెట్టుకున్నాం. 95 శాతం ఉద్యోగాలు మనకే వచ్చేలా కొత్త విధానాన్ని ఇటీవలే ఆవిష్కరించుకున్నాం. వివక్ష లేకుండా అన్ని వర్గాల సమున్నతి కోసం యత్నిస్తున్నాం. అద్భుత, అపురూప, ఆర్థిక సౌష్టవంతో, సంస్కారంతో, సర్వమత సామరస్యంతో తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తోంది. దీనికి ఎక్కడా అపశృతి రాకుండా ఇంకా గొప్పగా, ఉజ్వలంగా దేశానికే అన్నంపెట్టే విధంగా ముందుకు సాగాలని, తెలంగాణ రైతుల కష్టం ఫలించాలని, అద్భుతంగా పంటలు పండాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, మన సామూహిక స్వప్నం బంగారు తెలంగాణ నిజం కావాలని కోరుకుంటున్నా..’అని సీఎం చెప్పారు. బ్రాహ్మణులకు సత్కారాలు, వసతులు ‘బ్రాహ్మణులు దేశంలో ఎక్కడా లేనివిధంగా వారి స్థాయికి తగ్గట్టు సత్కారాలు, వసతులు తెలంగాణలో పొందుతున్నారని కాలర్ ఎగరేసి చెప్పగలను. బంజారాహిల్స్‌లో కట్టిన బ్రాహ్మణ సదనాన్ని త్వరలో ప్రారంభిస్తాం. ఆధ్యాత్మిక రంగంలో తెలంగాణ దేనికీ తీసిపోదు. యాదాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దాం. సర్వజనుల సంక్షేమం కోసం పరితప్పిస్తున్న మనకు దేవుడి ఆశీస్సులు ఉండాలని, ప్రతి ఒక్కరి అభ్యుదయం మనందరి అభిమతం అయ్యేలా ఆశీర్వదించాలని దేవదేవుడిని కోరుకుంటున్నా..’అని కేసీఆర్ తెలిపారు. పంచాంగం ఆవిష్కరణ కాగా కృష్ణమాచార్య రూపొందించిన పంచాంగాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం పండితులు వేదాశీర్వచనం అందించారు. వారిని ముఖ్యమంత్రి ఘనంగా సత్కరించారు. సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువరించిన ‘మా తెలంగాణం కోటి ఎకరాల మాగాణం’పుస్తకాన్ని కూడా సీఎం ఆవిష్కరించారు. -
Ugadi 2022: పరమాన్నం.. నోరూరించే పూర్ణాలు, భక్ష్యాల తయారీ ఇలా!
శ్రీ శుభకృత్‌నామ సంవత్సర ఉగాది.. నేటితో కొత్త సంవత్సరంలో ప్రవేశించాం. పండుగంటేనే పరమాన్నంతో పాటు భిన్న రుచులను కూడా ఆస్వాదించడం కదా! మరి నోరూరించే ఉగాది రుచుల తయారీ కూడా తెలుసుకుందామా! ఉగాది పచ్చడి : కావలసినవి: కొత్త బెల్లం – 100 గ్రామలు, పచ్చి మామిడి – ఒకటి (మీడియం సైజు), వేప పువ్వు – ఒక టేబుల్ స్పూన్, పచ్చి మిర్చి – రెండు (తురమాలి), ఉప్పు – చిటికెడు, చింతపండు – పెద్ద నిమ్మకాయంత (కొత్త చింతకాయల నుంచి సేకరించినది). తయారీ: ∙బెల్లాన్ని తురిమి, అందులో కొద్దిగా నీటిని చిలకరించి పక్కన ఉంచాలి. ∙వేప పువ్వు కాడలు లేకుండా వలిచి పువ్వు రెక్కలను సేకరించి పక్కన ఉంచాలి. ∙మామిడి కాయ మొదలు (సొన కారే భాగం) తీసేయాలి. కాయను నిలువుగా కోసి లోపలి గింజను కూడా తీసేయాలి. ఇప్పుడు మామిడి కాయను తొక్కతోపాటు సన్నగా ముక్కలు తరగాలి లేదా తురిమి బెల్లం నీటిలో వేయాలి. ∙చింతపండు గుజ్జును చిక్కగా రసం తీసి పై మిశ్రమంలో కలపాలి. అందులో పచ్చిమిర్చి తురుము, ఉప్పు, వేప పూత వేసి కలపాలి. ఈ మిశ్రమం చిక్కగా ఉంటుంది. మరింత రుచి కోసం చెరకు ముక్కలు, మిగుల మగ్గిన అరటి పండు గుజ్జు కలుపుకోవచ్చు. ఊరించే ఉగాది రుచులు మామిడికాయ పులిహోర పూర్ణాలు కావలసినవి: బియ్యం – కప్పు, పచ్చిమామిడి కాయ – మీడియం సైజుది ఒకటి, పచ్చికొబ్బరి తురుము – అర కప్పు, ఆవాలు – టీస్పూను, మినప పప్పు – టీస్పూను, పచ్చిశనగ పప్పు – టీ స్పూను, వేరుశనగ గుళ్ళు – రెండు టేబుల్ స్పూన్లు, కరివేపాకు – మూడు రెమ్మలు, పచ్చిమిర్చి తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, ఎండు మిర్చి – నాలుగు, మెంతులు – పావు టీస్పూను, ఆయిల్ – నాలుగు టేబుల్ స్పూన్లు, పసుపు – పావు టీస్పూను, చింతపండు ఉసిరికాయంత, బెల్లం తురుము – రెండు టీస్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా. తయారీ: ∙ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి అన్నం పొడి పొడిగా వచ్చేలా వండి ఆరబెట్టుకోవాలి. ∙మామిడి కాయ తొక్క తీసి ముక్కలుగా తరగాలి. ∙ఎండు మిర్చి, మెంతులు, అరటీస్పూను ఆవాలను దోరగా వేయించుకుని పొడిచేయాలి. ఈ పొడిలో పచ్చికొబ్బరి, మామిడికాయ ముక్కలు, చింతపండు, బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కనపెట్టుకోవాలి. ∙స్టవ్ మీద బాణలి పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత ఆవాలు వేయాలి. చిటపటలాడాక మినప పప్పు, శనగ పప్పు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేయాలి. ∙ఇవన్ని వేగాక వేరుశనగ గుళ్ళు వేసి వేయించాలి. ఇవి వేగాక పసుపు, గ్రైండ్ చేసిన మామిడికాయ మిశ్రమం వేసి ఐదు నిమిషాలు వేయించాలి. ∙తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసి, ఆరబెట్టిన అన్నాన్ని వేసి కలిపితే మామిడికాయ పులిహోర రెడీ. పూర్ణాలు కావలసినవి: పచ్చిశనగ పప్పు – అర కేజీ, బెల్లం – అరకేజీ, యాలక్కాయలు – పది, బియ్యం – రెండు కప్పులు, పొట్టుతీసిన మినప గుళ్లు – కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, ఆయిల్ – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ∙ముందుగా మినప పప్పు, బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరుగంటల పాటు నానబెట్టుకోవాలి. శనగ పప్పుని కూడా కడిగి గంట పాటు నానబెట్టాలి. ∙నానిన బియ్యం మినప పప్పులని మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ∙నానిన శనగపప్పుని కుకర్‌లో వేసి రెండు గ్లాసులు నీళ్లుపోసి మూడు విజిల్స్ రానివ్వాలి. ఉడికిన శనగ పప్పులో బెల్లం వేసి మెత్తగా గరిటతో తిప్పుతూ దగ్గర పడేంత వరకు ఉడికించి, యాలుక్కాయల పొడి వేసి తిప్పి దించేయాలి. శనగపప్పు మిశ్రమం చల్లారాక, ఉండలుగా చుట్టుకోవాలి. ∙బియ్యం, మినపగుళ్ల రుబ్బులో కొద్దిగా ఉప్పు వేసి తిప్పాలి. ఇప్పుడు శనగ పప్పు ఉండలను ఈ పిండిలో ముంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. ∙మీడియం మంట మీద గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయిస్తే తియ్యని పూర్ణాలు రెడీ. భక్ష్యాలు కావలసినవి: పచ్చిశనగ పప్పు – రెండు కప్పులు, బెల్లం తురుము – రెండు కప్పులు, యాలకుల పొడి – రెండు టేబుల్ స్పూన్లు, మైదా – రెండు కప్పులు, గోధుమ పిండి – మూడు టేబుల్ స్పూన్లు, నెయ్యి – అరకప్పు, నీళ్లు – కప్పు, ఉప్పు – చిటికెడు. తయారీ: ∙ముందుగా శనగ పప్పుని శుభ్రంగా కడిగి రెండు గంటలపాటు నానబెట్టాలి. నానిన పప్పుని కుకర్‌లో వేసి, రెండు కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి. ఇంతకు మించి ఉడికించకూడదు. ∙ఉడికిన తరువాత నీళ్లు తీసేసి పప్పుని పక్కన పెట్టుకోవాలి. ∙మైదాలో గోధుమ పిండి, టేబుల్ స్పూను నెయ్యి, కప్పు నీళ్లుపోసి పిండిని ముద్దలా కలుపుకోని పక్కనపెట్టుకోవాలి. ∙శనగ పప్పుని కూడా మెత్తగా రుబ్బుకోవాలి. ∙మందపాటి పాత్రలో బెల్లం తురుము, అరకప్పు నీళ్లు పోసి సన్నని మంట మీద ఉడికించాలి. ∙మధ్య మధ్యలో కలియ తిప్పుతూ రుబ్బుకున్న శనగపప్పు, యాలకుల పొడి వేసి తిప్పి, పదినిమిషాల పాటు ఉడికించాలి. ఉడికిన మిశ్రమాన్ని నిమ్మకాయ సైజు పరిమాణంలో ఉండలుగా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అల్యూమినియం ఫాయిల్‌పైన కొద్దిగా నెయ్యి రాసుకుని కలిపి పెట్టుకున్న మైదా పిండిని చిన్న ఉండలుగా చేసుకుని చపాతీలా చేత్తో వత్తుకోవాలి. ∙ఈ చపాతీలో శనగపప్పు ఉండని పెట్టి చపాతీ మొత్తం చుట్టే పూరీలా వత్తుకోవాలి. ∙పెనం మీద నెయ్యి వేసి రెండు వైపులా బంగారు రంగులోకి మారేంత వరకు కాల్చితే భక్ష్యాలు రెడీ. పరమాన్నం కావలసినవి: బియ్యం – అర కప్పు, పాలు – కప్పు, బెల్లం తురుము – ముప్పావు కప్పు, నెయ్యి – ముప్పావు కప్పు, జీడి పప్పు పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి – అర టీస్పూను, పచ్చకర్పూరం – చిటికెడు. తయారీ: ∙ముందుగా బియ్యాన్ని కడిగి పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ∙ఒక గిన్నెలో పాలుపోసి కాయాలి. కాగిన పాలల్లో నానబెట్టిన బియ్యం వేసి తిప్పుతూ ఉడికించాలి. అన్నం మెత్తగా ఉడికాక దించి చల్లారనివ్వాలి. ∙స్టవ్ మీద మరో బాణలి పెట్టుకుని నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కిన తరువాత జీడి పప్పు పలుకులు వేసి గోల్డ్ కలర్లోకి మారేంత వరకు వేయించాలి. స్టవ్ మీద మరో పాత్ర పెట్టి బెల్లం తురుము వేయాలి. దీనిలో పావుకప్పు నీళ్లుపోసి సిరప్‌లా మారేవరకు ఉడికించి, చల్లారనివ్వాలి. ∙బెల్లం సిరప్‌లోనే యాలకుల డి, పచ్చ కర్పూరం వేసి తిప్పాలి. ∙బెల్లం సిరప్ చల్లారక అన్నంలో వేసి బాగా కలపాలి, దీనిలో మిగిలిన నెయ్యి, జీడిపప్పుతో గార్నిష్ చేస్తే పరమాన్నం రెడీ. -
ఉగాదికి తెలుగు లోగిళ్ల ముస్తాబు
సాక్షి, అమరావతి: శుభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగకు తెలుగు లోగిళ్లు ముస్తాబయ్యాయి. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం అన్ని ఆలయాల్లో పంచాంగ శ్రవణంతో పాటు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించనుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఉగాది వేడుకల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీసమేతంగా పాల్గొననున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి 11.50 గంటల వరకు ఉగాది కార్యక్రమాలు కొనసాగనున్నాయి. వివిధ వేద పాఠశాలల విద్యార్థుల మంత్రోచ్ఛారణ మధ్య ముఖ్యమంత్రి దంపతులకు పూర్ణకుంభం స్వాగతం పలుకుతారు. 10.42 గంటలకు పంచాంగ శ్రవణం అనంతరం వ్యవసాయ, ఉద్యాన శాఖల ఉగాది క్యాలెండర్‌ను సీఎం ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా పంచాంగకర్తలతో పాటు వివిధ ఆలయాల్లో పనిచేసే అర్చకులు, వేద పండితులను సీఎం సన్మానించనున్నారని దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్ తెలిపారు. అన్ని జిల్లాల్లో అర్చకులు, వేద పండితులకు సన్మానం ఉగాది పండుగ సందర్భంగా దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం వివిధ ఆలయాల్లో పనిచేసే అర్చకులతో పాటు వేద పండితులను ఘనంగా సన్మానించనుంది. ప్రతి జిల్లాలో కలెక్టర్ల పర్యవేక్షణలో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ల ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలను నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లో 62 ఏళ్లకు పైబడిన ముగ్గురు ఆర్చకులతో పాటు ఒక వేద పండితుడిని సన్మానించనున్నారు. సన్మాన గ్రహీతలకు రూ.10,116 సంభావన, కొత్త వస్త్రాలను కలెక్టర్ల చేతుల మీదుగా అందజేస్తారు. ఇందుకు గాను దేవదాయ శాఖ ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేసింది. మరో వైపు రాష్ట్రంలోని అన్ని పెద్ద ఆలయాల్లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించాలని, ఆ సందర్భంగా ఆ సమీపంలో ఆదాయం లేని ఆలయాల్లో పనిచేసే ఇద్దరు అర్చకులతో పాటు ఒక వేద పండితుడిని సన్మానించాలని దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ ఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. చదవండి: దున్నపోతుతో తొక్కించుకుంటే ఊరికి మేలు జరుగుతుందని.. -
ఉగాది 2022: శ్రీ శుభకృత్ నామ సంవత్సర కర్తరీ నిర్ణయం
డొల్లు కర్తరీ ప్రారంభం: 04–05–2022, రా.12:04లకు అనగా (05/05) శుభకృత్‌నామ సంవత్సర వైశాఖ శుద్ధ చవితి బుధవారం రాత్రి తెల్లవారితే గురువారం మృగశిరా నక్షత్రం రోజున రవి భరణి నక్షత్రం మూడవ పాదంలో ప్రవేశించడంతో డొల్లుకర్తరీ ప్రారంభం అవుతుంది. పెద్ద కర్తరీ ప్రారంభం: 11–05–2022, రా.10:04లకు శుభకృత్ నామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి తత్కాల ఏకాదశి బుధవారం ఉత్తరఫల్గుణీ నక్షత్రం రోజున రవి కృత్తికలో ప్రథమపాదంలో ప్రవేశించడంతో పెద్దకర్తరీ ప్రారంభం అవుతుంది. ‘మృద్దారు శిలాగృహకర్మాణి వర్జయేత్’ మట్టి, కర్ర, రాయి ఉపయోగించి చేయు గృహకర్మలు ప్రారంభించడానికి కర్తరీకాలం సరైనది కాదు. పై సూత్రం ఆధారంగా దీనికి వాస్తుకర్తరీ అని పేరు. శంఖుస్థాపన, ద్వారం ఎత్తుట, పాకలు, షెడ్లు, పెంకుటిళ్ళు, పైకప్పు నిర్మాణ పనులు ప్రారంభించడం శ్రేయస్కరం కాదు. కర్తరీ పూర్తి (త్యాగం): 29–05–2022, ఉ.7:37లకు వైశాఖ బహుళ చతుర్దశి ఆదివారం కృత్తికా నక్షత్రం రోజున రవి రోహిణి నక్షత్రం రెండవ పాదంలో ప్రవేశించడంతో కర్తరీకాలం పూర్తవుతుంది. మూఢమి వివరములు శుక్ర మూఢమి: (15–09–2022 నుంచి 1–12–2022 వరకు) మూఢమి ప్రారంభం: 15–9–2022 శుభకృత్ నామ సంవత్సరం భాద్రపద బహుళ పంచమి గురువారం రోజున శుక్రుడు రవి నుండి ప్రాగస్తం (అనగా తూర్పుదిశగా అస్తమించడం వలన) మూఢమి ప్రారంభం అయినది. మూఢమి అంత్యం: 1–12–2022 మార్గశిర శుద్ధ అష్టమి రోజున శుక్రుడు రవి నుండి పశ్చాదుదయం (అనగా పశ్చిమ దిశగా ఉదయించడం) వలన మూఢమి పూర్తవుతుంది. నోట్: మూఢమికి ముందు కొన్ని రోజులు గ్రహాలకు వృద్ధత్వం అని పేరు. మూఢమి తరువాత బాలత్వం అని పేరు. ఆ రోజులలో శుభకార్యములు చేయరాదు. మకర సంక్రాంతి పురుష లక్షణమ్: 14–01–2023, రా.గం.2:14లకు (ఘ.49–01) స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శుభకృత్ నామ సంవత్సరం హేమంత ఋతువు పుష్య మాసం బహుళ సప్తమి తత్కాల అష్టమి శనివారం రాత్రి తెల్లవారితే ఆదివారం చిత్తా నక్షత్రం రెండవ పాదం కన్యారాశి సుకర్మయోగం బాలవకరణం తులాలగ్నం సమయంలో రవి మకరరాశి ప్రవేశం. సూ.ఉ.6:38. సూ.అ.5:40. దినప్రమాణం 27:36. -
ఉగాది 2022: నవనాయక ఫలితాలు (2022– 2023)
రాజు – శని శని రాజు అయిన సంవత్సరంలో విచిత్ర వర్షాలు కురిసి పంటలు సామాన్యంగా ఫలిస్తాయి. రాజక్రోధం అధికమై యుద్ధాలు, చోరభయం కలుగుతాయి. రెండవ పంటలు, పర్వత పంటలు బాగా పండుతాయి. ధరలు సరిగా ఉండవు. స్వల్పవర్షాలు కురుస్తాయి. జనులు కపట స్వభాంతో సంచరిస్తారు. అధర్మమార్గంలో నడుచుకుంటారు. తక్కువస్థాయి ప్రజలు సుఖపడతారు. ఇది సహజ శని లక్షణం. అయితే శని స్వక్షేత్ర సంచారి కావడం వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. రాజవాహన ఫలములు అశ్వం రాజవాహనం– భూకంపాది ఉపద్రవాలు. రాజయుద్ధం, వర్షాభావం, పంటలు తగ్గడం, ఆహార ధాన్యాల కొరత, ధాన్యాదుల ధరలు పెరుగుదల, దుర్భిక్షం, జనహాని, ధనహాని కలుగుతాయి. మంత్రి–గురు గురువు మంత్రిగా ఉన్న సంవత్సరం అధిక ధాన్యపంటలు, సంపదలు, అధిక వర్షాలు, వృక్షాలు, çపంటలు బాగా ఫలిస్తాయి. భూమి గోకులంలా ఉంటుంది. సువృష్టితో భూమి సస్యసంపూర్ణమవుతుంది. భూమి సంపూర్ణ జలాలతో ఉంటుంది. రాజులు సమరోత్సాహం చూపుతారు. గ్రంథాతర వచనం: గోవులు అధిక క్షీరములు ఇచ్చును. ధాన్యము బాగా ఫలించును. క్షేమ, ఆరోగ్య, సుభిక్షములు కలుగును. సేనాధిపతి–బుధ మేఘాలకు వాయుబాధ ఎక్కువై కష్టంతో వర్షిస్తాయి. సస్యాలు కూడా దానికి తగినట్లుగానే ఫలిస్తాయి. ప్రజలు కామాచార పరాయణులై ఉంటారు. సస్యాధిపతి – రవి సూర్యుడు పూర్వ సస్యాధిపతి కావడం వల్ల ఈతిబాధలతో పూర్వ సస్యములు పీడింపబడును. ఉలవలు, శనగలు, కందులు, వేరుశనగ, ఎర్రధాన్యములు, మిర్చి, వక్కలు సమృద్ధిగా ఉత్పత్తి అయి ధరలు తగ్గి ఉంటాయి. తక్కిన ధాన్యములకు ధరలు పెరుగుతాయి. బంగారం, వెండి ధరలలో ఒడిదుడుకులు ఉంటాయి. అని ఇతర గ్రంథ వచనం. ధాన్యాధిపతి –శుక్రుడు అతివృష్టి సుభిక్షము మంచి పంటలు ప్రజలకు ఆరోగ్యము లభించును. అర్ఘాధిపతి–బుధుడు మంచి వర్షాలు కురుస్తాయి. ధరలు బాగుంటాయి. మంచి పంటలు పండుతాయి. పాషండులు, ఇంద్రజాలికులు, యువకులు దుçష్టులుగా పెరుగుతారు. మేఘాధిపతి –బుధుడు మేఘగర్జనలు పిడుగుపాటులు గాలితో కూడిన వర్షములు వచ్చును. మధ్య దేశమునందు మంచి వర్షము వచ్చును. సర్వత్ర మధ్యస్థాయి వృష్టి సస్యములుండును అని గ్రంథాంతరము. రసాధిపతి – కుజుడు కుజుడు రసాధిపతిగా ఉన్నప్పుడు జీలకర్ర, ఉప్పు, నెయ్యి, తైలము, బెల్లము మొదలగునవి ధరలు పెరగవు. నీరసాధిపతి – రవి : రత్నములు మణులు చందనము వెండి, బంగారము, రాగి మొదలగు ధాతు లోహములకు ధరలు తగ్గును. రాష్ట్ర, రాజ, ప్రజాక్షోభములు జననాశము జరుగునని గ్రంథాంతర వచనము. -
ఉగాది 2022: శ్రీ శుభకృత్ నామ సంవత్సర (2022 – 23) రాశిఫలాలు
మేష రాశి ఆదాయం–14 వ్యయం–14 రాజయోగం–3 అవమానం–6 అశ్వని 1,2,3,4 పాదములు (చూ, చే, చో, లా) భరణి 1,2,3,4 పాదములు (లీ, లూ, లే, లో) కృత్తిక 1వ పాదము (ఆ) ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ 13 వరకు కుంభం (లాభం)లోను తదుపరి మీనం (వ్యయం)లోను సంచరిస్తారు. శని ఏప్రిల్ 28 వరకు జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం (దశమం)లోనూ మిగిలినకాలం అంతా కుంభంలోనూ సంచరిస్తారు. ఏప్రిల్ 12 వరకు రాహువు వృషభం (ద్వితీయం) కేతువు వృశ్చికం (అష్టమం)లోను తదుపరి రాహువు మేషం (జన్మం) కేతువు తుల (సప్తమం)లో సంచరిస్తారు. 2022 ఆగుస్టు 10 నుండి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (ద్వితీయం)లో స్తంభనం. మొత్తం మీద ఈ గోచారం సంవత్సరం అంతా ప్రోత్సాహకరంగానే ఉంటుంది. గతంలో కంటే ఎక్కువ అనుకూల పరిస్థితులు ఉంటాయి. శని మకరంలో ఉన్నప్పటి కంటే కుంభంలో సంచరించే సమయంలో బాగా అనుకూలిస్తాడు. శుభకార్యముల నిమిత్తం తరచుగా ధనవ్యయం అవుతుంటుంది. ఇతరుల మీద ఆధారపడని వారికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనవసరమైన సలహాలు తీసుకొని, చికాకులు పడుతుంటారు. అందువలన ఈ సంవత్సరం ప్రతిపనీ స్వయంగా చేసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో నష్టాలు ఉండవుగాని, మనస్పర్థలకు అవకాశం ఎక్కువ. ఆర్థిక వనరులు వచ్చే మార్గం చిన్నదిగాను ఖర్చు అయ్యే మార్గం పెద్దదిగా ఉన్న కారణం చేత ఆర్థిక వ్యవహారాల్లో చికాకులు పడతారు. ఎక్కువగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలాకాలం పుణ్యకార్యాచరణ లేదా పుణ్యక్షేత్ర సందర్శన మీద దృష్టి ఉంచే అవకాశం ఉంటుంది. దైనందిన కార్యకలాపాలు అస్తవ్యస్తంగా పూర్తి అవుతాయి. కోర్టు వ్యవహారాల్లో నమ్మకద్రోçహానికి గురవుతారు. ఉద్యోగంలో స్థానచలన ప్రయత్నాలలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. వ్యాపారులకు సంవత్సరం అంతా హెచ్చుతగ్గులు తప్పవు. లాభాలు తక్కువ. ఉద్యోగాల్లో స్థిరం తగ్గుతుంది. ప్రమోషన్లు దగ్గరకు వచ్చి మిస్ అవుతాయి. మీకు శ్రమకు తగిన లాభం, శ్రమకు తగిన గుర్తింపు అందవు. అధికారుల నుంచి సహకారం తక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులేవీ ఉండవు. అయితే మానసిక రుగ్మతలు ఉన్నవారు తరచుగా యిబ్బందులకు లోనవుతారు. మిగిలిన వారు గురువు వ్యయం దృష్ట్యా స్వల్ప జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటింపకపోతే మోసపోయే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు సరిగా సాగకపోవడం వల్ల నిరుత్సాహ పడతారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి చాలా ఇబ్బందులతో పనులు పూర్తి అవుతాయి. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు ఈ సంవత్సరం మే నుంచి చాలా చికాకులు ఎదురవుతాయి. విద్యార్థులకు విద్యావ్యాసంగం కంటే ఇతర వ్యవహారాలు ఎక్కువై విద్యాభంగం పొందుతారు. రైతులకు శ్రమ ఎక్కువ అవుతుంది. గర్భిణీస్త్రీలు మే నెల నుంచి బహు జాగ్రత్తలు పాటించాలి. ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఎక్కువ. అశ్వినీ నక్షత్రం వారికి శుభపరిణామాలు ఎక్కువ. బాగా కృషి చేస్తారు. వృత్తిపరంగా మంచి ఫలితాలు అందుకుంటారు. జన్మ రాహువు, వ్యయ గురువుల ప్రభావం ఈ నక్షత్రం మీద తక్కువ అనే చెప్పాలి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అందరికీ సాయం చేస్తూ మంచి ఫలితాలు, కీర్తి ప్రతిష్ఠలు పొందుతారు. భరణీ నక్షత్రం వారికి అనవసర ఆలోచనలు, వృథా కాల క్షేపాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. రాహువు భరణీలో సంచారం వల్ల మానసిక రుగ్మతలు తలెత్తుతాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు వుంటాయి. ధనవ్యయం ఎక్కువగా వుంటుంది. కృత్తికా నక్షత్రం వారు ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభించి, వేగంగా పూర్తి చేసుకుంటారు. అన్ని అంశాలలోనూ అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగంలో చికాకులు వుంటాయి. తెలివిగా సరి చేసుకుంటారు. వ్యాపారంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పదిమందికీ సాయంచేసి సంఘంలో మంచిపేరు తెచ్చుకుంటారు. శాంతి : ఏప్రిల్ 12 తరువాత రాహు, కేతు గురువులకు శాంతి చేయించండి. రోజూ ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణలు చేసి దుర్గా సప్తశ్లోకీ 11 సార్లు పారాయణ చేయడం వలన చాలావరకు దుష్ఫలితాలు తొలగుతాయి. పంచముఖ రుద్రాక్షలు ధరించడం శ్రేయస్కరం. ఏప్రిల్: ఆర్థిక వెసులుబాటు తగ్గుతుంది. కుటుంబ విషయాల్లో మంచి పరిణామములు చోటు చేసుకుంటాయి. అలంకరణ వస్తువుల కొనుగోలు, ప్రయణాల కోసం ఖర్చు ఎక్కువగా ఉంటుంది. రాహుకేతు శాంతి చేయించండి. ఉద్యోగం ఒత్తిడితో ఉంటుంది. దైనందిన కార్యకలాపాలు అస్తవ్యస్తంగా ఉంటాయి. మే: క్రమక్రమంగా పని ఒత్తిడి పెరుగుతుంది. శుక్రుడు వ్యయంలో ఉన్న కారణంగా ప్రయాణ అసౌకర్యాలు ఎక్కువ అవుతాయి. అలంకరణ వస్తువులు కొనుగోలు విషయంలో ధనవ్యయం ఎక్కువవుతుంది. అధికారులతో ఒత్తిడి పెరుగుతుంది. అనవసర విషయాల వలన మానసిక చికాకులు ఉంటాయి. కొత్త ప్రయోగాలు ఏమీ చేయవద్దని సూచన. జూన్: సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహిస్తారు. కుటుంబ విషయాలు చాలావరకు మంచి ఫలితాలతో ఉంటాయి. ఖర్చులను నియంత్రించగలుగుతారు. ఉద్యోగం, వ్యాపారం అంతా సాధారణ స్థాయి ఫలితాలతో ఉంటాయి. అభివృద్ధిపథంలో ప్రయాణం సాగుతుందనే చెప్పాలి. జూలై: ఎంత లాభదాయకంగా ఉన్నా, లేకున్నా వ్యాపారులు చాలా జాగ్రత్తలు వహిస్తూ వ్యాపారాలు చేయాలి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి తరచుగా చికాకులు వస్తుంటాయి. మితభాషణ మంచిది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా ఖర్చులు నియంత్రించలేని స్థితి ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆగస్టు: చాలావరకు సానుకూల వాతావరణం ఉంటుంది. కొత్త ప్రయోగాలేవీ చేయవద్దని సూచన. శుభ వార్తలు వింటారు. అందరి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభ కార్యాలు, పుణ్యకార్యాల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. సెప్టెంబర్: చాలా ప్రశాంతంగా ఉంటుంది. 15వ తేదీ నుంచి 24 వరకు కాలం మరింత అనుకూలం. అందరూ బాగా గౌరవిస్తారు. ధనవ్యయం అధికంగానే ఉన్నా, అవసరానికి తగిన ఋణం లభిస్తుంటుంది. కుటుంబం, ఉద్యోగం రెండు అంశాలనూ చాలా ఓర్పుగా నేర్పుగా సాగించుకుంటూ ముందుకు వెడతారు. అక్టోబర్: గురు, బుధ, శుక్ర సంచారం అనుకూలం తక్కువ. ప్రయాణాలలో వస్తువులు పోగొట్టుకోవడం జరుగుతుంది. బంధు మిత్రులు కలిసినప్పుడు వ్యవహార విషయాల మీద చర్చలు చేయవద్దు. ఆర్థిక లావాదేవీలు సరిగా సాగవు. అలంకరణ వస్తువుల కొనుగోలులో ధనవ్యయం అధికం అవుతుంది. వృత్తి సౌఖ్యం బాగానే ఉంటుంది. నవంబర్: కనబడుతున్న అన్ని అంశాలూ నిజం కాదు అని గ్రహించండి. ప్రతి విషయంలోనూ స్వయం శోధన అవసరం. ఈ నెలలో వృత్తి వ్యవహారాలు జాగ్రత్తగా చేసుకోవాలి. ఇతరుల మీద ఆధారపడితే ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో కలహం పెరిగినా వారితోనే ఎక్కువ సమయం కేటాయించండి. డిసెంబర్: క్రమంగా చాలా మంచి ఫలితాలు అందుకుంటారు. ప్రతిరోజూ అధిక శ్రమ ఉంటుంది. అయితే శ్రమకు తగినట్లు లాభదాయకంగా ఉంటుంది. ప్రధానంగా మీ విజ్ఞానం మీకు గౌరవం తెచ్చి పెడుతుంది. మిత్రలాభం చేకూరుతుంది. అనుకోని లాభాలు ఉంటాయి. దూర ప్రయాణాలు, అలంకరణ వస్తువుల కొనుగోలులో ఖర్చు పెరుగుతుంది. జనవరి: శుభ పరిణామాలు ప్రారంభమవుతాయి. వృత్తిరీత్యా ఇబ్బందులు వుండవు. అన్ని వ్యవహారాల్లోనూ మీకు అందరూ సహకరిస్తారు. ధనం వెసులుబాటు బాగుంటుంది. ప్రత్యేక జాగ్రత్తలతో కాలం సానుకూలం చేసుకుంటారు. ఎవరి మీదా ఆధారపడకుండా చేసే పనులు మిమ్మల్ని విజయపథంలోకి తీసుకువెడతాయి. ఫిబ్రవరి: చాలా మంచి కాలం. క్రమంగా ఓర్పుతో సర్వకార్యసాధన చేస్తారు. ప్రధానంగా కుటుంబ విషయంలో ఇబ్బందులు లేకుండా ఉంటాయి. రాహు, కేతు, గురువులు బాగాలేని ఈ కాలంలో కూడా మిగిలిన గ్రహాల అనుకూలత దృష్ట్యా ఆర్థిక, ఆరోగ్య విషయాలలో మంచి అనుకూలస్థితి సాధిస్తారు. ఋణ సదుపాయం బాగుంటుంది. మార్చి: పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, కుటుంబ విషయాలకు సమన్యాయం చేయలేక బాగా చికాకుకు గురి అవుతారు. బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా ఏ సలహాలూ తీసుకోవద్దు. ఓర్పు చాలా అవసరం. ఆరోగ్య విషయంలో బహు జాగ్రత్తలు పాటించాలి. ఇతరుల వ్యవహారాల్లోనూ కలుగజేసుకోవద్దని ప్రత్యేక సూచన. మీ జాతకానికి ఈ గోచారాన్ని మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి, గోచారానికి పోలిక చేసి ఫలితములు తెలుసుకోండి. వృషభ రాశి ఆదాయం–8 వ్యయం–8 రాజయోగం–6 అవమానం–6 కృత్తిక 2,3,4 పాదములు (ఈ, ఊ, ఏ) రోహిణి 1,2,3,4 పాదములు (వో,వా,వీ,వూ) మృగశిర 1,2 పాదములు (వే,వో) ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ 13 వరకు కుంభం (దశమం)లోనూ తదుపరి మీనం (లాభం)లోనూ సంచారం చేస్తారు. శని ఏప్రిల్ 28 వరకు మరలా జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం (భాగ్యం)లోనూ మిగిలినకాలమంతా కుంభంలోనూ సంచరిస్తారు. ఏప్రిల్ 12 వరకు రాహువు వృషభం (జన్మం), కేతువు వృశ్చికం (సప్తమం)లోనూ తదుపరి రాహువు మేషం (వ్యయం), కేతువు తుల (షష్ఠం)లో సంచరిస్తారు. 2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (జన్మం)లో స్తంభన. మొత్తం మీద ఈ గోచారం సంవత్సరం అంతా శోధింపగా లాభాలు బాగా ఉంటాయి. కార్య సానుకూలత బాగుంటుంది. అయినా చికాకులు వెంబడిస్తూనే ఉంటాయి. ఇదొక విచిత్రమైన కాలమనే చెప్పాలి. ఏ విధమైన నిర్ణయాలైనా త్వరగా తీసుకోలేకపోతారు. తరచుగా భయాందోళనలకు గురవుతుంటారు. గురువు లాభ సంచారం, శని అనుకూల సంచారం మీకు గొప్ప వరమనే చెప్పాలి. ఉద్యోగంలో ఎన్ని ఆటంకాలు ఉన్నా, ప్రమోషన్ అందుకుంటారు. సర్వత్రా మీ ప్రణాళికలు విజయం అందిస్తాయి. గౌరవం తెస్తూ ఉంటాయి. ఆర్థిక కార్యకలాపాలు కొంచెం సానుకూల స్థితిని అందించని గోచారం ఉన్నా, ఈ ఏడాది ముందు జాగ్రత్త పడ్డవారు ఆర్థికంగా సుఖపడతారు. అనవసర విషయాల పట్ల ఆకర్షితులైనవారు ఇబ్బందిపడే అవకాశం ఉంది. ఏ పరిస్థితిలోనైనా కుటుంబసభ్యుల ప్రోత్సాహం బాగుంటుంది. అయితే మీరు కుటుంబసభ్యులతోనూ, మిత్రులతోనూ అనుమాన ధోరణితో సంచరిస్తారు. ఈ సంవత్సరం అతి జాగ్రత్త, మితభాషణ శ్రేయస్కరం. కొత్త వ్యవహారాలు, వ్యాపారాలు మిమ్మల్ని ఎంత ఆకర్షించినా, మీరు ఏమాత్రం ఆకర్షితులు కాకండి. మీ స్థితిని గమనించుకొని ప్రవర్తించండి. వ్యాపారులకు సంవత్సరం అంతా లాభాలు ఉంటాయి. అయితే పక్కనే సమస్యలు కూడా ప్రయాణం చేస్తాయి. ఉద్యోగులు ఎంతో జాగ్రత్తగా మెలగాలని సూచన. ఇతరుల మీద ఆధారపడిన ప్రతి పనిలోనూ సమస్యలు వస్తుంటాయి. మీ పనులు మీరు స్వయంగా చేసుకోవడం శ్రేయస్కరం. నేత్ర సమస్యలు ఉన్నవారికి ఇబ్బందులు ఎక్కువవుతాయి. సహజంగా గురుబలం దృష్ట్యా సమస్యలు రాకూడదు కానీ ఆగస్టు తరువాత మీకు కానీ మీ కుటుంబసభ్యులకు కానీ సంబంధించి వైద్య ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. స్థిరాస్తి కొనుగోలు కోసం ధనం సమకూరుతుంది. లోన్లు, ప్లాన్లు వంటివి తేలికగా సమకూరుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసే విషయంలో పాత ఉద్యోగం మానివేసి, కొత్త ప్రయత్నం చేయడం మంచిదికాదు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి ప్రత్యేక సూచన ఏమిటి అంటే ధనవ్యయం. మోసం మీ వెంట ఉంటాయి జాగ్రత్త. షేర్ వ్యాపారులకు ఫైనాన్స్ వ్యాపారులకు వ్యాపారం బాగా ఉంటుంది. విచిత్ర సమస్యలు ఉంటాయి. విద్యార్థులకు విద్యావ్యాసంగం చెడకొట్టే ఇతర అంశాలు ఎక్కువవుతాయి. రైతులకు శ్రమ ఎక్కువ ఉన్నా, ఫలితాలు అనుకూలం. పంటలకు సంబంధించిన రోగాలకు ఖర్చులు పెరుగుతాయి. గర్భిణులు బహుజాగ్రత్తలు పాటించాలి. కృత్తికా నక్షత్రం వారు ఇబ్బందులు లేని జీవితం గడుపుతారు. కానీ ఏ స్థాయి వారికి ఆ స్థాయి మానసిక సమస్యలు వుంటాయి. ప్రధానంగా అభద్రతాభావం వెంబడిస్తుంది. అయితే కచ్చితంగా అన్ని విషయాల్లోనూ సానుకూలత ఎక్కువగా వుంటుంది. అందరూ సహకరిస్తారు. ఆర్థికంగా బలపడతారు. రోహిణీ నక్షత్రం వారికి నేత్ర సమస్యలు ఎక్కువ కాగలవు. జీర్ణ సంబంధ, చర్మ సంబంధ సమస్యలు వున్న ఈ నక్షత్రం వారు ఎక్కువగా చికాకులు పొందుతారు. స్థిరాస్తి సమస్యలను త్వరగా సెటిల్మెంట్ చేసుకోకపోవడం శాపంగా మారుతుంది. మృగశిర నక్షత్రం వారికి క్రమంగా శుభపరిణామాలు పెరుగుతాయి. ఆదాయం బాగా వుండి ధనవ్యయం అధికంగా చేస్తుంటారు. పిల్లల విద్య వివాహ ప్రయత్నాలు, ఉద్యోగంలో సక్సెస్ వార్తలు ఆనందం కలిగిస్తాయి. తరచుగా పుణ్యక్షేత్ర సందర్శనలు, దాన ధర్మాలు చేస్తారు. శాంతి: ఏప్రిల్‌లో రాహుకేతు శాంతి చేయించండి. ఆగస్టులో కుజగ్రహ శాంతి చేయించండి. రోజూ దుర్గ, గణపతి, సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం చేయాలి. ‘గజేంద్రమోక్షం ఘట్టం’ రోజూ పారాయణ చేయడం చాలా అవసరం. త్రిముఖి, షణ్ముఖి రుద్రాక్ష ధరించడం వలన మంచి జరుగుతుంది. ఏప్రిల్: తరచుగా మానసిక ఒత్తిడికి లోనవుతారు. అన్ని పనులూ సక్రమంగా జరుగుతాయి. కొన్ని అంశాలలో లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో అధికారులు తరచుగా ఆగ్రహిస్తారు. ఎవరినీ నమ్మి పనులు చేయవద్దు. మితభాషణ అవసరం. శుభకార్యాల్లో పాల్గొంటారు. అన్ని పనులూ స్వయంగా చేసుకోవడం మంచిది. మే: కొన్ని సందర్భాలలో ధైర్యంగా బుద్ధిని ప్రదర్శిస్తారు. కొన్నిసార్లు అధైర్యంగా ఉంటారు. భోజనవసతి, రోజువారీ పనులు చక్కగా ఉంటాయి. మితభాషణ, ఓర్పు, స్నేహం ప్రదర్శించి తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. అధికారుల అండదండలు బాగా ఉంటాయి. గురువులను, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. జూన్: కోర్టు వ్యవహారాల్లో సెటిల్మెంట్ ధోరణి చాలా లాభం. తరచుగా బుద్ధిమాంద్యానికి లోనవుతారు. వీలయినంత వరకు దూరప్రాంత ప్రయాణాలను విరమించడం శ్రేయస్కరం. పనులు వాయిదా వేసే లక్షణాలు విడనాడండి. భోజనం, స్నానం వంటి నిత్యకృత్యాలు కూడా కాలంతో సంబంధం లేకుండా ఉంటాయి. జూలై: కుజుడు వ్యయంలో సంచారం ప్రారంభించారు. మూడు మాసాలు అనుకూలత తక్కువ. కలహాలు వ్యవహారాలు చికాకులు కలిగిస్తాయి. రోజూ సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. గురు, శుక్ర సంచారం బాగుంది. అందువలన తెలివితేటలు ప్రదర్శించి సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఆగస్టు: ఈ నెల నుంచి కుజస్తంభన, వృషభరాశిలో ఉండి ఇబ్బందికరంగా ఉంటుంది. రోజూ సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో ధనవ్యయం అధికం అవుతుంది. పిల్లలతో మనస్పర్థలు ఎక్కువ అవుతాయి. ఈ నెల నుంచి ఆరోగ్యం, ఋణ విషయంలో జాగ్రత్తలు పాటించండి. మనశ్శాంతిగా ఉండడం కోసం ప్రత్యేక సాధన అవసరం. సెప్టెంబర్: కుజుడు జన్మంలో సంచారం అనుకూలం కాదు. అయితే గురు శుక్ర బుధ గ్రహసంచారం అనుకూల ఫలితాలు ఇస్తుంది. అందువలన ఎంతటి సమస్యలనైనా సులువుగా దాటవేయగలుగుతారు. ప్రతి విషయంలోనూ ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది లేకుండా సాగిపోతాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. అక్టోబర్: తరచుగా శుభవార్తలు వింటారు. 15వ తేదీ తరువాత కుజుడి మార్పు వల్ల మంచి మార్పులు కొన్ని ప్రారంభం అవుతాయి. ద్వితీయార్ధంలో రవి కుజుల సంచారం పూర్తిగా అనుకూలంగా ఉన్నందున వృత్తి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. 15వ తేదీ వరకు కుజుడు, తరువాత శుక్రుడు అనుకూలంగా లేనందున కుటుంబ విషయంలో జాగ్రత్తలు అవసరం. నవంబర్: కోపం, ఆవేశం, మానసిక ఆందోళనలు జయించడానికి మెడిటేషన్ వంటి వాటిని ఆశ్రయించండి. ఆరోగ్య పరిరక్షణ మీద ప్రత్యేక దృష్టి అవసరం. దూర ప్రాంత ప్రయాణాలను, ఒంటరి ప్రయాణాలను విరమించుకోవడం శ్రేయస్కరం. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోరాదని సూచన. డిసెంబర్: అన్ని కోణాల్లోనూ జాగ్రత్తలు అధికంగా పాటించాలి, ప్రధానంగా ఇతరుల విషయంలో కలగజేసుకోవద్దు. మితభాషణ, ఓర్పు చాలా అవసరం. కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చే ప్రయత్నంలో సఫలం కాలేరు. ఫలితంగా కుటుంబ కలహాలు ఉంటాయి. వాహనాలు తరచుగా రిపేర్‌కు వస్తాయి. అవయవ ప్రతికూలతలు అధికంగా ఉంటాయి. జనవరి: తెలివి, ఓర్పు ప్రదర్శించి ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఋణం కావలసిన సమయానికి వెంటనే దొరుకుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి పూర్తి సానుకూలత ఉంటుంది. ఋణాలు ఇచ్చి పుచ్చుకునే విషయంలో ఒత్తిడిని జయిస్తారు. చిరకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఫిబ్రవరి: జన్మకుజుడు వ్యయరాహువులు సహజంగా ఇబ్బంది కలుగచేసే గ్రహాలు. అయితే మిగిలిన గ్రహాలు అనుకూలంగా ఉన్న కారణంగా అన్ని విషయాల్లోనూ తెలివిగా సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఎలర్జీలు, ఎముకల సంబంధ సమస్యలు ఉన్నవారు కొంత ఇబ్బంది పడతారు. ఆదాయ వ్యయాలు, ఋణాలు సమతూకంగా వుండవు. జాగ్రత్త అవసరం. మార్చి: ఏ పనీ సరిగా పూర్తి చేయలేరు. చాలా పనులు మొదలుపెడుతుంటారు. ఎవరి సహకారమూ అందదు. పని ఒత్తిడి పెరుగుతుంది. తరచు కోపావేశాలు ప్రదర్శిస్తారు. వృథాగా సంచారం చేస్తూ ఉంటారు. రోజువారీ పనుల్లో సైతం సంతుష్టి లేకుండా కాలం గడుపుతారు. సాంఘిక కార్యకలాపాలు అగౌరవం తెచ్చే అవకాశం ఉంది. మీ జాతకానికి ఈ గోచారాన్ని మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి, గోచానాకి పోలిక చేసి ఫలితములు తెలుసుకోండి. ∙∙ మిథున రాశి ఆదాయం–11 వ్యయం–5 రాజయోగం–2 అవమానం–2 మృగశిర 3,4 పాదములు (కా, కి) ఆరుద్ర 1,2,3,4 పాదములు (కూ, ఖం, ఙ, ఛ) పునర్వసు 1,2,3 పాదములు (కే, కొ, హా) ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ 13 వరకు కుంభం (భాగ్యం)లోను తదుపరి మీనం (రాజ్యం)లోనూ సంచారం చేస్తారు. శని ఏప్రిల్ 28 వరకు మళ్లీ జూలై 12 నుంచి 2023 జూలై 17 వరకు మకరం (అష్టమం)లోనూ మిగిలిన కాలమంతా కుంభంలోనూ సంచరిస్తారు. ఏప్రిల్ 12 వరకు రాహువు వృషభం (వ్యయం) కేతువు వృశ్చికం (షష్ఠం)లోనూ తదుపరి రాహువు మేషం (లాభం) కేతువు, తుల (పంచమం)లోను సంచరిస్తారు. 2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (వ్యయం)లో స్తంభన. మొత్తం మీద ఈ గోచారం సంవత్సరం అంతా గ్రహచారం అనుకూలిస్తుంది. గత కొద్దికాలంగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు. ఈ కాలంలో సమయం వృథా చేయకుండా కృషి చేసేవారు సత్ఫలితాలు అందుకుంటారు. వృథా కాలక్షేపం చేసేవారికి ఈ గ్రహచారం ఎంతో కొంత జ్ఞానాన్ని అందిస్తుంది. చతుష్పాద జంతువులు, ఆటోమొబైల్ వ్యాపారములు వృత్తులలో వున్నవారు, కులవృత్తిలో వున్నవారు ఈ సంవత్సరం చాలావరకు సమస్యల నుంచి బయటకు వచ్చే మార్గాలను తెలుసుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో గతంలో చేసిన పొరపాట్లు గుర్తించి, వాటిని సరిచేసుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అన్ని కోణాల్లోనూ పురోభివృద్ధి వైపు ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఆనందంగా ఉంటారు. రోజువారీ పనులు చక్కగా పూర్తవుతాయి. భోజన వస్తు అలంకరణ విషయాలలో చాలావరకు సంతృప్తికరంగా ఉంటుంది. శుభకార్యాలు, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. అన్ని సందర్భాల్లోనూ కుటుంబసభ్యులు ప్రోత్సాహం ఉంటుంది. భార్యాపుత్రుల విషయంలోను, కుటుంబంలోని పెద్దల అరోగ్య విషయంలోను అనుకూల స్థితి ఉంటుంది. బంధు సహకారం చాలా బాగా ఉంటుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు సంవత్సరం అంతా పనివాళ్లతో ఇబ్బందులు ఉంటాయి. అయితే వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. అధికారుల నుంచి సహకారం బాగా ఉంటుంది. అంతా అనుకూలమైన కాలమనే చెప్పాలి. ఆరోగ్యపరంగా గత సమస్యలకు మంచి వైద్యం లభిస్తుంది. అయితే ఎముకలు, చర్మ సంబంధ సమస్యలు ఉన్నవారికి అనుకూలత తక్కువ. ఈ సంవత్సరం కొత్తకొత్త పరిచయాలు పెరుగుతాయి. ధర్మకార్యాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. గురు అనుగ్రహం ఉంది. స్థిరాస్తి కొనుగోలు ఇబ్బందులు లేకుండా లాభదాయకంగా ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు వేగవంతమవుతాయి. స్నేహితులు, బంధువులు మంచి ప్రోత్సాహం ఇస్తారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి అంతా శుభసూచకమే. విద్యా నిమిత్తంగా వెళ్ళేవారికి అనుకూలం. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు గురుబలం, రాహుబలం బాగా అనుకూలించి లాభం పొందుతారు. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. రైతులకు శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. మంచి సలహాలు సమయానికి అందుతాయి. గర్భిణిలు ఈ సంవత్సరం ఆగస్టు తరువాత ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి. మృగశిర నక్షత్రం వారు బహు జాగ్రత్తలు తీసుకోవలసిన కాలం. క్రమంగా కొన్ని సమస్యలు తీరుతున్నట్లుగా గోచరిస్తుంది. కానీ ఆగస్టు నుంచి 2023 జూన్ వరకు బహు జాగ్రత్తలు తీసుకుంటూ వుండవలసిన కాలం. ముఖ్యంగా వ్యవహార సమస్యలు, ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు వున్నాయి. వాటిని సరిచేసుకుని ముందుకు వెళ్ళేందుకు సిద్ధపడండి. ఆరుద్ర నక్షత్రం వారికి అదృష్టం కలిసి వచ్చేలాగా కాలం గోచరిస్తోంది. అయితే అవరోధం లేకుండా ఏ పనీ పూర్తి అవ్వదు. తరచుగా ఇతర ప్రాంతాలకు వెళ్ళాలి అనే కోరికలు ఎక్కువ అవుతాయి. భార్యాపిల్లల ఆరోగ్యం, విద్య, వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. గత పొరపాట్లు ఇప్పుడు కనువిప్పునిస్తాయి. పునర్వసు నక్షత్రం వారు అలంకరణ వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. సంతుష్టిగా భోజనం చేసే విషయంలో ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తారు. తరచుగా పుణ్య కార్యాలు చేస్తుంటారు. చతుష్పాద జంతువుల పెంపకం మీద ఆసక్తి వున్నవారికి, పాడి పరిశ్రమలో వున్నవారికి లాభదాయకంగా వుంటుంది. శాంతి : శనికి తరచుగా శాంతి చేయించడం. ఆగస్టు తరువాత కుజుడి శాంతి చేయించడం చాలా అవసరం. రోజూ సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. షణ్ముఖ రుద్రాక్షధారణ చేయడం ద్వారా తరచుగా శుభాలు జరుగుతాయి. ఏప్రిల్: ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రతి పనీ శ్రమతో పూర్తవుతుంది. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. కుజగ్రహ శాంతి అవసరం. ఆరోగ్య విషయంలో పాత సమస్యలు ఇబ్బంది పెడతాయి. పనిముట్ల వాడకంలో జాగ్రత్తలు అవసరం. మే: అంతా శుభసూచకంగా ఉంటుంది. వాక్పటిమతో అన్ని పనులూ సాధిస్తారు. కొన్ని సందర్భాలలో అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అందరి నుంచి మంచి సహకారం లభిస్తుంది. భార్యాపిల్లలు బాగా సహకరిస్తారు. కొత్త ఆలోచనలు ఈ నెలలో అమలులోకి వస్తాయి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఋణ సౌకర్యం లభిస్తుంది. జూన్: తెలివితేటలు బాగా ప్రదర్శించి కార్యజయం సాధిస్తారు. అయితే పనులన్నీ శ్రమతో మాత్రమే పూర్తవుతాయి. చివరి వారంలో అనవసర కలహాలు వస్తుంటాయి. తరచుగా ఈ నెలలో శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల రాకపోకలు సరదా కాలక్షేపాలతో కాలం గడుపుతారు. వాహన ప్రమాదం జరగకుండా చూసుకోండి. జూలై: మంచి ధైర్యం ప్రదర్శిస్తారు. మొదటి రెండు వారాలు ప్రయాణాల్లో చికాకులు ఎదురవుతాయి. మొత్తం మీద నెల రోజులు అనుకూల కాలమే. అన్ని పనులూ చివరి రెండు వారాల్లో తేలికగా పూర్తవుతాయి. కుటుంబసభ్యుల సహకారం అద్భుతంగా ఉంటుంది. స్నేహపూర్వక ధోరణితో పనులు పూర్తి చేసుకుంటారు. ఆగస్టు: ఇక్కడి నుంచి కుజుడు అధికకాలం యోగించని స్థానంలో సంచరిస్తారు. అయితే మిగిలిన గ్రహచారం అనుకూలత దృష్ట్యా పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ ఆరోగ్య ఋణ వ్యవహారాలు సమస్యలకు దారి తీయకుండా జాగ్రత్తలు పడాలి. రానున్న ఆరునెలలు వాహన చికాకులు, ప్రయాణ చికాకులు రాకుండా జాగ్రత్తపడండి. సెప్టెంబర్: గతం కంటే కొంత మంచి మార్పులు ఈ నెలలో ద్వితీయార్ధంలో ఉంటాయి. అనవసర వ్యవహారాలను ముందుగా గుర్తించి, తగిన జాగ్రత్తలు పాటించి జీవితాన్ని సుఖమయం చేసుకుంటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. విద్యా విజ్ఞాన వినోద కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. నూతన వ్యవహారాలకు సానుకూలం కాదు. అక్టోబర్: బుధ శుక్రులు అనుకూలం అయినా, కుజ శని సంచారం వలన ఈ నెలలో అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా స్నేహితులతో కలిసి ఏ వ్యవహారాలూ చేయకండి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. అవకాశం చూసుకొని ఋణ విషయాల్లో సెటిల్మెంట్ ధోరణిని అవలంబించండి. నవంబర్: కొద్దిరోజులు అనుకూలంగా కొద్ది రోజులు ప్రతికూలంగా ఫలితాలు ఉంటాయి. తరచుగా కొత్త ప్రయోగాలు చేయాలనుకుంటారు. మీ ఉద్యోగ విధి నిర్వహణలో అధికారుల ఒత్తిడి పెరిగి క్రమంగా చివర్లో లాభిస్తుంది. పుణ్యకార్యాలపై దృష్టిపెడతారు. డిసెంబర్: ఉద్యోగ విషయంలో ఎవరిమీదా ఆధారపడవద్దు. వ్యాపారస్తులు ధైర్యంగా ఉంటారు. కానీ సంతృప్తికరంగా వ్యాపారం చేసే అవకాశం లేదు. తరచుగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ధనం సర్దుబాటు కావడం కష్టమే. భోజనం వంటి రోజువారీ కార్యక్రమాలు సరిగా నడవక ఇబ్బందులు ఎదుర్కొంటారు. జనవరి: ప్రతి విషయంలో జాగ్రత్తలు పాటించవలసిన కాలం. ఎవరి మీదా ఆధారపడకూడని కాలం. మీ వ్యవహారాలు మిత్ర భేదానికి, బంధు వైరానికి తావివ్వకుండా చూసుకోండి. చివరి వారంలో కుటుంబ సౌఖ్యం చేకూరుతుంది. వృత్తి సౌఖ్యం తక్కువ అనే చెప్పాలి. ఫిబ్రవరి: ప్రధానంగా కుజ, రవి సంచారం ఫలితంగా 15వ తేదీలోగా ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారులతో చికాకులు అధికంగా ఉంటాయి. తరువాత సాధారణ స్థాయిలో ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్థిక వనరులు బాగానే సమకూరతాయి. ఆరోగ్య విషయంలో అధిక జాగ్రత్త అవసరం. మార్చి: ఆరోగ్య పరిరక్షణ మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించండి. అత్యవసర పరిస్థితిలో మాత్రమే ప్రయాణాలు చేయండి. ప్రత్యేక ఇబ్బందులు ఉండవుగాని, జాగ్రత్తగా ఉండవలసిన కాలమే. రోజువారీ కార్యక్రమాలు సైతం అకాలంలో పూర్తవుతాయి. వృత్తి విషయాలలో అందరితోనూ స్నేహంగా ఉండటం అలవరచుకోవాలి. మీ జాతకానికి ఈ గోచారాన్ని మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి, గోచారానికి పోలిక చేసి ఫలితములు తెలుసుకోండి. కర్కాటక రాశి ఆదాయం–5 వ్యయం–5 రాజయోగం–5 అవమానం–2 పునర్వసు 4వ పాదము (హి) పుష్యమి 1,2,3,4 పాదములు (హూ, హే, హొ, డా) ఆశ్లేష 1,2,3,4 పాదములు (డీ, డూ, డే, డొ) ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ 13 వరకు కుంభం (అష్టమం)లోను తదుపరి మీనం (భాగ్యం)లోను సంచారం చేస్తారు. శని ఏప్రిల్ 28 వరకు జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం (సప్తమం)లోను మిగిలినకాలం అంతా కుంభంలోనూ సంచరిస్తారు. ఏప్రిల్ 12 వరకు రాహువు వృషభం (లాభం) కేతువు వృశ్చికం (పంచమం)లోను తదుపరి రాహువు మేషం (దశమం), కేతువు, తుల (చతుర్థం)లోను సంచరిస్తారు. 2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (లాభం)లో స్తంభన. మొత్తం మీద ఈ సంవత్సరం అంతా ప్రతి వ్యవహారంలోనూ ఆలస్యం జరుగుతుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే అనుకూల స్థితిని అందుకోగలుగుతారు. కుటుంబసభ్యులు సహకారంగా ఉన్నా, వారికీ మీకు మధ్య అవగాహన లోపం వస్తూనే ఉంటుంది. మిత్రులలోనూ బంధువులతోనూ కూడా కొన్ని సందర్భాలలో అనుకూలత, కొన్ని సందర్భాలలో ప్రతికూలత ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. ఖర్చులకు తగిన ఆదాయం అందుతుంది. కుజస్తంభన ఈ రాశివారికి ఇబ్బందికరం కాదు. తరచుగా పుణ్యక్షేత్ర సందర్శనలు చేస్తారు శుభకార్యాల నిమిత్తం ప్రయాణాలు చేస్తారు. భోజనం, వస్త్రధారణ వంటి విషయాల్లో స్వేచ్ఛాప్రవర్తన కలిగి ఉంటారు. ఉల్లాసవంతంగా విజ్ఞాన వినోద కార్యక్రమాల్లో కాలక్షేపం చేస్తారు. ఋణములు అవసరం ప్రకారం అందుకుంటారు. అదేరీతిగా మీరు తీర్చవలసిన ఋణములు కూడా అనుకూలమే. సాంఘిక గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తిరీత్యా వృద్ధి, గత సమస్యలు పరిష్కారమవుతాయి. సుఖ జీవనం సాగిస్తారు. వ్యాపారులకు పనివాళ్లతో సమస్యలు ఎదురవుతాయి. స్వయం నిర్ణయాలు, వ్యవహారాలు చేసే వ్యాపారులకు సంవత్సరం అంతా మంచి ఫలితాలు ఉంటాయి. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. ఉద్యోగులకు తోటివారితోనూ, కింద పనిచేసేవారితోనూ అనుకూలత తక్కువ. అధికారుల అండదండలతో అన్నివిధాలా మంచి ఫలితాలు అందుకునే అవకాశం ఉంది. వాత, నాడీ, చర్మ సమస్యలు ఉన్నవారికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. శని సంచార ప్రభావంతో చిన్న చిన్న సీజనల్ ఇబ్బందులు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో గురువు మీనంలో సంచరించే కాలం అనుకూలం. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి మంచి సలహాలు, సహకారం లభిస్తాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి మంచి కాలం. విద్య ఉద్యోగం రెండు అంశాలలోను కాలం అనుకూలం. షేర్ వ్యాపారులకు ఫైనాన్స్ వ్యాపారులకు గురుబలం దృష్ట్యా మంచి ఫలితాలు ఉంటాయి. కానీ జాగ్రత్త అవసరం. విద్యార్థులకు మంచి ఫలితాలు అందుతాయి. అనవసర ఆందోళనలు పొందవద్దు. రైతులకు శ్రమ ఎక్కువ అయినా.. లాభదాయక ఫలితాలు ఉంటాయి. గర్భిణిలకు శని సంచారం అనుకూలం కాకున్నా, గురుబలం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి. పునర్వసు నక్షత్రం వారికి చాలా అద్భుతమైన వృత్తిలాభాలు అందుతాయి. సహజంగా అష్టమశని ప్రభావంగా ఇబ్బందులు రావాలిగాని, ఈ నక్షత్రం వారు ఇబ్బందులను దాటి చివరకు లబ్ధి పొందుతారు. ఆర్థిక లావాదేవీలు పూర్తి సానుకూలంగా సాగుతాయి. పుష్యమి నక్షత్రం వారు ప్రతి అంశం బాగా ఆలోచించిన తర్వాతే ప్రారంభించాలి. విశేషం ఏమిటంటే ప్రయత్నించిన ప్రతి పనీ లాభదాయకంగా పూర్తి చేసుకుంటారు. కొన్నిసార్లు డబ్బునిల్వలు తగ్గి ఇబ్బంది పడతారు. ఆశ్లేష నక్షత్రం వారు మానసిక ఒత్తిడి పొందుతారు. విశ్రాంతి కరువవుతుంది. పనులు పూర్తి చేసేలోపుగా కలçహాలు తలెత్తుతాయి. అయితే, చివరకు సత్ఫలితాలనే అందుకుంటారు. ఆర్థిక లావాదేవీల్లో అదుపు సాధించి, గౌరవ మర్యాదలు అందుకుంటారు. గత సమస్యలు ఇంకా కొన్ని వుంటాయి. శాంతి: శనికి శాంతి చేయించండి. రోజూ ప్రాతఃకాలంలో ఆంజనేయస్వామి చుట్టూ రామనామం జపిస్తూ పదకొండు ప్రదక్షిణలు చేయడం ద్వారా శనిదోషం తగ్గి పనులు వేగం పుంజుకుంటాయి. ‘గౌరీశంకర’ రుద్రాక్ష ధరించండి. ఏప్రిల్: ద్వితీయార్ధంలో శని కుజ శాంతి చేయించండి. ప్రతిపనీ ఆలస్యంగా పూర్తవుతుంది. కోపం నియంత్రించుకోవాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు అవసరం. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ప్రతి విషయంలోనూ సమయపాలన చేయలేని స్థితి ఉంటుంది. ఋణ చికాకులు ఉంటాయి. మే: బహు జాగ్రత్తగా ఉండవలసిన కాలం. ఆర్థిక వ్యవహారాలు సక్రమంగా జరగవు. ఈ నెల ద్వితీయార్ధం అనుకూలం. దైనందిన కార్యక్రమాలు అస్తవ్యస్తంగా నడుస్తాయి. ఉద్యోగులకు తోటివారి సహకారం బాగుంటుంది. ఆర్థికంగా నెలాఖరులో అనుకూలం. కుటుంబ విషయాలు అనుకూలంగా ఉంటాయి. జూన్: సరైన సమయానికి అన్నవస్త్రాలు కూడా సమకూరని స్థితి ఉంటుంది. ప్రతి విషయంలోనూ శ్రమ ఎక్కువ. వ్యవహార భయం వెంబడిస్తుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ధనం వెసులుబాటు బాగుంటుంది. విద్యార్థులకు రైతులకు అనుకూలత తక్కువ. జూలై: చక్కటి కాలం. అష్టమ శని, సప్తమ శని ఉన్నా, కుజ గురు శుక్రుల అనుకూలత వల్ల పనులు చక్కగా పూర్తవుతాయి. చివర్లో కొంచెం చికాకులు ఎదురైనా, మొత్తం మీద పనులు వేగంగా సానుకూలంగా పూర్తి కాగలవు. సమయం వృథా చేయకుండా ముందుకు వెళ్లండి. అనవసర ఆందోళనలు వద్దని సూచన. ఆగస్టు: మనశ్శాంతిగా ఉంటారు. కోరికలకు తగిన విధంగా ప్రవర్తించుకునే అవకాశాలు ఉన్న కాలం. అన్నింటా విజయం సాధిస్తారు. ప్రత్యేకంగా గత సమస్యలకు ఈ నెలలో పరిష్కార మార్గాలు లభిస్తాయి. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్తలు అవసరం. సెప్టెంబర్: 15వ తేదీ వరకు తెలివి, ఓర్పు ప్రదర్శనతోనూ, ఆ తదుపరి ధైర్యంతోనూ పనులు సానుకూలం చేసుకుంటారు. సమస్యలను ముందుగా గుర్తిస్తారు. 15వ తేదీ తర్వాత కొత్త ప్రయోగాలు చేయకండి. వృత్తి విషయాలలో కిందివారి సహకారం సరిగా ఉండదు కాని, అధికారులు బాగా సహకరిస్తారు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. అక్టోబర్: అవకాశం కోరిక ఉంటే స్థానచలన ప్రయత్నాలు ఈ నెల 15వ తేదీ నుంచి చేయండి. శని దోషంతో పాటు అనుకూలించే గ్రహాల ప్రభావం వల్ల ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రధానంగా క్రమంగా కుటుంబ, ఆర్థిక సమస్యలు నెమ్మదిగా సద్దుమణిగే అవకాశాలు ఉన్నాయి. శని కుజులకు ఈ నెలలో శాంతి అవసరం. నవంబర్: 13వ తేదీ నుంచి పనులు వేగంగా సాగుతాయి. శనిదోషం ఉన్నప్పటికీ మిగిలిన గ్రహచారం అనుకూలంగా ఉన్నందున పనులు వేగంగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆసక్తికర అంశాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అంతా సానుకూల వాతావరణమే ఉంటుంది. మొత్తం మీద ఈ నెల అంతా మంచికాలమే. డిసెంబర్: పనులు ఆలస్యమైనా, ఇబ్బంది లేకుండా సాగుతాయి. తెలివిగా ప్రతి పనిలోనూ లబ్ధి పొందుతారు. 15వ తేదీ నుంచి రవి అనుకూలత, నెలంతా కుజుడి అనుకూలత వల్ల ధైర్యంగా ఉంటారు. స్నేహితులతో జాగ్రత్తలు వహించాలి. ప్రయత్నం చేసినా ప్రతి పనిలోనూ ఏదో ఒక రూపంగా లాభమే ఉంటుంది. జనవరి: పరిస్థితి ఎలా ఉన్నా, చాలా విషయాల్లో 15వ తేదీ వరకు బాగా ధైర్యంగా ఉంటారు. ఆ తర్వాత చిన్న చిన్న అధైర్య లక్షణాలు బయటపడతాయి. ఇతరులను నమ్మి ఏ పనీ చేయవద్దు. కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఏ పనీ చేయవద్దు. ఎవరికీ ఏ విధమైన హామీలు ఇవ్వవద్దు. కొత్త ఋణాలు చేయవద్దు. ఫిబ్రవరి: అంతా బాగున్నట్లు గోచరిస్తుంది కాని, ఏవో తెలియని సమస్యలు వెంటాడే అవకాశం ఉంది. బంధుమిత్రుల రాకపోకలు అధికంగా ఉంటాయి. ఏ పని మీదా దృష్టి సారించలేరు. భోజన వస్త్రధారణ విషయాల్లో పరిస్థితులు మీ కోరికకు తగినట్లుగా ఉండవు. ఉద్యోగ భద్రతపై తెలియని భయం ఉంటుంది. మార్చి: కోర్టు గొడవలు ఉన్నవారు చాలా విచిత్ర సమస్యలను ఎదుర్కొంటారు. ప్రతి విషయంలో ధన సమస్య ఎదురవుతుంది. భాగస్వామ్య వ్యవహారాలు బాగా చికాకులు కలిగించేవిగా ఉంటాయి. అందరితోనూ విభేదాలు ఉంటాయి. వాహన అసౌకర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య పరిరక్షణ చాలా అవసరం. మీ జాతకానికి ఈ గోచారం మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి గోచారానికి పోలిక చేసి ఫలితములు తెలుసుకోండి. సింహ రాశి ఆదాయం–8 వ్యయం–14 రాజయోగం–1 అవమానం–5 మఘ 1,2,3,4 పాదములు (ము, మే, మూ, మే) పుబ్బ 1,2,3,4 పాదములు (మో, టా, టే, టూ) ఉత్తర 1వ పాదము (టే) ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ 13 వరకు కుంభం (సప్తమం)లోను తదుపరి మీనం (అష్టమి)లోను సంచారం చేస్తారు. శని ఏప్రిల్ 28 వరకు మరల జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం (షష్ఠం)లోను మిగిలిన కాలం అంతా కుంభంలోను సంచరిస్తారు. ఏప్రిల్ 12 వరకు రాహువు వృషభం (రాజ్యం) కేతువు వృశ్చికం (చతుర్థం)లోనూ తదుపరి రాహువు మేషం (భాగ్యం) కేతువు తుల (తృతీయం)లో సంచరిస్తారు. 2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (దశమం)లో స్తంభన. మొత్తం మీద ఈ గోచారం సంవత్సరం అంతా అనుకూల ప్రతికూల ఫలితాలు మీ ప్రవర్తనపై ఆధారపడి ఉంటాయి. మకర శని సంచారం కుంభ గురు సంచార కాలం అనుకూలం. ఈ సంవత్సరం ఏ పని అయినా స్వయంగా చేసుకుంటే సానుకూలం. ఇతరుల మీద ఆధారపడితే ప్రతికూలం. ప్రధానంగా ఆదాయం తక్కువగా ఉంటుంది. ఖర్చులు నియంత్రించుకోగలిగిన వారికి కాలం అనుకూలం. లేకుంటే, ఇబ్బందికరం. కావలసిన కొత్త ఋణాలు సమయానికి అందుబాటులో లేకపోవడంతో పాత ఋణాలు తీర్చే ప్రయత్నాలు ఇబ్బందికరంగా ఉంటాయి. కుటుంబ సమస్యలు ప్రత్యేకంగా ఏమీ ఉండవుగాని, తెలియని అవగాహన లోపాలు వెంబడిస్తుంటాయి. ఏప్రిల్ నుంచి మూడు నెలల కాలంలో వస్తువులు చోరీకి గురవడం, అనుకోని భయం, తరచుగా దేశాంతరం వెళ్ళవలసి రావటం వంటివి ఉంటాయి. కొన్ని సందర్భాలలో మౌనం చాలా శుభప్రదంగా ఫలిస్తుంది. గృహనిర్మాణ, శుభకార్య ప్రయత్నాలకు మంచి సూచనలు, సలహాలు అందుతాయి. చతుష్పాద జంతువుల ద్వారా చికాకులు రాగలవు. తరచుగా ప్రయాణంలో ఆటంకాలు ఎదురవుతాయి. అధికారులను, ప్రభుత్వంలో పెద్దలను కలుసుకుంటారు. వ్యాపారాల్లో అనవసర పోటీలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారులకు సంవత్సరం అంతా శ్రమ ఒత్తిడి ఉంటుంది. అయినా, కాలం కలసివస్తుంది. ఉద్యోగులకు అధికారులతో పాటు తోటివారి సహాయ సహకారాలు బాగా ఉంటాయి. ప్రమోషన్ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. ఆరోగ్య విషయంలో పెద్ద ఇబ్బందులు ఉండవుగాని, శని, గురువుల ప్రభావం వల్ల మే జూన్ నెలల్లో తరచుగా ఉష్ణప్రకోపానికి లోనవడం, పాత రుగ్మతలు పునరావృతం కావడం వంటివి ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలుకు మే, జూన్ మాసాలలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు వేగంగా సాగుతాయి. మిత్రులు సహకరిస్తారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు సునాయాసంగా సాధ్యపడతాయి. షేర్ వ్యాపారులకు ఫైనాన్స్ వ్యాపారులకు కాలం అనుకూలంగా ఉన్నా, దూకుడుగా వ్యవహరించరాదు. విద్యార్థులకు శ్రమ చేసే కొద్దీ మంచి ఫలితాలు అందుతాయి. పోటీ పరీక్షలలో రాణిస్తారు. రైతులకు మంచి ఫలితాలు దక్కుతాయి. గర్భిణీస్త్రీలు నిత్యం అనవసర ఆలోచనలు చేస్తూ ఉంటారు. అయితే ఎటువంటి ఇబ్బందులూ ఉండవు. మఘ నక్షత్రం వారికి హామీలు నిలబెట్టుకోలేని స్థితి వుంటుంది. ప్రయాణాల్లో చికాకులు, వాహనాల రిపేర్ల కారణంగా అధిక ఖర్చులు వుంటాయి. ప్రతిపనీ ఆలస్యమవుతుంది. ఖర్చులు అధికంగా ఉన్నా, చివరకు కొంతలాభం పొందుతారు. బంధుమిత్రులతో విభేదాలు రాకుండా జాగ్రత్తపడాలి. పుబ్బ నక్షత్రం వారికి అంతా ఆలస్యమయంగా ఉంటుంది. ఈ నక్షత్ర గర్బిణిలు చాలా చికాకులు పొందే అవకాశం వుంటుంది. ఈ సంవత్సరం ఎప్పుడు అవకాశం కుదిరితే అప్పుడే పనులు త్వరగా పూర్తి చేసి లాభాలు అందుకోవాలని మీరు చేసే ప్రయత్నాలు చాలా తేలికగా సత్ఫలితాలనిస్తాయి. ఉత్తరా నక్షత్రం వారికి తరచుగా విశ్రాంతి తీసుకోవాలనే కోరిక పెరుగుతుంది. అనవసర బాధ్యతలు పెరుగుతాయి. అందరికీ ఉపయోగపడే పనులు చేయడంలో ఎక్కువగా శ్రమిస్తారు. తరచుగా పూజ్యులను, పెద్దలను, ప్రభుత్వ పదవుల్లోని పెద్దలను దర్శించుకోవడం జరుగుతుంది. శాంతి: నాలుగు ముఖాల రుద్రాక్ష ధరించడం ద్వారా ప్రశాంతత ఏర్పడుతుంది. మే మొదటివారంలో శని జపం చేయించండి. ప్రతిరోజూ ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణలు చేసి, లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసినట్లయితే ప్రశాంతత లభిస్తుంది. ఏప్రిల్: ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. ఏ పని ప్రారంభించినా, పూర్తయ్యేదాకా చాలా దక్షతతో వ్యవహారిస్తారు. అందరి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయ వ్యయాల మీద పట్టు సాధిస్తారు. ఆరోగ్య విషయమై శ్రద్ధ పెంచాలి. ద్వితీయార్ధంలో శనికి జపం చేయించండి. ఎవరి మీద ఆధారపడవద్దు. మే: అన్ని అంశాల్లోనూ తెలియని అసంతృప్తి ఉంటుంది. పనులు వేగంగా సాగవు. కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదాయ, వ్యయాలు నియంత్రణలో ఉండవు. బంధువుల రాకపోకలు ఎక్కువ అవుతాయి. వృథా కాలక్షేపాలు, వృథా ప్రయాణాలు, వృథా ఖర్చులు ఉంటాయి. పెద్దల ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. జూన్: పనులకు అవాంతరాలు అధికమవుతాయి. దేశాంతరం వెళ్ళాలనే కోరిక ఎక్కువ అవుతుంది. ఋణాలు ఇచ్చి పుచ్చుకునే ప్రకరణంలో అవమానాలకు అవకాశం ఉంది. స్థానచలన, ప్రమోషన్ ప్రయత్నాల్లో జాగ్రత్తలు అవసరం. బంధుమిత్రుల రాకపోకల విషయంలో అధిక జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాలను స్వయంగా చూసుకోండి. జూలై: చాలా అద్భుతమైన గోచారం అనే చెప్పాలి. సమయం వృథా చేయకుండా నడుచుకుంటే, అంతా ఆనందదాయకంగా ఉంటుంది. సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రధానంగా వృత్తి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యుల సహకారం అద్భుతంగా ఉంటుంది. ఆగస్టు: సమస్యలు ఉన్న పనులను వదిలేసి, సమస్యలు లేని పనులు చేయడం ద్వారా కొంత సుఖపడతారు. అయితే పని ఎగవేసే ధోరణి సరి కాదని గమనించుకోండి. ఆర్థిక లావాదేవీలు సరిగా సాగవు. అందరితోనూ స్నేహపూర్వకంగా మెలగాలి. పనిముట్ల వాడకం ఇబ్బందికరం. ప్రయాణ చికాకులు ఎక్కువ. సెప్టెంబర్: పనుల ఎగవేత ధోరణిని విడనాడాలి. ప్రతి పనిలోనూ శ్రమాధిక్యం ఎదురైనా, ఫలితాలు సానుకూలంగానే ఉంటాయి. ప్రతి విషయంలోనూ ధనవ్యయం అధికం అవుతుంది. సరైన సమయానికి డబ్బు వెసులుబాటు కాదు. అయితే ఋణ విషయాలు, ఖర్చులు, ఈ నెలలో కొంత చికాకు కలిగిస్తాయి. అక్టోబర్ : ప్రారంభంలో కొన్ని ఇబ్బందులున్నా క్రమంగా అన్నీ తీరిపోయి మంచి ఫలితాలు వస్తాయి. 15వ తేదీ తరువాత వృత్తి సౌఖ్యం చాలా బాగుంటుంది. చాలా తెలివి ప్రదర్శిస్తారు. ఆర్థిక విషయాలలో చికాకులను క్రమంగా పరిష్కరించుకోగలుగుతారు. ఈ నెలలో స్నేహితులు బంధువుల సహకారం బాగుంటుంది. నవంబర్: మాసారంభం నుంచి చక్కటి ఫలితాలు ఉంటాయి. అన్ని గ్రహాలు ఈ నెలలో అనుకూలిస్తాయి. శుభకార్యాలు త్వరగా నెరవేరుతాయి. ఉద్యోగ భద్రత బాగుంటుంది. అందరూ బాగా సహకరిస్తారు. పుణ్యకార్యాలు చేస్తారు. గురువులను, పూజ్యులను దర్శించుకుంటారు. ప్రశాంతంగా కాలం గడిచిపోతుంది. డిసెంబర్: చాలా చక్కటి కాలం. అన్ని పనులూ చక్కగా పూర్తయి, ఆనందంగా ఉంటారు. డబ్బు వెసులుబాటు బాగుంటుంది. ఖర్చులను నియంత్రించగలుగుతారు. అందరి నుంచి మంచి సహకారం లభిస్తుంది. గత ఆరోగ్య సమస్యలకు ఈ నెలలో వైద్య సహాయం లభిస్తుంది. పుణ్యక్షేత్రాలను, గురువులను దర్శించుకుంటారు. జనవరి: వృత్తి విషయాల్లో ఒత్తిడి, కార్యాలస్యం వుంటాయి. అయినా ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ప్రధానంగా ఈ నెలలో కుటుంబ సమస్యల మీద దృష్టి ఉంచండి. డబ్బు వెసులుబాటు కొంత ఇబ్బందికరమే అయినా, తెలివిగా ఖర్చులను సానుకూలం చేయగలుగుతారు. ప్రశాంతంగా ఉంటారు. ఫిబ్రవరి: అన్ని అంశాల్లోనూ జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా మితభాషణ, ఓర్పు చాలా అవసరం. కలహాలు రాకుండా మాటతీరు సరిచూసుకోవాలి. అవమానకర ఘటనలు తలెత్తకుండా జాగ్రత్తపడండి. ఇతరుల విషయాల్లో కలగజేసుకోకండి. మీ పనులు మీరు స్వయంగా చేసుకునేటట్లయితే కొంతవరకు సమస్యలు దూరమవుతాయి. మార్చి: ఆర్థిక వ్యవహారాల్లో చికాకులు ఉంటాయి. ఆదాయ వ్యయాలు సమతూకంగా ఉండవు. అయినా ధైర్యంగా ఉంటారు. వృత్తి విషయంలో ఇబ్బందులు ఉంటాయి. రవి సంచారం అనుకూలం లేకపోవడం, గురు, శని సంచారం కూడా సరిగా లేని కారణంగా అన్ని అంశాల్లోనూ ఓర్పుతో మెలగవలసిన అవసరం ఉంది. మీ జాతకానికి ఈ గోచారాన్ని మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి, గోచారానికి పోలిక చేసి ఫలితములు తెలుసుకోండి. కన్యా రాశి ఆదాయం–11 వ్యయం–5 రాజయోగం–4 అవమానం–5 ఉత్తర 2,3,4 పాదములు (టే, పా, పీ) హస్త 1,2,3,4 పాదములు (పూ, ష, ణా, ఠా) చిత్త 1,2 పాదములు (పే, పో) ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ 13 వరకు కుంభం (షష్ఠం)లోను తదుపరి మీనం (సప్తమం)లోను సంచారం చేస్తారు. శని ఏప్రిల్ 28 వరకు మరల జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం (పంచమి)లోను మిగిలిన కాలమంతా కుంభంలోనూ సంచరిస్తారు. ఏప్రిల్ 12 వరకు రాహువు వృషభం (భాగ్యం) కేతువు వృశ్చికం (తృతీయం)లోను తదుపరి రాహువు మేషం (అష్టమం), కేతువు తుల (ద్వితీయం)లోను సంచరిస్తారు. 2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (భాగ్యం)లో స్తంభన. ఈ గోచార ప్రభావం వల్ల ఏప్రిల్ నుంచి అనవసర భయాందోళనలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కావలసిన పనులు చేయడం కంటే అనవసర వ్యవహారాలపై దృష్టి పెంచడం వల్ల అవమానాలు ఎదురవుతాయి. కింది ఉద్యోగులు, పనివారి వల్ల చికాకులు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. గురువు మీన సంచారం ప్రారంభమైనప్పటి నుంచి కొంత ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. ఖర్చులను నియంత్రించుకోగలుగుతారు. కొన్ని సందర్భాల్లో ఇతరులకు మేలు చేసినా, మీకు కీడు ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయి. రోజువారీ విషయాలలో అన్న వస్త్రాల విషయంలో కూడా పరిస్థితులు అసంతృప్తికరంగా ఉంటాయి. సమయపాలన లేక రోజువారీ పనుల్లోనూ చికాకులు పెరుగుతాయి. స్థానచలన ప్రయత్నాలను స్వయంగా చేసుకోకపోతే అనుకూలత లేని చోటుకు చేరుకోవలసి వస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో సామరస్య ధోరణిని అవలంబించి సానుకూలత సాధిస్తారు. ఋణసౌకర్యం ఏప్రిల్ నుంచి నాలుగు నెలలకాలం అనుకూలం. అయితే దూరప్రయాణాలు చేయవద్దని ప్రత్యేక సూచన. గత సంవత్సరం కంటే కొన్ని అంశాలలో మంచి ఫలితాలు అందుతాయి. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. చేస్తున్న వ్యాపారంలో మార్పులు చేసుకోవచ్చు గాని, చేస్తున్న వ్యాపారం మానడం, మారడం వద్దు. వ్యాపారులకు సంవత్సరం అంతా శ్రమకు తగిన ఫలితాలు ఉండవు. అయినా ఓర్పుగా ముందుకు సాగవలసిన అవసరం ఉంది. ఉద్యోగులు సమయానికి తగిన విధంగా ప్రవర్తించలేక ఒత్తిడికి లోనవుతారు. అధికారులతో తరచు ఇబ్బందులు వస్తాయి. అయినా నష్టం లేకుండా వీలయినంతవరకు లాభసాటిగానే ఉంటారు. ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులు ఉండవు. అయితే ఏదో అనారోగ్యం ఉందేమోననే భావనతో అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తారు. కుటుంబసభ్యుల కోసం కూడా అనవసర అపోహలతోనే వైద్య ఖర్చులు ఎక్కువవుతాయి. స్థిరాస్తి కొనుగోళ్లలో మే నెల తరువాత చాలా జాగ్రత్తగా ఉండాలి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి అన్ని అంశాల్లోనూ అవరో«ధాలు ఎక్కువగా ఉంటాయి. అయినా కార్యసాఫల్యం ఉంది. విదేశీ విద్యా నివాస ప్రయాణ ప్రయత్నాలు చేసేవారికి, సానుకూలంగా ఉంటుంది. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు అనవసర చికాకులు, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు విద్యావ్యాసంగం బాగా సాగుతుంది. ఇతర వ్యాపకాలు తగ్గించుకోవాలి. రైతులకు సొంత నిర్ణయాలతో చేసే వ్యవసాయం లాభాన్ని ఇస్తుంది. ఇతరుల సలహాలు వద్దు. గర్భిణీస్త్రీలు ఏప్రిల్ నుంచి రాహు ప్రభావం వల్ల ఒత్తిడికి లోనవుతారు. జాగ్రత్తలు పాటించాలి. ఉత్తరా నక్షత్రం వారికి కాలం బాగా అనుకూలిస్తుంది. ప్రశాంతత పెరుగుతుంది. కుటుంబ విషయంలో చాలా విశేషంగా దృష్టి కేంద్రీకరించి, బంధుమిత్రులకు దగ్గరవుతారు. వృత్తిపరంగా ప్రశాంతతను పొందుతారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. హస్త నక్షత్రం వారు ఒంటరిగా ప్రయాణాలు చేయవద్దు. మీ పనుల్లో సహాయం కోసం ఎవరినీ అర్థించవద్దు. వ్యక్తిగత విషయాల్లో గోప్యత మీకు చాలా శ్రేయస్కరం. గతంలో చేసిన పొరపాట్లు తరచు ఇబ్బంది కలిగిస్తాయి. కుటుంబంలో గౌరవానికి భంగం కలుగుతుంది. చిత్త నక్షత్రం వారు అన్నవస్త్రాలు కూడా సరిగా అమర్చుకోలేనంతగా పనుల్లో తలమునకలై వుంటారు. భయం, అగౌరవం, శ్రమకు తగిన లాభం లేకపోవడం నిరాశ కలిగిస్తాయి. మితిమీరిన పని తప్పించుకోవడం కుదరక సతమతమవుతారు. గతం కంటే పరిస్థితి బాగుంటుంది. శాంతి: గురువుకు శాంతి చేయించండి. ఏప్రిల్ 15వ తేదీ తరువాత రాహువుకు జపం చేయించండి. రోజూ ఉదయం ఎర్రటి పుష్పాలతో జగదాంబను అర్చించి, ఆ తర్వాతే రోజువారీ పనులు ప్రారంభించడం శ్రేయస్కరం. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. ఏప్రిల్: ఒక విచిత్రమైన అద్భుత మాసం ఇది. మంచి మార్పులు ప్రారంభమవుతాయి. అయితే అన్నీ లాభదాయకంగా ఉండవు. ఆర్థిక లావాదేవీలు క్రమంగా మెరుగుపడతాయి. ఉద్యోగంలో అభివృద్ధి ప్రారంభమవుతుంది. భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. గురు రాహువులకు శాంతి చేయించండి. మే: అనుకూల ప్రతికూలతలు ఎప్పుడెలా ఉంటాయో చెప్పలేని స్థితి. అయినా ధైర్యంగా ఉంటారు. ఇతరుల విషయాలలో కలగజేసుకోవద్దు. కోర్టు వ్యవహారాలు, ఇతరుల వ్యవహారాలు ఇబ్బందులు కలిగిస్తాయి.. మితభాషణ అవసరం. షేర్ వ్యాపారులకు అనుకూలత తక్కువ. అందరితోనూ ఆచితూచి జాగ్రత్తగా ఉండటం అవసరం. జూన్: రోజువారీ పనుల్లోనూ చికాకులు ఎదురవుతాయి. తరచుగా చెడు వార్తలు వింటారు. భోజన అసౌకర్యం తరచుగా ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మరింత ఇబ్బందికరమైన కాలం. కుటుంబ కలçహాలు రాకుండా జాగ్రత్తపడండి. ఖర్చులను నియంత్రించుకోవడం భవిష్యత్తుకు మంచిది. ప్రయాణాలు తగ్గించుకోండి. జూలై: నెల ప్రారంభంలో ఇబ్బందికరంగా ఉంటుంది. క్రమంగా అన్ని సమస్యలనూ చక్కదిద్దుకుంటారు. 15వ తేదీ నుంచి కొంత ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్య విషయంలో అష్టమ కుజుడి ప్రభావం ఇబ్బందికరం. కుటుంబంలో మంచి మార్పులు ప్రారంభమవుతాయి. ఆర్థిక వెసులుబాటు ఏర్పడుతుంది. అవసరానికి కావలసిన ఋణాలు సాధిస్తారు. ఆగస్టు: కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు బాగుంటాయి. ప్రతి పని బాగా ఆలోచించి చేస్తారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు కావలసిన ఏర్పాట్లు చేస్తారు. కొన్ని పెద్ద సమస్యల పరిష్కారంలో విజయం సాధిస్తారు. సెప్టెంబర్: ఎంత తెలివి, ధైర్యం ప్రదర్శించినా 15వ తేదీ వరకు వ్యవహార సానుకూలత తక్కువనే చెప్పాలి. 15వ తేదీ తరువాత పనులు వేగం పుంజుకుంటాయి. ఆహార విహారాల్లోను, అధికారులతో జరిపే సంభాషణల్లోను జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు నియంత్రించలేరు. దూర∙ప్రయాణాలు తగ్గించుకోండి. అక్టోబర్: చిన్న చిన్న చికాకులు మినహా మిగిలిన అన్ని అంశాలూ అనుకూలం. ఈ నెలలో కేవలం రవి సంచారం అనుకూలత తక్కువ. ధన ఋణ కుటుంబ అంశాలు అనుకూలం. అన్ని పనుల్లోనూ ప్రయత్నాలు ప్రారంభించగానే శుభ సూచనలు కనిపిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కాలం అనుకూలం. నవంబర్: కొత్త కొత్త ప్రయోగాలు తలపెట్టవద్దు. అలంకరణ వస్తువుల విషయంలో ధనవ్యయం ఎక్కువవుతుంది. అందరినీ గౌరవిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. సాంఘిక కార్యకలాపాల్లో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. పుణ్యకార్యాలపై దృష్టి సారిస్తారు. డిసెంబర్: చాలా మంచి కాలమనే చెప్పాలి. అనుకోకుండా పనిలో శ్రమ తొలగుతుంది. చాలా విషయాల్లో సానుకూలత ఉంటుంది. దైవబలంతో విజయపరంపర బాగా సాగుతుంది. అందరూ బాగా సహకరిస్తారు. గౌరవిస్తారు. తరచుగా శుభకార్య పుణ్యకార్యాల్లోను, విజ్ఞాన వినోద కార్యక్రమాల్లోను పాల్గొంటారు. జనవరి: చివరి వారంలో చికాకు పడతారు కాని, 22వ తేదీ వరకు అంతటా విజయం సాధిస్తూ ముందుకు వెడతారు. రోజువారీ పనుల్లో ఏ సమస్యలూ ఉండవు. చివరి వారంలో స్నేహితులతో జాగ్రత్తలు పాటించాలి. ఇబ్బందికర పరిస్థితులను ముందుగానే గుర్తించి, వాటిని దాటవేస్తారు. \ ఫిబ్రవరి: శుక్ర సంచారం సరిగాలేదు. కుటుంబ విషయంలో చికాకులు రాగలవు. ఆర్థిక వెసలుబాటు బాగానే ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఖర్చులు పెరిగినా, తగిన ఆదాయం, ఋణసౌకర్యం చేకూరుతాయి. విద్యా ప్రదర్శన, విజ్ఞాన ప్రదర్శనల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ధన ధాన్యలాభం చేకూరుతుంది. మార్చి: సర్వసాధారణంగా రోజువారీ కార్యములు చక్కగానే చేస్తుంటారు. అయితే ఉద్యోగ విషయంలో ఒత్తిడి ఎక్కువ అవుతుంది. నష్టములు ఉండవు. అన్ని పనులు సకాలంలో పూర్తి చేయగలరుగాని, పనులు పూర్తయ్యేంత వరకు మానసికంగా చికాకులు పొందుతారు. ఆర్థిక వెసులుబాటు అనుకూలం. ఋణ సదుపాయము అనుకూలం. మీ జాతకానికి ఈ గోచారాన్ని మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి, గోచారానికి పోలిక చేసి ఫలితములు తెలుసుకోండి. తులా రాశి ఆదాయం–8 వ్యయం–8 రాజయోగం–7 అవమానం–1 చిత్త 3,4 పాదములు (రా, రి) స్వాతి 1,2,3,4 పాదములు (రూ, రే, రో, తా) విశాఖ 1,2,3 పాదములు (తీ, తూ, తే) గురువు ఏప్రిల్ 13 వరకు కుంభం (పంచమం)లోనూ తదుపరి మీనం (షష్ఠం)లోను సంచారం చేస్తారు. శని ఏప్రిల్ 28 వరకు మరల జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం (చతుర్థం)లోను మిగిలినకాలం అంతా కుంభంలోను సంచరిస్తారు. ఏప్రిల్ 12 వరకు రాహువు వృషభం (అష్టమం), కేతువు వృశ్చికం (ద్వితీయం)లోను తదుపరి రాహువు మేషం (సప్తమం) కేతువు తుల (జన్మం)లో సంచరిస్తారు. 2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (అష్టమం)లో స్తంభన. మొత్తం మీద ఈ సంవత్సరం అంతా గురువు శని కొంతకాలం అనుకూలించడం రాహుకేతువులు సంవత్సరం అంతా అనుకూలింపకపోవడం వల్ల చిత్రవిచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎవరినీ నమ్మవద్దు. ఎవరి మీదా ఆధారపడి ఏ పనీ మొదలు పెట్టవద్దు. తరచుగా మోసపూరిత వాతావరణం మీ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. గురువు కుంభంలో ఉండగా ఆర్థిక వ్యవహారాలు అనుకూలం. జూన్ నుంచి కుజుడు ప్రతికూలించడం. గురువు మీనంలో సంచారం చేసేకాలంలో ఆర్థిక వెసులుబాటు సరిగా ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఋణాలు తీర్చే ప్రయత్నంలో చికాకులు రాగలవు. అవసరానికి కొత్త ఋణాలు అందక ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులు ఎప్పుడు సహకరిస్తారో ఎప్పుడు నిరాకరిస్తారో తెలియని స్థితి. పిల్లల అభివృద్ధి విషయమై అనుకూల వార్తలు అందవు. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ప్రతిరోజూ ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో తగిన జాగ్రతలు పాటించడం శ్రేయస్కరం. ప్రమోషన్, స్థానచలనం వంటి అంశాలలో మోసపూరిత వాతావరణం ఎదురవుతుంది. చేస్తున్న వ్యాపారం మానేసి, కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఈ సంవత్సరం అనుకూలం కాదు. వ్యాపారులకు సంవత్సరం అంతా అనవసర ఆలోచనలు కలిగినా, చివరకు లాభదాయకంగానే ఉంటుంది. ఉద్యోగాల్లో ఉన్నవారిని ఇతరులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఎవరి మీద ఆధారపడకుండా స్వయంగా అన్ని పనులు చేసుకుంటే మంచిది. ఆహార విహారాల్లో నియమాలు పాటించక, ముందు జాగ్రత్తలు తీసుకోక ఆరోగ్య సమస్యలుకొని తెచ్చుకుంటారు. ఈ సంవత్సరం అంతా విచిత్రమైన అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. రక్త ప్రసరణ సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి కొనుగోలులో ఎవరి సలహాలూ తీసుకోవద్దు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు అంత తేలిగా సాగవు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు సరైన మార్గంలో సాగవు. షేర్ వ్యాపారులకు ఫైనాన్స్ వ్యాపారులకు మోసం చేసేవారు ఎక్కువసార్లు ఎదురవుతారు. విద్యార్థులకు గురువు మీనంలో ఉండగా అనుకూలత తక్కువ. ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. రైతులు తొందరపాటుగా ఎవరి సలహాలు తీసుకోవద్దని, అనవసరంగా ఋణాలు చేయవద్దని సూచన. గర్భిణిలు నిత్యం ‘శ్రీమాత్రే నమః’ నామాన్ని జపిస్తూ ఉండండి. రాహు కేతువుల అనుకూలత తక్కువగా ఉన్నది. చిత్తా నక్షత్రం వారికి సంబంధం లేని అంశాలలో కూడా దోషిగా విచారణ ఎదుర్కోవలసిన పరిస్థితులు తరచుగా ఎదురవుతాయి. మానసిక స్థితి బలహీనమవుతుంది. దురలవాట్లు వున్నవారు ప్రమాదాలలో పడే అవకాశం వుంది. అవివాహితులు వివాహ ప్రయత్నం చేయకుండా వుంటేనే మంచిది. స్వాతీ నక్షత్రం వారికి తరచుగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అయినా నిబ్బరంగా ప్రవర్తించి సమస్యలను పరిష్కరించుకుంటారు. అలంకరణ వస్తువులు, గృహాలంకరణ వస్తువుల కొనుగోలు కోసం అధికంగా ధనవ్యయం చేస్తారు. బంధుమిత్రుల రాకపోకలు ఎక్కువగా వుంటాయి. విశాఖ నక్షత్రం వారు ధనసంబంధ లావాదేవీలను సరిగా నిర్వహించక ఇబ్బందుల్లో పడతారు. చేయవలసిన ముఖ్యమైన పనులు వదిలేసి, ఇతర పనులు వెంటపడి సమస్యలను కొని తెచ్చుకుంటారు. బుద్ధిస్థిరత్వం లేకుండా ప్రవర్తించి సమస్యలను పెంచుకుంటారు. శాంతి: రోజూ తెల్లటి పుష్పాలతో జగదాంబను అర్చించండి. ప్రతి నాలుగు మాసాలకు ఒకసారి రాహు కేతు గురువులకు శాంతి చేయించండి. తెల్ల జిల్లేడు, గరిక, మారేడుపత్రితో గణపతి దేవాలయంలో నిత్యం అర్చన చేయించండి. తొమ్మిది ముఖా రుద్రాక్షధారణ విశేషం. ఏప్రిల్: పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. ఈ నెల వృత్తిరీత్యా మంచి మార్పులు ప్రారంభం అవుతాయి. శుభ కార్యాల్లో శుభవార్తలు వింటారు. పుణ్యకార్యాల్లో పొల్గొంటారు. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది. రాహు, కేతు గ్రహశాంతి చేయించండి. కుటుంబ సౌఖ్యం, ఆరోగ్య అనుకూలత ఉంటాయి. ప్రమోషన్ అవకాశం ఉంది. మే: ఓర్పుగా వ్యవహరించండి. ఇబ్బందులు ఉండవు కాని, తొందరపాటును విడనాడాల్సిన కాలం. చివరివారంలో ఆదాయం ఇబ్బందికరంగా ఉంటుంది. రోజువారీ పనులు సక్రమంగా పూర్తవుతాయి. ఉద్యోగ వ్యాపారాలు 23వ తేదీ నుంచి ఒత్తిడి కల… వృశ్చిక రాశి ఆదాయం–14 వ్యయం–14 రాజయోగం–3 అవమానం–1 విశాఖ 4 వ పాదము (తొ) అనురాధ 1,2,3,4 పాదములు (నా, నీ, నూ, నే) జ్యేష్ఠ 1,2,3,4 పాదములు (నో, యా, యీ,యూ) ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ 13 వరకు కుంభం (చతుర్థం)లోను తదుపరి మీనం (పంచమం)లోను సంచారం చేస్తారు. శని ఏప్రిల్ 28 వరకు మరల జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం (తృతీయం)లోనూ మిగిలినకాలం అంతా కుంభంలోనూ సంచరిస్తారు. ఏప్రిల్ 12 వరకు రాహువు వృషభం (సప్తమం), కేతువు వృశ్చికం (జన్మం)లోను తదుపరి రాహువు మేషం (షష్ఠం), కేతువు తుల (వ్యయం)లో సంచరిస్తారు. 2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (సప్తమం)లో స్తంభన. కుజస్తంభన వల్ల ఆగస్టు నుంచి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇది మినహా మిగిలిన గ్రహాలన్నీ చాలా యోగ్యంగా ఉంటాయి. గురువు సంచారం అనుకూలత దృష్ట్యా ఆర్థిక విషయాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆదాయం కావలసిన రీతిగా అందడం, శుభకార్యాలు, ధర్మకార్యాలకు చక్కగా వెచ్చించడం, సంఘంలో గౌరవ మర్యాదలు పెంచుకోవడం వంటివి జరుగుతాయి. గతంలో చాలాకాలంగా ఉన్న సమస్యలు ఎటువంటివైనా ఈ సంవత్సరం గట్టిగా ప్రయత్నిస్తే అనుకూలం అవుతాయి. భవిష్యత్తులో చేయాలనుకునే పెద్ద ప్రాజెక్ట్‌లకు ఈ సంవత్సరమే శ్రీకారం చుట్టడం శుభదాయకం. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం, పిల్లల అభివృద్ధి బాగా అనుకూలం. ఋణ సంబంధ విషయాలలో మంచి అనుకూల స్థితి ఉంటుంది. కుటుంబ విషయంలో అందరి నుంచి అనుకూల పరిస్థితి ఉంటుంది. కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి కాలం అనుకూలం. వృత్తిరీత్యా స్థాయి గౌరవము పెరుగుతాయి. మీరు ఇతరులకు బాగా సçహాయం చేసే అవకాశం ఉంటుంది. తరచుగా శుభవార్తలు వింటారు. వ్యాపార విషయంగా స్థానమార్పు కోరుకునేవారికి ప్రస్తుతం కాలం బాగా అనుకూలిస్తుంది. వ్యాపారులకు సంవత్సరం అంతా చక్కటి వ్యాపారం జరిగి మంచి ఫలితాలు అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగులకు అన్ని కోణాల్లోనూ సానుకూల స్థితి ఉంటుంది. అందరూ బాగా సహకరిస్తారు. ఆశించిన రీతిలో ఫలితాలు ఉండటంలో ధైర్యంగా ముందుకు వెడతారు. ఆగస్టు తరువాత కొంచెం జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులు ఉండవు. ఆగస్టు నుంచి ఏదో తెలియని మానసిక శారీరక బాధలు ఉన్నాయనే భావనతో చికాకులకు లోనవుతారు. ఈ సంవత్సరం గత సమస్యలకు కూడా పరిష్కారం లభించే అవకాశాలు ఉంటాయి. మెరుగైన వైద్య సలహాలు అందుకుంటారు. తేలికపాటి ప్రయత్నాలతోనే స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో కార్యసిద్ధి. నూతన ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి ఊహాతీతంగా కాలం అనుకూలిస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి విద్యా, ఉద్యోగ విషయాల్లో మంచి ఫలితాలుంటాయి. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు ఈ సంవత్సరం అంతా లాభాలు అందుతాయి. విద్యార్థులకు శ్రమ చేసిన కొద్దీ మంచి ఫలితాలు అందుతాయి. మంచి గౌరవం వచ్చేలాగా విద్యా వ్యాసంగం సాగుతుంది. రైతులకు అన్ని కోణాల్లోనూ సహాయ సహకారాలు అందుతాయి. తద్వారా మంచి వ్యవసాయ ఫలితాలు ఉంటాయి. గర్భిణిలు సంవత్సరం అంతా ఆనందంగా ఉంటారు. ఆగస్టు 10 తరువాత చిన్న చిన్న చికాకులు ఉంటాయి. విశాఖ నక్షత్రం వారికి విద్యా వ్యాసంగంలో మంచి ఫలితాలు వుంటాయి. భార్యా భర్తల నడుమ మనస్పర్థలు తొలగి అన్యోన్యత ఏర్పడుతుంది. అయితే ఆగస్టు నుంచి కుటుంబ వ్యవహారాల్లో ఇతరుల ప్రమేయానికి అవకాశం ఇవ్వవద్దు. ఆరోగ్య, ఋణ విషయాల్లో ఆగస్టు నుంచి జాగ్రత్తలు అవసరం. అనురాధ నక్షత్రం వారికి ఈ ఏడాది ప్రశాంతత కలుగుతుంది. ఎప్పటినుంచో ఉన్న చికాకులకు ఈ సంవత్సరం పరిష్కారాలు లభిస్తాయి. ఆగస్టు లోపు ప్రయత్నిస్తే మొండి బాకీలు వసూలవుతాయి. ఆగస్టు తర్వాత ఏ విధమైన వ్యవహారాలూ వుండకుండా చూసుకోండి. జ్యేష్ఠ నక్షత్రం వారికి శుభ పరిణామాలు ఎక్కువ ఉంటాయి. అయితే అనారోగ్యవంతులయిన ఈ నక్షత్రం వారు ఆగస్టు నుంచి తరచుగా ఇబ్బందులు పడే అవకాశముంది. అందువల్ల ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి. దూరప్రాంత ప్రయాణాలు విరమించండి. మీ విషయాలు గోప్యంగా వుంచకుండా కుటుంబ సభ్యులతో పంచుకోండి. శాంతి: ప్రత్యేకంగా ఆగస్టు 10 తరువాత కుజుడికి శాంతి చేయించండి. సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం, ఆరు ముఖాల రుద్రాక్షధారణ చేయడం శ్రేయస్కరం. ఏప్రిల్: మీరు స్వయంగా ప్రయత్నిస్తే, చాలాకాలంగా ఉన్న సమస్యలకు ఈ నెలలో పరిష్కారాలు దొరుకుతాయి. ఆదాయ వ్యయాలు సమతూకంగా ఉంటాయి. ఋణ ప్రయత్నాలు సానుకూలం. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినా, ఫలితాలు మాత్రం అనుకూలం. రోజువారీ పనులు, వృత్తి వ్యవహారాలు ఇబ్బంది లేకుండా సాగుతాయి. మే: ఉల్లాసంగా కాలక్షేపం చేస్తారు. ప్రయత్నాలన్నీ సానుకూలం అవుతాయి. ఇతరుల సహాయ సహకారాలు లేకున్నా, విజయం సాధిస్తారు. కుటుంబసభ్యుల అవసరాలు తీర్చడంలో కృతకృత్యులవుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక, ఉద్యోగ విషయాల్లో మంచి పరిస్థితి ఉంటుంది. జూన్: కుటుంబ వ్యవహారాల్లో చిన్న చిన్న చికాకులు ఉంటాయి. పెద్దల ఆరోగ్య విషయంలోకాని, పిల్లల అభివృద్ధిలోకాని అనుకూలత తక్కువ. ఇతరులను నమ్మి ఏ పనీ చేయవద్దు. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దూరప్రయాణాలు చేయవద్దని సూచన. జూలై: కొన్ని అంశాలు అనుకూలం, కొన్ని ప్రతికూలంగా ఉంటాయి. చాలా వరకు మంచి ఫలితాలే ఉంటాయి. మీ సంబంధీకుల ఇళ్లలో నిశ్చయమైన శుభకార్యాలు మీకు ఆనందం కలిగిస్తాయి. అంతటా విజయం సాధిస్తారు. ముఖ్యంగా ఆర్థిక వెసులుబాటు, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం విశేషం. ఆగస్టు: కుజుడు వృషభ మిథున రాశులలో సంచారం చేస్తూ అనుకూలించని స్థితి. రానున్న కాలంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. తరచుగా కుజ గ్రహ శాంతి చేయించండి. రాబోయే కాలంలో మీ జాతకానికి, ఈ కుజ సంచారానికి అనుబంధంగా ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి జాతక శోధన చేయించుకోండి. సెప్టెంబర్: కుజుడు మినహా మిగిలిన గ్రహాల అనుకూలత దృష్ట్యా ఇది చాలా మంచి కాలం అనే చెప్పాలి. తెలివిగా ప్రవర్తిస్తారు. మానసిక స్థితి ప్రశాంతంగా ఉంటుంది. అభివృద్ధి వైపు ప్రయాణం సాగుతుంది. గత సమస్యల పరిష్కారానికి వెదుకులాట ఈ నెల ఫలిస్తుంది. పెంపుడు జంతువులతో ఇబ్బంది ఎదురవుతుంది. అక్టోబర్: వ్యక్తిగత విషయాలు గోప్యంగా ఉంచుకోవాలి. అలాగే వ్యవహార ప్రతిబంధకాలు రాకుండా 15వ తేదీ నుంచి జాగ్రత్తపడాలి. మిగిలినకాలం మిగిలిన అన్ని అంశాలూ సానుకూలంగానే ఉంటాయి. ఇతరుల వ్యవహారాలపై దృష్టి పెట్టకండి. నెలాఖరులో ఆరోగ్యపరంగా చికాకులు ఉంటాయి. నవంబర్: శని గురు రాహువుల అనుకూల సంచారం, మిగిలిన గ్రహాల ప్రతికూల సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలలో తోటివారి సహకారం, సిబ్బంది సహకారం తగ్గుతుంది. శుభకార్యాలు, పుణ్యకార్యాల నిమిత్తం తరచు ప్రయాణాలు చేస్తుంటారు. డిసెంబర్: చాలా విచిత్రమైన కాలం. ఎప్పుడు యోగ్యంగా ఉంటుందో, ఎప్పుడు చికాకుగా ఉంటుందో చెప్పలేని కాలం. అయితే శుక్ర సంచారం అనుకూలత వల్ల చాలా వరకు కుటుంబ వ్యవహారాల్లో అనుకూల స్థితిని పొందుతారు. బంధుమిత్రుల సహకారం బాగుంటుంది. అధికారుల ఒత్తిడి తప్పదు. ప్రతి విషయంలోనూ అధిక దనవ్యయం జరుగుతుంది. జనవరి: శుభాశుభ పరిణామములు ఎక్కువ అనే చెప్పాలి. ఈ నెల 22 వరకు కొత్త ప్రయోగాలు చేయవద్దు. ధైర్యం విడనాడకుండా ముందుకు వెడతారు. దానధర్మాలు చేయాలనే కోరిక పెరుగుతుంది. శ్రమ ఎక్కువ అవుతుంది. కానీ చివరకు లాభం ఉంటుంది. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది. ఫిబ్రవరి: రోజూ ఏదో ఒక కొత్త వ్యవహారం మీద ఆలోచనలు చేస్తారు. అన్ని అంశాల్లోనూ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయం ఎక్కువగానే ఉంటుంది. ఖర్చులు అదే రీతిగా ఉంటాయి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. ఆరోగ్య భద్రత కోసం ముందు జాగ్రత్తలు పాటిస్తారు. అధికారులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. మార్చి: సహజంగా అష్టమ కుజుడు ఇబ్బందులు కలిగించే గ్రహం. అయితే మిగిలిన గ్రహాల అనుకూలతల వల్ల ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగ భద్రత బాగుంటుంది. వ్యాపారులు మంచి వ్యాపారం చేయగలుగుతారు. సిబ్బంది బాగా సహకరిస్తారు. మీ జాతకానికి ఈ గోచారానికి మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి, గోచారానికి పోలిక చేసి ఫలితములు తెలుసుకోండి. ధనూ రాశి ఆదాయం–2 వ్యయం–8 రాజయోగం–6 అవమానం–1 మూల 1,2,3,4 పాదములు (యే, యో, బా, బీ) పూర్వాషాఢ 1,2,3,4 పాదములు (బూ, ధా, భా, ఢా) ఉత్తరాషాఢ 1వ పాదము (బే) ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ 13 వరకు కుంభం (తృతీయం)లోను తదుపరి మీనం (చతుర్థం)లోను సంచారం చేస్తారు. శని ఏప్రిల్ 28 వరకు మరల జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం (ద్వితీయం)లోను మిగిలిన కాలం అంతా కుంభంలోను సంచరిస్తారు. ఏప్రిల్ 12 వరకు రాహువు వృషభం (షష్ఠం) కేతువు వృశ్చికం (వ్యయం)లోను తదుపరి రాహువు మేషం (పంచమం) కేతువు తుల (లాభం)లో సంచరిస్తారు. 2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (షష్ఠం)లో స్తంభన. మొత్తం మీద ఈ గోచారం సంవత్సరం అంతా చాలావరకు గ్రహానుగ్రహం బాగుందనే చెప్పాలి. మంచి పనులు చేసే అవకాశం చాలాసార్లు వస్తుంది. మీరు సద్వినియోగం చేసుకుంటారు. సంవత్సరంలో ఎక్కువకాలం కుజుడు అనుకూలిస్తున్న కారణంగా మనోబలంతో విజయాలను అందుకుంటారు. శ్రమ ఎక్కువ అయినా, ప్రతి ప్రయత్నంలోనూ లాభాలు ఎక్కువగా వస్తాయి. ఏలినాటి శని ప్రభావం పెద్దగా ఉండదు. మీరు చేసే శుభకార్య ప్రయత్నాలు నిరాటంకంగా సాగుతాయి. తరచుగా శరీరం సొంపును గాంభీర్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు సానుకూలమే. ఋణ సంబంధమైన అంశాలలో మీరు నిబద్ధతతో సంచరిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. కుటుంబసభ్యుల సహకారం బాగుంటుంది. పిల్లల అభివృద్ధి విషయంలో మంచి వార్తలు వింటారు. తరచు విందు వినోదాలు, శుభ, పుణ్యకార్యాల్లో కాలక్షేపం చేశారు. స్వేచ్ఛగా సంచరిస్తారు. కొన్నిసార్లు రోజువారీ పనులు కూడా ఆలస్యమవుతాయి. గురువులను దర్శించుకుంటారు. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం బాగుంటుంది. కొత్త ప్రయోగాలు చేయడానికి వచ్చే మంచి అవకాశాలలను వ్యాపారులు సద్వినియోగం చేసుకుంటారు. వ్యాపారులకు క్రమంగా సమస్యలు తగ్గుతాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో లాభపడతారు. ఉద్యోగులకు రోజురోజుకు శుభపరిణామాలు ఉంటాయి. గత సమస్యలు తీరతాయి. చక్కగా విధి నిర్వహణ చేస్తారు. ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు ఉంటాయి. గతంలో ఉన్న మొండి సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది. అనారోగ్యవంతులైన ఈ రాశివారు ముందు జాగ్రత్తలు పాటించి సమస్యలు పెరగకుండా సుఖజీవనం చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు పనులు వేగవంతమవుతాయి. కావలసిన వనరులు చేకూరుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు వేగంగా పూర్తవుతాయి. శ్రమ తక్కువ ఫలితం పూర్తి సానుకూలం. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి అన్ని కోణాల్లో మంచి సహకారం అంది కార్యజయం కలుగుతుంది. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు బహు సుఖవంతమైన కాలము. ఒత్తిడి లేకుండా వ్యాపారం చేస్తారు. విద్యార్థులకు అంతటా విజయమే. పోటీ పరీక్షలలో కూడా శుభపరిణామాలు ఉంటాయి. రైతులకు విజయపరంపరగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. గర్భిణిలు మంచిఫలితాలను అందుకుంటారు. మూల నక్షత్రం వారికి ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు విశేషంగా లాభిస్తాయి. అయితే పుత్రవైరం పెరిగే అవకాశం వుంటుంది. తరుచుగా మీ కులాచార ఉత్సవాలు నిమిత్తంగా బంధుమిత్రులను కలుసుకుంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యవసాయం బాగా లభిస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి భార్యాభర్తల మధ్య తరచుగా విభేదాలు పెరుగుతాయి. అవసరానికి డబ్బు సర్దుబాటు కాని పరిస్థితి ఎదురవుతుంది. ప్రతి విషయంలో ధైర్యాన్ని ప్రదర్శిస్తుంటారు. విందు వినోదాలు పుణ్యక్షేత్ర సందర్శనల నిమిత్తంగా ప్రయాణాలు, ధనవ్యయం తప్పవు. ఉత్తరాషాఢ నక్షత్ర ఉద్యోగులకు ఉన్నతస్థితి వుంటుంది. అధికారులు ప్రతి విషయంలోనూ ప్రోత్సహిస్తారు. తరచు చురుకుగా తెలివితేటలు ప్రదర్శిస్తారు. చేసే ప్రయత్నాలన్నీ అనుకున్న దానికంటే ముందుగానే పూర్తవుతాయి. చాలా మంచి కాలం. శాంతి: అంతా సుఖవంతమే అయినా పంచముఖ రుద్రాక్ష ధరించడం ద్వారా పనులు మరింత వేగవంతమవుతాయి. రోజూ విçష్ణుసహస్రనామ పారాయణ చేయండి. ఏప్రిల్: ఏలినాటి శని పూర్తవుతుంది. ఈ నెలలో కొన్ని పనులు వేగంగా పూర్తయి ఆనందంగా ఉంటారు. కొత్త వ్యవహారాలపై దృష్టి వుంచవద్దు. ఆరోగ్యం అనుకూలం. రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి. ప్రతి పనీ స్వబుద్ధితో సానుకూలం చేసుకుంటారు. పెద్దల ఆరోగ్యం సానుకూలంగా ఉంటుంది. మే: కొత్త ప్రయోగాలు చేయవద్దని సూచన. ఆరోగ్యం బాగుంటుంది. పాత ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. ఋణ సమస్యలు తీరతాయి. కుటుంబ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. శుభకార్య పుణ్యకార్యాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. జూన్: సమస్యాకాలంలో కూడా తెలివిగా ప్రవర్తించి, లాభదాయక ఫలితాలు పొందుతారు. ఈ నెల అంతా ప్రతి పనిలోనూ ఖర్చులు ఎక్కువవుతాయి. రోజు రోజుకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సిబ్బంది సమస్య బాగా పెరుగుతుంది. ప్రత్యేకంగా పూర్వాషాఢ నక్షత్రం వారు అధిక జాగ్రత్తలు పాటించాలని సూచన. జూలై: మంచికాలం. తెలివి, ఓర్పు ప్రదర్శిస్తారు. అందరితోనూ స్నేహంగా ఉండవలసిన కాలం. మీ కార్యకలాపాలను చాలా గోప్యంగా ఉంచాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అధికంగా ఉంచాలి. కుటుంబ వ్యవహారాలు 15వ తేదీ నుంచి సానుకూలం అవుతాయి. అకాలంలో భోజనం చేయవలసి రావడం ఎక్కువసార్లు జరుగుతుంది.. ఆగస్టు: చాలా అద్భుతమైన కాలం. ప్రతి పనిలోనూ శ్రమ తక్కువగా ఉండి కార్యజయం పొందే అవకాశాలు ఎక్కువ. ప్రధానంగా కుటుంబ వాతావరణం బహు అనుకూలం. ఉద్యోగ వ్యాపార విషయాల్లోనూ అనుకూల స్థితి ఉంటుంది. సత్కాలక్షేపాలు జరుగుతాయి. సెప్టెంబర్: కార్య సానుకూలతకు ఎక్కువగా కృషి చేస్తారు. గ్రహానుకూలత క్రమంగా పెరుగుతుంది. ప్రయత్నం చేసే పనులన్నీ సానుకూలం అవుతుండటంతో ఆనందంగా ఉంటారు. భక్తి కార్యక్రమాలు, పుణ్యక్షేత్ర సందర్శనలతో కాలక్షేపం చేస్తారు. బంధుమిత్రులను తరచుగా కలుస్తూ ఉంటారు. అక్టోబర్: మీ పనులను స్వయంగా చేసుకోండి. కుజుడు మినహా మిగిలిన గ్రçహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. 15 వరకు కుజుడు కూడా అనుకూల సంచారం చేస్తున్నారు. అన్ని వ్యవహారాలూ సానుకూలంగా ఉంటాయి. తొందరపాటు మాటతీరు ప్రదర్శించవద్దు. నవంబర్: మాసారంభంలో గ్రహానుగ్రహం బాగుంది. కొన్ని కొన్ని పనులను త్వరగా ఆరంభంలోనే పూర్తి చేసుకోవడం శ్రేయస్కరం. ఇతరుల నుంచి సలహాలు సహకారం 15వ తేదీ నుంచి తీసుకోవద్దు. విద్యా వినోద పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. సాంఘిక కార్యక్రమాల కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు. డిసెంబర్: స్వబుద్ధితో కార్యసాధన చేస్తారు. అన్ని విషయాల్లోనూ ధైర్యంగా ఉంటారు. గౌరవ మర్యాదలు బాగా అందుకుంటారు. ప్రత్యేక జాగ్రత్తలు పాటించడం ద్వారా కాలం అనుకూలమనే చెప్పాలి. ఉద్యోగంలో చిన్న చిన్న చికాకులు వస్తున్నా, వాటిని బాగానే పరిష్కరించుకుంటారు. జనవరి: చక్కగా వ్యవహరించి తలపెట్టిన ప్రతిపనినీ విజయపథంవైపు నడపగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలం, ఉద్యోగులకు ప్రమోషన్ ప్రయత్నాలు సానుకూలం. బంధుమిత్రుల రాకపోకలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. ఫిబ్రవరి: కొత్త ప్రయోగాలు 15వ తేదీ వరకు చేయవద్దు. నెలంతా అనుకూలం. 15 వరకు ఒకస్థాయి, 15వ తేదీ తరువాత విశేషస్థాయి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ విషయంలో మన్ననలు అందుకుంటారు. వ్యాపారులు తెలివిగా లాభాలు అందుకుంటారు. అన్ని అవసరాలూ తీరే కాలం. మార్చి: కుజగ్రహం జపం చేయించుకోండి. కుజుడు మినహా అన్ని గ్రహాలూ అనుకూలంగా ఉన్నందున ఈ నెలంతా మీకు మంచికాలమే. ఆరోగ్య జాగ్రత్తలు పాటించండి. రోజువారీ పనులు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. మీ జాతకానికి ఈ గోచారాన్ని మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి, గోచారానికి పోలిక చేసి ఫలితములు తెలుసుకోండి. మకర రాశి ఆదాయం–5 వ్యయం–2 రాజయోగం–2 అవమానం–4 ఉత్తరాషాఢ 2,3,4 పాదములు (బొ, జా, జీ) శ్రవణం 1,2,3,4 పాదములు (జే, జో, ఖా, ఖొ) ధనిష్ఠ 1,2 పాదములు (గా, గి) ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ 13 వరకు కుంభం (ద్వితీయం)లోను తదుపరి మీనం (తృతీయం)లోను సంచారం చేస్తారు. శని ఏప్రిల్ 28 వరకు మరలా జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం(జన్మం)లోను మిగిలినకాలం అంతా కుంభంలోను సంచరిస్తారు. ఏప్రిల్ 12 వరకు రాహువు వృషభం (పంచమం) కేతువు వృశ్చికం (లాభం)లోను తదుపరి రాహువు మేషం (చతుర్థం) కేతువు తుల (దశమం)లో సంచరిస్తారు. 2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (పంచమం)లో స్తంభన. మొత్తం మీద ఈ సంవత్సరం అంతా ఏలినాటి శని, అర్ధాష్టమ రాహువు, తృతీయ గురువులలో ఎవరూ అనుకూలించే గ్రహాలు కాదు. కానీ ఇతర గ్రహాలు ప్రతినెలలోను ఏదో ఒక గ్రహం ఎక్కువ కాలం పాటు సంతృప్తికర ఫలితాలు అందిస్తున్న కారణంగా విజయపథంలోనే ముందుకు వెడతారు. గత సంవత్సరం కంటే ఎక్కువ రోజులు ఎక్కువ శాతం మంచి ఫలితాలు అందుకుంటారు. దీర్ఘకాలికమైన పనులను ఈ సంవత్సరం పెట్టుకోవద్దు. భాగస్వామ్య వ్యాపారాల్లో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదాయం తగుమాత్రంగా ఉన్నా, అవసర సమయాల్లో డబ్బు తగిన రీతిగా సర్దుబాటు కాకపోవడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. పాత ఋణాలు తీర్చే విషయంలో అనుకూలత తక్కువగా వున్నందున ఆర్థిక ఒడంబడికలకు దూరంగా ఉండండి. మితభాషణ శ్రేయస్కరం. కుటుంబసభ్యుల ద్వారా కొన్ని విషయాలలో అనుకూల వాతావరణం. కొన్ని ఆర్థిక వ్యాపార శుభ వ్యవహారాల్లో మంచి ఫలితాలు దక్కుతాయి. పిల్లల అభివృద్ధి వార్తలు, పెద్దల ఆరోగ్యం నిలకడగా ఉందనే వార్తలు తరచుగా వింటారు. స్థానచలనం, ప్రమోషన్ వంటి అంశాలు ఈ సంవత్సరం మీ తెలివి తక్కువతనంతో ఇబ్బందికరం కాగలవు. మందకొడి ఆలోచనలు, ప్రవర్తనలతో వ్యాపార నిర్ణయాలు సరిగా చేయలేరు. అందువల్ల వ్యాపారులకు సంవత్సరం అంతా సామాన్య ఫలితాలు మాత్రమే ఉంటాయి. కార్మికులతో సమస్యలు తప్పవు. ఉద్యోగులు నమ్మకూడని వ్యక్తులను ఆశ్రయించి, వారి సలహాలను అమలు చేసి, మీ అభివృద్ధికి మీరే అవరోధాలు సృష్టించుకుంటారు. అనవసర సమస్యలను కొని తెచ్చుకుంటారు. నిర్లక్ష్యం వల్ల ఆరోగ్య ఇబ్బందులను ఎదుర్కొంటారు. సుగర్, బీపీ ఉన్నవారు మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిరాస్తి కొనుగోలు పనులు వేగంగా సాగవు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసేవారు దూకుడు ఆలోచనలు ప్రమాదకరం అని గమనించాలి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి విద్యాపరంగా కార్యానుకూలత ఉంది. ఉద్యోగరీత్యా అనుకూలత లేదు. షేర్ వ్యాపారులకు ఫైనాన్స్ వ్యాపారులకు తరచుగా కొత్త కొత్త సమస్యలు వస్తుంటాయి. కంగారు పడనవసరం లేదు. విద్యార్థులకు విద్యా వ్యాసంగం సామాన్యంగా ఉంటుంది. కొత్త ప్రయోగాలు చేసే ఆసక్తి తగ్గుతుంది. రైతులకు శ్రమ ఎక్కువ అయినా, ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. మంచి ఫలితాలు ఆలస్యంగా అందుతాయి. గర్భిణిలు ఎటువంటి ఒత్తిడికి లోనవకుండా ఉంటారు. కాలం అనుకూలమే అని చెప్పాలి. ఉత్తరాషాఢ నక్షత్రం వారు తరచుగా పూజలు, వ్రతాలు, నోములు వంటి పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. ధైర్యంగా తెలివిగా ఎంతటి కార్యాన్నయినా విజయవంతం చేసుకునే అవకాశం వుంటుంది. మౌనంగా వుంటూనే ప్రతి పనినీ సాధించుకోవడంలో కృతకృత్యులవుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శ్రవణ నక్షత్రం వారికి మానసిక అలజడి ఎక్కువగా వుంటుంది. సాంఘిక కార్యక్రమాలకు వీలయినంత దూరంగా వుండడం శ్రేయస్కరం. ఇతరులకు సహకరించాలనే మీ మంచితనం ఈ సంవత్సరం మీ పాలిట శాపంగా మారే అవకాశం వున్నది. ప్రయాణాలు ఒంటరిగా చేయవద్దు. ధనిష్ఠా నక్షత్రం వారికి కాలం చాలావరకు అనుకూలమనే చెప్పాలి. ప్రతిపనీ అతి శ్రమతో పూర్తవుతుంది. గతకాలం కంటే చాలావరకు సానుకూలం అనే చెప్పాలి. ఆగస్టు తరువాత తల్లి తరఫులేదా భార్యాతరఫు బంధువుల వల్ల మంచి సహకారం లభించి కొన్ని సమస్యలను పరిష్కరించుకునే అవకాశం వుంటుంది. శాంతి: అవకాశం ఉన్నప్పుడు శని రాహు శాంతి చేయించండి. రోజూ శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దుర్గా సప్తశ్లోకి 11 సార్లు పారాయణం చేయడం, ‘గౌరీశంకర’ రుద్రాక్ష ధరించడం శ్రేయస్కరం. ఏప్రిల్: ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఆర్థిక సౌకర్యం చాలా తక్కువ. ప్రయాణాల్లో చికాకులు ఉంటాయి. ఇతరులను నమ్మి పనులు ప్రారంభించవద్దు. ఋణ విషయాల్లో అనుకూలత తక్కువ. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతి పనీ స్వయంగా చేసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం తక్కువ. మే: చాలా అంశాలలో అనుకూల స్థితి ఉంటుంది. క్రమంగా ఒక్కో పని వేగం పుంజుకుంటుంది. అందరూ సహకరిస్తారు. 15వ తేదీ తరువాత తరచుగా ఉష్ణప్రకోపం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా పెద్దస్థాయి ఇబ్బందులు ఉండవు. స్నేహపూర్వక వాతావరణంలో చాలా వ్యవహారాలను సానుకూలం చేసుకుంటారు. … కుంభ రాశి ఆదాయం–5 వ్యయం–2 రాజయోగం–5 అవమానం–4 ధనిష్ఠ 3,4 పాదములు (గుూ, గే) శతభిషం 1,2,3,4 పాదములు (గొ, సా, సీ, సు) పూర్వాభాద్ర 1,2,3 పాదములు (సే, సొ, దా) ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ 13 వరకు కుంభం (జన్మం)లోను తదుపరి మీనం (ద్వితీయం)లోను సంచారం చేస్తారు. శని ఏప్రిల్ 28 వరకు మరలా జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం (వ్యయం)లోను మిగిలిన కాలం అంతా కుంభంలో సంచరిస్తారు. ఏప్రిల్ 12 వరకు రాహువు వృషభం (చతుర్థం) కేతువు వృశ్చికం (దశమం)లోను తదుపరి రాహువు మేషం (తృతీయం) కేతువు తుల (నవమం)లో సంచరిస్తారు. 2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (చతుర్థం)లో స్తంభన. మొత్తం మీద ఈ సంవత్సరం అంతా చిత్ర విచిత్రమైన జీవనశైలితో కాలం నడుస్తుంది. గురువు అనుకూలంగా ఉన్న కారణంగా ధన కుటుంబ ఆరోగ్య విషయాల్లో వచ్చే సమస్యలకు వెంటనే పరిష్కార మార్గాలు దొరుకుతాయి. ఆగస్టు నుంచి కుజస్తంభన దృష్ట్యా ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది. అలాగే తరచుగా అయిష్టమైన కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనవలసి రావడం, బంధువులతో కలహాలు ఉంటాయి. శని సంచారం అనుకూలంగా ఉన్నట్లే చెప్పాలి. మకర కుంభ సంచారాలలో ఈ రాశివారికి శని చెడు పెద్దస్థాయిలో ఉండదు. అయితే పనులు మందకొడిగా సాగడం, ముఖవర్చస్సు తగ్గడం, చెప్పుకోలేని బాధలు ఉన్న భావన కలుగుతాయి. భోజన వసతికి ఇబ్బంది రాగలదు. కుటుంబసభ్యులు బాగా సహకారంగా ఉన్నా, ఏదో తెలియని అవగాహన లోపంతో ముందుకు సాగుతారు. గతం కంటే ఈ సంవత్సరం బాగానే ఉన్నా, అసంతృప్తితో కాలక్షేపం చేస్తారు. ఆర్థిక వనరులు బాగా సమకూరుతాయి. అదే రీతిగా ధనవ్యయం ఎక్కువగా ఉంటుంది. కావలసిన సమయానికి ఋణాలు అందుతాయి. పాత ఋణాలు తీర్చుకోవడానికి మార్గం సుగమమవుతుంది. తరచుగా గురువులను పూజ్యులకు సందర్శించుకుంటారు. ఏలినాటి శని ప్రభావం చేత కార్మికుల సమస్య ఇబ్బందికరంగా ఉండి వ్యాపారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేరు. వ్యాపారులకు సంవత్సరం అంతా శ్రమ, చికాకు తప్పదు. సీజన్లకు తగిన రీతిగా స్పందించి వ్యాపారం చేయలేరు. ఉద్యోగులకు విచిత్రమైన సమస్యలు ఎదురవుతాయి. అధికారుల సహకారం లేకపోవడం, తోటివారి నుంచి సమస్యలు రావడం జరుగుుతుంది. సుఖంగా పనులు సాగవు. ఆరోగ్యపరంగా బాగా జాగ్రత్తలు పాటించాలి. పెద్దగా యిబ్బందులు ఉండవు కానీ తరచుగా సమస్యలు ఎదురుకాగలవు. నరాలు, రక్త సంబంధ అనారోగ్యం ఉన్నవారు ఎక్కువ ఇబ్బందికి గుురవుతారు. ఆరోగ్యరీత్యా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో అవరోధాలు ఎదురైనా, శ్రమతో పనులు పూర్తవుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి పనులు ఇబ్బందికరమే అయినా ఫలితం సానుకూలం. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు చేసేవారికి ఖర్చు అధికంగా ఉన్నా, కార్యసాఫల్యం జరుగుతుంది. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. విద్యార్థులకు విద్యావ్యాసంగం బాగా సాగుతుంది. ఊహాతీతంగా చాలా మంచి ఫలితాలను అందుకుంటారు. రైతులకు శ్రమ ఎక్కువగా ఉన్నా, చివరకు మంచి ఫలితాలు అందుతాయి. గర్భిణీ స్త్రీలు అనవసర విషయాలపై ఆలోచనలు విరమించుకోడం శ్రేయస్కరం. ధనిష్ఠ నక్షత్రం వారికి కుటుంబసభ్యుల సహకారం ఈ సంవత్సరం శ్రీరామరక్ష అనే చెప్పాలి. ఉద్యోగంలో మీరు కార్యనిర్వహణ చాలా వికృతంగా చేయడం. సమయపాలన లేకుండా ప్రవర్తించడం వంటివి చేస్తారు. అయితే ఏదో తెలియని అద్భుతశక్తి మిమ్మల్ని రక్షిస్తుంది. శతభిష నక్షత్రం వారికి విచిత్రమైన స్థితి వుంటుంది. తరచుగా అన్ని పనులూ మందగించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అంతా లాభదాయకం అనుకునే సందర్భంలో పనులు వెనక్కు మళ్లే అవకాశం వుంటుంది. పనులు విజయవంతంగా పూర్తి చేసుకోవాలనుకుంటే, మీరు స్వయంగా శ్రమించాలి. పూర్వాభాద్ర నక్షత్రం వారికి విశేషమైన కాలమనే చెప్పాలి. పూర్తిగా స్వేచ్ఛగా జీవిస్తారు. భారంగా వుండే పనులు చేయకుండా సరళంగా వుండే పనులు మాత్రమే చేసుకుంటూ కాలక్షేపం చేస్తారు. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తరచుగా శుభకార్యాల్లో పాల్గొంటారు. శాంతి: శని రాహు కుజులకు జపం, దానం చేయించడం మంచిది. ప్రతిరోజూ ఆంజనేయస్వామికి ‘శ్రీరామశ్శరణం మమ’ అని చెబుతూ 11 ప్రదక్షిణలు చేయడం మంచిది. ఆరు ముఖముల రుద్రాక్షధారణ శ్రేయస్కరం. ఏప్రిల్: శనిగ్రహ శాంతి చేయించండి. వరుసగా మూడు మాసములు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని వ్యవహారాలూ మందకొడిగా నడుస్తాయి. అయితే ఆర్థికంగా ఇబ్బంది ఉండదు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న చికాకులు తప్పక ఉంటాయి. ప్రయాణాలు విరమించండి. మే: శని కుజుల కుంభరాశి సంచారం చాలా ఇబ్బందికరం. మూడవ వారంలో బాగా చికాకులు రాగలవు. ఆర్థిక వెసులుబాటు చికాకులు కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాలను సరిచేయగలుగుతారు. ఋణ విషయాల్లో ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం బహు జాగ్రత్తగా చూసుకోవాలి. దూర ప్రయాణాలు చేయవద్దు. జూన్: చెప్పుకోదగిన ఇబ్బందులు ఉండవు. ప్రత్యేక లాభములు ఉండవు. ప్రతి పనీ స్వయంగా చేసుకొని లబ్ధి పొందుతారు. ఆర్థిక వెసులుబాటు, ఋణ సౌకర్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం అద్భుతంగా ఉంటుంది. అన్ని విషయాల్లోనూ చక్కగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. జూలై: శ్రద్ధతో ప్రవర్తించి కార్యజయం సాధిస్తారు. అంతటా విజయావకాశాలు ఉన్నాయి. కాలం వృథా చేయకుండా గత సమస్యల పరిష్కారం, భవిష్య ప్రణాళికలు, దీర్ఘకాలిక కార్యక్రమాల మీద దృష్టి సారించాలి. కుటుంబపరంగా కాలం అనుకూలం. ఆర్థిక, ఋణ విషయాలు బాగుంటాయి. ఆగస్టు: ఏలినాటి శని అర్ధాష్టమ కుజుడు షష్ఠ శుక్రుడు ప్రభావంగా మీరు ఈ నెలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో అసౌకర్యం. అవగాహన లోపాలు ఎక్కువవుతాయి. ఉద్యోగ అంశాలు స్వయంగా చూసుకోండి. వ్యాపార విషయంలో మీకు తోటివారు, సిబ్బంది చికాకులు సృష్టిస్తారు. సెప్టెంబర్: పూర్తి అనుకూల వాతావరణం ఉండదు అలాగని నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. అనవసర విషయాలలో భయాందోళనలు ఎక్కువవుతాయి. జీర్ణ సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాల్లో వస్తువులు చోరీకి గురవుతాయి. విధి నిర్వహణలో జాగ్రత్తపడండి. అక్టోబర్: సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం అవుతుంది. 15వ తేదీ వరకు అన్ని పనులూ ఒత్తిడిగా ఉంటాయి. ప్రత్యేకంగా కొత్త వ్యవహారాల జోలికి వెళ్ళవద్దు. రోజువారీ పనులతో కాలక్షేపం శ్రేయస్కరం. కోర్టు వ్యవహారాలు, ఋణ వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం. పెద్దల ఆరోగ్య విషయం జాగ్రత్త. నవంబర్: చాలా విచిత్రమైన కాలం. క్రమంగా కార్యసానుకూలత పెరుగుతుంది. ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం పెద్దగా ఉండదనే చెప్పాలి. మాసారంభంలో శుక్రుడు, ద్వితీయార్ధంలో రవి అనుకూలిస్తారు. పనులు వాయిదా వేసే ఆలోచనలను విరమిస్తే విజయం మీతో ప్రయాణం చేస్తుంది. అన్ని విషయాల్లోనూ సహనంతో వ్యవహరిస్తారు. డిసెంబర్: ఒక కోణంలో మీరు ఈనెలలో అదృష్టవంతులనే చెప్పాలి. శ్రమతో కూడుకున్న పనులను ముందుగానే గుర్తించి, వాటి జోలికి వెళ్ళకుండా ప్రశాంతంగా చేయగలిగిన పనులు మాత్రమే చేసుకుంటూ ముందుకు వెడతారు. అందరి సహకారం బాగుంటుంది. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది. అన్ని విషయాల్లోనూ ప్రత్యేక శ్రద్ధ ప్రదర్శిస్తారు. జనవరి: గురుబలం ఈ నెల విశేషం. ప్రయాణ విçఘ్నాలు ఉంటాయి. తరచుగా వస్తువులు పనులు మరచిపోయే అవకాశం ఉంది. 15వ తేదీ వరకు రవి అనుకూలత దృష్ట్యా వృత్తిలో సమస్యలను దాటవేయగలుగుతారు. మూడవవారం అన్నింటా చికాకులు ఉంటాయి. చివరి వారంలో శుక్ర సంచారం అనుకూలత వల్ల సమస్యలను దాటగలరు. ఫిబ్రవరి: రవి కుజ శని సంచారం బాగులేదు. ప్రధానంగా ఆదాయం ఒత్తిడిగా అందుతుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. తరచుగా దుర్వార్తలు వినవలసి వస్తుంది. బంధువుల అనారోగ్య వార్తలు మానసిక ఇబ్బందులకు గురి చేస్తాయి. పనులు బాగా ఆలస్యం అవుతాయి. మార్చి: ప్రతి పనిలో ఆలస్యం ఎదురైనా, సానుకూలంగా పూర్తవుతాయి. కొత్త ప్రయోగాలు చేయవద్దని సూచన. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. అయితే ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు సానుకూలం. ఖర్చులు నియంత్రించడం ద్వారా ఈ నెల అంతా సుఖంగా జీవనం సాగుతుంది. మీ జాతకానికి ఈ గోచారాన్ని మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి గోచారానికి పోలిక చేసి ఫలితాలు తెలుసుకోండి. ∙∙ మీన రాశి ఆదాయం–2 వ్యయం–8 రాజయోగం–1 అవమానం–7 పూర్వాభాద్ర 4 వ పాదము (ది) ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు (దు, శ్య, ఝా, థా) రేవతి 1,2,3,4 పాదములు (దే, దొ, చా, చి) ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ 13 వరకు కుంభం (వ్యయం)లోను తదుపరి మీనం (జన్మం)లోను సంచారం చేస్తారు. శని ఏప్రిల్ 28 వరకు మరల జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం (లాభం)లోను మిగిలినకాలం అంతా కుంభంలోనూ సంచరిస్తారు. ఏప్రిల్ 12 వరకు రాహువు వృషభం (తృతీయం) కేతువు వృశ్చికం (భాగ్యం)లోను తదుపరి రాహువు మేషం (ద్వితీయం) కేతువు తుల (అష్టమం)లో సంచరిస్తారు. 2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (తృతీయం)లో స్తంభన. మొత్తం మీద ఈ సంవత్సరం అంతా అధికకాలం శని సంచారం అనుకూలత దృష్ట్యా మంచి ఫలితాలు ఉంటాయి. అలంకరణ వస్తువులు కొనుగోలుకు బాగా ధనవ్యయం చేస్తారు. ఆదాయం బాగా ఉండి, అది అన్ని విధాలా సద్వినియోగపడడం వలన చాలా సుఖంగా కాలక్షేపం జరుగుతుంది. కొత్త ఋణాలు అనుకూలంగా అందుతాయి. పుణ్యక్షేత్ర సందర్శన, విజ్ఞాన వినోద కార్యక్రమాల్లో ప్రత్యేక దృష్టితో పాల్గొనడం జరుగుతుంది. సాంఘికంగా గౌరవ మర్యాదలు బాగా అందుకుంటారు. ప్రమోషన్లు, అనుకున్న రీతిగా ట్రాన్స్ఫర్లు మీకు సంతృప్తికర ఫలితాలు ఇస్తాయి. శుభకార్య ప్రయత్నాలు తేలికగా పూర్తవుతాయి. చిరకాల సమస్యలకు ఈ సంవత్సరం నివారణ మార్గాలు దొరుకుతాయి. కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి మంచి సలహాలు సూచనలు అంది, సమస్యలను పరిష్కరించుకునే దిశగా ప్రయాణం చేస్తారు. అన్ని రంగాల్లోనూ ఈ సంవత్సరం ఈ రాశివారికి శుభ ఫలితాలు అందుతాయి. మంచి జీవనం సాగుతుంది. మొండిబాకీలు వసూలు చేయడంలో స్నేహితులు బాగా సహకరిస్తారు. సరైన ప్రణాళికలను అమలు చేసినట్లయితే, అన్ని రకాలుగా వ్యాపార సమస్యలు తీరగలవు. వ్యాపారులకు సంవత్సరం అంతా లాభసాటిగానే ఉంటుంది. ఉద్యోగులకు అనుకోని లాభాలు చేకూరే అవకాశం ఉంది. పనులు తేలికగా పూర్తి చేస్తారు. తోటివారు సహకరిస్తారు. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. పాత ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తలు పాటిస్తారు. వైద్యం పెద్దగా అవసరం లేకుండానే ఈ సంవత్సరం అనారోగ్యవంతులు కూడా సుఖపడే అవకాశం ఉంది. స్థిరాస్తి కొనుగోలులో తెలివిగా ప్రవర్తిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి అన్ని పనులు వేగంగా పూర్తవుతాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి ధనవ్యయం అధికమైనా, పనులు సానుకూలంగా ఉంటాయి. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు గురువు మీనంలో ఉన్న కాలం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఏప్రిల్ నుంచి అనుకూలంగా సాగుతుంది. అన్ని రంగాల్లోనూ సానుకూల ఫలితాలుంటాయి. రైతులకు కావలసిన సౌకర్యాలు బాగా అందుతాయి. శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. గర్భిణీ స్త్రీలు సుఖంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంటుంది. పూర్వాభాద్ర నక్షత్రం వారు సంబంధం లేని అంశాల్లో ఇబ్బందులకు గురవుతారు. కొన్ని సందర్భాలలో మీకు ఎదురులేని రీతిగా గ్రహచారం అనుకూలిస్తుంది. కొన్నిసార్లు ఎంత శ్రమ చేసినా ఫలితం లేని తీరు వుంటుంది. ధన, కుటుంబ వ్యవహారాల్లో అనుకూల స్థితి ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారు నగలు, వాహనాలు, భవంతుల కొనుగోలు విషయాలపై ఆసక్తి చూపుతారు. ప్రతి చిన్న విషయంలోనూ విపరీతమైన మానసిక ఒత్తిడి పొందుతారు. ప్రతిపనిలోనూ కలహతత్వం ప్రదర్శిస్తారు. రేవతీ నక్షత్రం వారికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగిపోతుంది. అనవసర విషయాల్లో భయాందోళనలు చెందుతారు. ఇతరులకు సహకారం చేయాలి అనుకున్నా మీకు అవమానకరమైన పరిస్థితులు ఎదురయ్యే సూచనలున్నాయి. శాంతి: ప్రత్యేకమైన శాంతి కార్యములు అవసరం లేదు. రోజూ విష్ణూ సహస్ర పారాయణ చేయుట. లక్ష్మీనారాయణ పూజ, గోపూజ చేసుకోవడం శుభప్రదం. పంచముఖ రుద్రాక్షధారణ శుభప్రదం. ఏప్రిల్: శ్రమ చేసినా ఫలితాలు సంతృప్తికరంగా ఉండవు. శనికి శాంతి అవసరం. ఏలినాటి శని ఈ నెల నుంచి ప్రారంభమవుతుంది. మీ జాతక పరిశీలన చేయించుకోండి. ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరం కాగలవు. ఉద్యోగ, వ్యాపారాలు భారంగా నడుస్తాయి. సానుకూలత తక్కువ ఉన్న కాలం. మే: గురు శుక్రుల అనుకూలత, శని కుజుల ప్రతికూలత దృష్ట్యా విచిత్రమై చికాకులు వెంబడిస్తాయి. ఆదాయం బాగున్నా, ఖర్చులు నియంత్రించలేరు. ఉద్యోగంలో అనుకోని చికాకులు రాగలవు. మితభాషణ అవసరం. మీ పనులు స్వయంగా చేసుకోవడం చాలా ఉత్తమం. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. జూన్: ఉద్యోగం వ్యాపారాల్లో అధికారులతోను, పనివారితోను చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలం. మితభాషణ, ఓర్పు చాలా అవసరం. ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకోండి. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. గాయాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోండి. జూలై: మంచి కాలం. అన్ని అంశాలూ అనుకూలిస్తాయి. డబ్బు వెసులుబాటు బాగుంటుంది. ధైర్యంగా, స్వయంగా పనులు చేసుకుంటూ విజయం సాధిస్తారు. అభివృద్ధి వైపు ప్రయాణం సాగుతుంది. కుటుంబ సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి. ఋణ సమస్యలు తీరే కాలం. ఆగస్టు: అన్ని అంశాల్లోనూ మంచి ఫలితాలు ఉంటాయి. అనుకున్న ప్రతిపనినీ సకాలంలో పూర్తి చేస్తారు. సందర్భానుసారం ప్రవర్తించడం, అందరితో స్నేహంగా ఉండడం, ఆర్థిక వెసులుబాటు, ఆరోగ్యం సహకరించడం వంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ నెల చాలా మంచికాలం. సెప్టెంబర్: చాలా జాగ్రత్తలు పాటిస్తారు. అన్ని విషయాల్లోనూ మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా వృత్తి విషయాల్లో సుఖంగా కాలక్షేపం జరుగుతుంది. మితభాషణ చేస్తారు. అవసరం అయిన చోట ధైర్యం తెలివి ప్రదర్శిస్తారు. కుటుంబ సౌఖ్యం తక్కువనే చెప్పాలి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. అక్టోబర్: ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. వృత్తి వ్యవహారాల్లో అనుకూల స్థితి ఉంటుంది. ఈ నెలలో ఇతరుల నుంచి సహాయ సహకారాలు తక్కువనే చెప్పాలి. ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ అయినా తెలివిగా ఖర్చులను నియంత్రించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో మంచి ఫలితాలుంటాయి. నవంబర్: చాలా మంచి రోజులు ప్రారంభం అవుతున్నాయి. మీ పాత సమస్యల పరిష్కారం గురించి భవిష్యత్ ప్రణాళికలు గురించి చక్కటి పరిశ్రమ చేయండి. రోజురోజుకు మంచి ఫలితాలు వస్తాయి. ఋణ విషయాలు ఆర్థిక సమస్యలు ఈ నెల 15వ తేదీ తరువాత క్రమంగా సానుకూలం అవుతాయి. మంచి జీవనకాలం ప్రారంభమైంది. డిసెంబర్: గౌరవ మర్యాదలకు భంగం కలుగకుండా ప్రవర్తిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికం అవుతాయి. రోజువారీ పనులు మాత్రమే చేస్తారు. కొత్త ప్రయోగాలు చేయరు. పుణ్యకార్య ఆకాంక్ష ఎక్కువ అవుతుంది. చాలావరకు మంచి ఫలితాలు ఉంటాయి. డబ్బు విషయంలో ఇబ్బంది లేకుండా సాగిపోతుంది. శుభ ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. జనవరి: అద్భుతమైన కాలం. 22వ తేదీతో వ్యయంలో శుక్రుడి సంచారం ప్రారంభమైన తరువాత కొంత ప్రయాణ చికాకులు ఉంటాయి. ఈ నెల వృత్తి విషయంలో అంతా సుఖంగా ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. చక్కగా ఖర్చు చేయగలుగుతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఫిబ్రవరి: 15 వరకు రవి, 15 నుంచి శుక్రుడు అనుకూలిస్తారు. తద్వారా ఏలినాటి శని ఫలితాలను దాటవేస్తారు. అతి జాగ్రత్తలు పాటిస్తారు. కొన్ని సందర్భాలలో మీ నడవడి తోటివారికి ఇబ్బంది కలిగిస్తుంది. కొత్త పనులు చేపట్టవద్దు. రోజువారీ పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. మార్చి: ఒక విచిత్రమైన కాలం. రోజువారీ పనులు కూడా శ్రమతో నడుస్తాయి. ఏ పనిలోనూ నష్టాలు ఉండవు. ఆదాయం అందడం ఆలస్యంగానూ, ఖర్చులు వేగంగానూ వస్తుంటాయి. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శుభకార్య పుణ్యకార్య ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. మీ జాతకానికి ఈ గోచారాన్ని మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి, గోచారానికి పోలిక చేసి ఫలితములు తెలుసుకోండి. -
Ugadi 2022: శ్రీ శుభకృత్‌నామ సంవత్సర పండుగలు
ఏప్రిల్ 2022 చైత్ర మాసం 2 ఉగాది, వసంత నవరాత్రులు ప్రారంభం 3 ఉమ, శివ, అగ్నిపూజ 4 ఉత్తమ మన్వాది, సౌభాగ్య గౌరీవ్రతం 5 గణేశపూజ 6 నాగపూజ, శ్వేతవరాహకల్పం, శ్రీ పంచమి 8 సూర్యపూజ 9 భవానీ యాత్ర, అశోక రుద్రపూజ 10 శ్రీరామనవమి 11 ధర్మరాజ దశమి 12 విష్ణు డోలోత్సవం, మతత్రయ ఏకాదశి, రుక్మిణీపూజ 13 వామన ద్వాదశి 14 దమనోత్సవం, మేష సంక్రమణం 15 శైవచతుర్దశి, కర్దమక్రీడ 26 మతత్రయ ఏకాదశి 29 మాస శివరాత్రి, శివసన్నిధి స్నానం మే 2022 వైశాఖ మాసం 1 ధర్మఘటాది దానం 3 అక్షయతదియ, చందనోత్సవం, బలరామ జయంతి 4 నాగ చతుర్థి 6 శంకరజయంతి 8 గంగోత్పత్తి, విద్యారణ్య జయంతి 9 అపరాజితాదేవి పూజ 10 చండికాదేవిపూజ 11 వాసవీ జయంతి 12 మతత్రయ ఏకాదశి 13 పరశురామ ద్వాదశి 14 నృసింహ జయంతి 15 వృషభ సంక్రమణం 18 పార్థివ కల్పం 24 చండికాదేవి పూజ 25 హనుమజ్జయంతి 26 మతత్రయ ఏకాదశి 28 మాసశివరాత్రి జూన్ 2022 జ్యేష్ఠ మాసం 05 ఆరణ్యకగౌరీ వ్రతం 07 శుక్లాదేవీ పూజ 08 బ్రహ్మాణీదేవి పూజ 09 దశపాపహర దశమి, సేతుబంధన రామేశ్వర ప్రతిష్ఠ 11 రామలక్ష్మణద్వాదశి 14 సావిత్రీవ్రతం 15 మిథున సంక్రమణం 21 త్రిలోచన పూజ 24 మతత్రయ ఏకాదశి 25 కూర్మజయంతి 27 మాసశివరాత్రి ఆషాఢ మాసం 30 చంద్రదర్శనం, సీతారామ రథోత్సవం జూలై 2022 1 పూరీ జగన్నాథ రథోత్సవం 4 స్కంధ పంచమి 5 కుమారషష్ఠి 7 మహిషాసురమర్దినీపూజ 8 ఐంద్రీదేవి పూజ 9 మహాలక్ష్మీ వ్రతారంభం 10 తొలి ఏకాదశి, శయన ఏకాదశి 11 వాసుదేవ ద్వాదశి, చాతుర్మాస్య వ్రత ప్రారంభం 17 కర్కాటక సంక్రమణం, దక్షిణాయన పుణ్యకాలం 18 సంకల్పాలకు దక్షిణాయనం 27 మాసశివరాత్రి శ్రావణ మాసం 30 చంద్రదర్శనం ఆగస్టు 2022 1 దూర్వాగణపతివ్రతం 2 నాగపంచమి 3 సూర్యషష్ఠి 5 వరలక్ష్మీ వ్రతం 6 కౌమారీదేవి పూజ 8 మతత్రయ ఏకాదశి 9 దామోదర ద్వాదశి, పవిత్రారోపణం 12 రాఖీపూర్ణిమ, యజుర్వేదోపాకర్మ 15 సంకట చతుర్థి 19 స్మార్త శ్రీకృష్ణాష్టమి 20 కౌమారీదేవీ పూజ 23 స్మార్త ఏకాదశి 25 మాస శివరాత్రి 26 సర్వేషాం అమావాస్య 27 పోలా వ్రతం భాద్రపద మాసం 28 శైవమౌనవ్రతం 29 కల్కి జయంతి 30 సువర్ణగౌరీ వ్రతం 31 శివాచతుర్థి 31 వినాయకచవితి సెప్టెంబర్ 2022 1 ఋషిపంచమి 4 కేదారవ్రతం 6 మతత్రయ పరివర్తన ఏకాదశి 7 వామనజయంతి 9 అనంత వ్రతం 11 మహాలయ పక్ష ప్రారంభం 12 ఉండ్రాళ్ళ తద్ది 18 వ్యతీపాత మహాలయం 21 మతత్రయ ఏకాదశి 22 యతి మహాలయం 24 శహత మహాలయం 24 మాస శివరాత్రి ఆశ్వయుజ మాసం 26 దసరా నవరాత్రుల ప్రారంభం అక్టోబర్ 2022 02 సరస్వతీ పూజ, దేవీ త్రిరాత్రవ్రతం 03 దుర్గాష్టమి 04 మహర్నవమి 05 విజయదశమి 06 మతత్రయ ఏకాదశి 07 గోద్వాదశీ, పద్మనాభ ద్వాదశి 12 అట్లతద్ది 21 మతత్రయ ఏకాదశి 22 గోవత్స ద్వాదశి 23 మాస శివరాత్రి 23 నరకచతుర్దశి 24 దీపావళి అమావాస్య 25 కేదార వ్రతం కార్తీక మాసం 26 అఖండదీప ప్రారంభం 27 యమపూజ, భగినీహస్త భోజనం 29 నాగుల చవితి నవంబర్ 2022 04 మతత్రయ ఏకాదశి 05 క్షీరాబ్ది ద్వాదశి, చిల్కు ద్వాదశి 07 జ్వాలాతోరణం 08 గ్రహణం, కార్తీకవ్రతోద్యాపనం 20 మతత్రయ ఏకాదశి 21 గోవత్స ద్వాదశి 22 మాస శివరాత్రి 23 సర్వేషాం అమావాస్య మార్గశిర మాసం 29 సుబ్రహ్మణ్య షష్ఠి 30 మిత్రసప్తమి డిసెంబర్ 2022 1 కాలభైరవాష్టమి 4 మతత్రయ ఏకాదశీ 4 గీతాజయంతి 5 హనుమద్వ్రతం 7 దత్తజయంతి 9 పరశురామజయంతి 22 మాస శివరాత్రి జనవరి 2023పుష్య మాసం 2 మతత్రతయ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి 3 కూర్మ జయంతి 13 భోగి 14 మకర సంక్రాంతి 15 కనుమ 20 మాస శివరాత్రి మాఘమాసం 23 వాసవీ ఆత్మార్పణ 24 గుడలవణ దానం 26 శ్రీ పంచమి 28 రథసప్తమి 29 భీష్మాష్టమి ఫిబ్రవరి 2023 1 మతత్రయ భీష్మఏకాదశి 5 మహామాఘి 13 కుంభసంక్రమణం 18 మహాశివరాత్రి మార్చి 2023 ఫాల్గుణ మాసం 3 మత్రతయ ఏకాదశీ 4 నృసింహ ద్వాదశీ 5 కామదహనం అర్ధరాత్రి 6 హోళీ ప్రదోషం 8 వసంతోత్సవం 15 మీన సంక్రమణం 20 మాస శివరాత్రి 21 సర్వేషాం అమావాస్య 22 ఉగాది -
సకల శుభారంభం
చైత్రశుద్ధ పాడ్యమి అంటే ఉగాది పర్వదినం. ఆబాలగోపాలం ఆనందంగా చేసుకునే పండుగ ఉగాది. కాలగమన సౌ«ధానికి తొలి వాకిలి. పౌర్ణమిరోజున చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ మాసానికి అదే పేరు ఉంటుంది. చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిసి ఉండటం వలన ఈ మాసావికి చైత్రమాసం అని పేరు. అన్ని ఋతువులకన్నా విశేషమైన ఋతువు వసంత ఋతువు. కోకిల పాటలు, సన్నజాజి, మల్లెల పరిమళాలు, చిగురించిన ఆకులతో పచ్చని చెట్లతో ప్రకృతిమాత కొత్త అందాలు సంతరించుకుంటుంది. మనిషిని, మనస్సును, బుద్ధిని వికసింపజేసే అహ్లాదభరిత వాతావరణంలో ఉగాది నాడు మనం నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం. అంటే నిన్నటి వరకు ఉన్న ప్లవనామ సంవత్సరం నుంచి నేటితో శుభకృతు నామ సంవత్సర ఉగాదిలోకి అడుగు పెడుతున్నాం. ఈ సందర్భంగా ఉగాది విశిష్టతతోపాటు ఈ రోజున ఏమేం చేయాలో తెలుసుకుందాం... చైత్ర శుద్ధ పాడ్యమినే కొత్త సంవత్సరంగా అంగీకరించడానికి , వేడుక చేసుకోడానికి కారణం ఋతువులు. నెలల కంటే ఋతువులు ప్రధానమైనవి. చైత్రమాసానికి శిశిర ఋతువు పోయి వసంత ఋతువు... అంటే ఆకులు రాలే కాలం అయిపోయి చెట్లు చిగుర్చి పూత పూస్తాయి. మల్లెలు గుబాళిస్తాయి. పక్షుల ఈకలు ఊడి కొత్తవి వస్తాయి. మనకు కూడా అప్పటిదాకా చర్మం పొడివారడం, పగుళ్ళు, పొట్టు ఊడటం లాంటి సమస్యలు పోయి కొత్త చర్మం వస్తుంది. ఈ నెలతో చెట్లు చిగురించడం మొదలై పూత, పిందెలు, పండ్లు – ఇలా అంతా ఫలవంతంగా సాగుతుంది. శరీరంలో పైకి కనిపించే మార్పులే కాదు.. మానసికంగా కూడా చైత్రమాసం ఉల్లాసాన్ని, ఉత్సాహాన్నీ ఇస్తుంది. చలికాలంలో, వర్షాకాలంలో ఉండే మందకొడితనం వసంతఋతువు నుంచి ఉండదు. ఒకవిధమైన చురుకుదనం ప్రవేశిస్తుంది. ఈ కారణంగానే చైత్రమాసంలో ఉగాదిని జరుపుకుంటాం. ఎలా జరుపుకోవాలి? ఉగాది పండుగ జరుపుకునే విధానాన్ని అత్యంత ప్రామాణిక గ్రంథమైన ‘ధర్మసింధు’’పంచవిధుల సమన్వితం’గా సూచిస్తోంది. అవి 1. తైలాభ్యంగనం, 2. నూతన సంవత్సరాది స్తోత్రం, నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం), 4. ధ్వజారోహణం (పూర్ణకుంభదానం), ç5. పంచాంగ శ్రవణం... తైలాభ్యంగనం తైలాభ్యంగనం అంటే తల మొదలుకొని ఒళ్లంతా నువ్వుల నూనె పట్టించి నలుగుపెట్టి తలస్నానం చేయడం ప్రధమ విధి. ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను నివసిస్తారని, అందుకే నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసిన వారికి లక్ష్మి, గంగాదేవి అనుగ్రహం లభిస్తుందని ప్రతీతి. నూతన సంవత్సర స్తోత్రం అభ్యంగ స్నానానంతరం దీపధూపాది పూజాదికాలు చేసిన తర్వాత మామిడి ఆకులతో, పూలతోరణాలతో అలంకరించిన పూజామందిరంలో నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను, ఇష్టదేవతారాధనతో బాటు పూజించి ఉగాది ప్రసాదాన్ని (ఉగాది పచ్చడి) నివేదించాలి. ఉగాడి పచ్చడి సేవనం ఉగాది నాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేపనం అత్యంత ప్రధానమైనది. వేపపూత, కొత్త చింతపండు, బెల్లం లేక పంచదార లేక చెరకు ముక్కలు, నేయి, ఉప్పు, మిరియాలు, షడ్రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడిని ఇంట్లో అందరూ సేవించాలి. ఉగాది నాడు ఉగాడి పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా షడ్రుచుల సమ్మేళనంతో ఉంటుందని చెబుతారు. పురాణ కాలం నుంచి... చారిత్రకాల వరకు... ► అనేక పురాణ కథల్లో ఉగాది ప్రస్తావన కనిపిస్తుంది. విష్ణుమూర్తి మత్సా్యవతారం ఎత్తింది చైత్ర శుద్ధ పాడ్యమి నాడే. ► బ్రహ్మ దేవుడు సృష్టిని ప్రారంభించింది ఉగాదినాడే. ► ఈ కారణంగానే ఉగాది నాడు కొత్త లెక్కలు ప్రారంభించే ఆచారం వచ్చింది. ► వనవాసానంతరం సీతారాములు అయోధ్యకు తిరిగి వచ్చింది ఈనాడే. ► వసు చక్రవర్తి తపస్సు చేసి ఈనాడే రాజ్యాధికారం సాధించాడు. అందుకే ఉగాదికి అంత ప్రాశస్త్యం. ► చరిత్రలో అత్యంత పరాక్రమశాలి విక్రమార్కుడు. ఆ తేజోవంతుడైన విక్రమార్క చక్రవర్తి పట్టాభిషిక్తుడయ్యింది చైత్ర శుద్ధ పాడ్యమినాడే. అదేవిధంగా మరో శకకారుడైన శాలివాహన శకం కూడా ఉగాదిరోజునే ఆరంభమైంది. వీరిద్దరినీ ఉగాదిరోజున స్మరించుకోవడం ఆచారం. ► చైత్ర శుక్ల పాడ్యమి నాడు నూతన సంవత్సరాది. ఈ సంప్రదాయం కన్నడ, మహారాష్ట్రులకు కూడ ఉంది. పంచాంగ శ్రవణం ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసేవారికి గంగాస్నాన ఫలితం లభిస్తుందని పురాణోక్తి. ఏమిటీ పంచాంగం? మనకు తెలుగు సంవత్సరాలు ‘ప్రభవ’ తో మొదలుపెట్టి ‘అక్షయ’ నామ సంవత్సరం వరకు గల 60 సంవత్సరాలలో తాము జన్మించిన నామ సంవత్సరాన్ని జీవితంలో ఒక్కసారో, రెండుసార్లో చూస్తూంటారు! అందువల్లనే వారు జన్మించిన 60 సంవత్సరాలకు తిరిగి ఆ నామ సంవత్సరం వచ్చినపుడు, అది ఒక పర్వదినంగా భావించి ‘షష్టిపూర్తి’ ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు. పంచాంగంలో ఏముంటుంది? నిత్య వ్యవహారాల కోసం అందరూ ఇంగ్లీషు క్యాలెండర్‌ని ఉపయోగిస్తున్నప్పటికీ... శుభకార్యాలు, పూజాపురస్కారాలు, పితృ దేవతారాధన వంటి విషయాలకు వచ్చేటప్పటికి ‘పంచాంగం’ చూడటమే ఆచారం. ఇది మన పంచాంగ విశిష్టతకు నిదర్శనం. ‘పంచాంగం’ అంటే... తిధి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే అయిదు అంగాలు కలది అని అర్థం. పాడ్యమి నుంచి పూర్ణిమ లేదా అమావాస్య వరకు 15 తిథులు, ఆదివారం నుంచి శనివారం వరకు ఏడు వారాలు, అశ్వని మొదలు రేవతి వరకు 27 నక్షత్రాలు, విష్కంభం మొదలుకొని వైధృతి వరకు 27 యోగాలు, బవ మొదలుకొని కిం స్తుఘ్నం వరకు11 కర ణాలు ఉన్నాయి. వీటన్నిటినీ తెలిపేదే పంచాంగం. ‘పంచాంగ శ్రవణం’ ఉగాది విధుల్లో ఒకటి. నేడు పల్లెటూళ్లు మొదలుకొని పెద్ద పెద్ద నగరాల వరకూ అన్నిచోట్లా పంచాంగ శ్రవణం నిర్వహించడం చూస్తూనే ఉన్నాము . ఇప్పుడంటే పంచాంగాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి కానీ ఇంతకుమునుపు ఇలా దొరికేవి కాదు. తాళపత్రాల మీద రాసినవి మాత్రమే... అదీ కొందరు పండితులవద్ద మాత్రమే ఉండేవి కాబట్టి వారు ఉగాదినాడు సంవత్సర ఫలాలను అందరికీ తెలియజేసేవారు. పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పం చాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు. అంటే నవనాయకులను తెలుసుకుని వారిద్వారా ఫలాలను అంచనా వేస్తారు. సంవత్సరంలో ఏయే గ్రహాలకు ఏయే అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి. ఎవరిని ధ్యానించాలి? ఈ పండుగకు అధిదేవత రాముడు, కృష్ణుడు, లక్ష్మి, సరస్వతి లేదా వినాయకుడు వంటి దేవతలు కారు. కాలపురుషుడు ఈ పర్వపు అధిదేవత. ‘ఓం కాలాయనమః’ అనే నమక మంత్రం గాని విష్ణు సహస్రం గాని పఠించాలి. భగవంతుడే కాలపురుషుడని, నిత్యం అతణ్ణి ధ్యానించాలని శాస్త్రం చెబుతోంది. మానవ జీవితం అంతా కాలం పైననే ఆధారపడి ఉండుట వలన కాలపురుషుని ఆరాధించాలి. మనం చేసే పంచాంగ శ్రవణమే ఈ ఆరాధన. విష్ణు సహస్రనామ ఫలశ్రుతిలో చెప్పినట్లు మనం ఏ రూపంలో స్తుతించినా అది పరమాత్మునికే చెందుతుంది. ఈ దృష్టితో కాలపురుషుని పంచాంగ శ్రవణ రూపాన స్తుతించాలి. ఇంకనూ సత్కర్మానుష్టానానికి కావలసిన కాల విశేషణాలను తెలుసుకోవడమే పంచాంగం ప్రయోజనం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలనేవి పంచాంగాలు. ఒక శుభ కార్యం గాని ఒక ధర్మకార్యం గాని చేయడానికి పంచాంగమే మనకు మార్గదర్శనం చేస్తుంది. ఈ చైత్రమాసపు శుద్ధ పాడ్యమి నుంచి వసంతరాత్రులు జరుపుకుంటారు. అంతేకాదు, తెలుగువారి ప్రీతికరమైన శ్రీ రామనవమి కూడా ఈ నెలలోనే వస్తుంది. ఈ శ్రీ శుభకృత్‌నామ సంవత్సర ఉగాది మన దేశమంతటికీ శుభాలను చేకూరుస్తుందనీ, సకల జీవులకు సుఖశాంతులు ప్రసాదించగలదనీ ఆకాంక్షిద్దాం. – డి.వి.ఆర్. -
తలొగ్గేది ప్రేమకే.. నేను అహంభావిని కాదు.. శక్తిమంతురాలిని: తమిళిసై
సాక్షి, హైదరాబాద్: రాజ్‌భవన్‌లో జరిగిన ఉగాది ఉత్సవాలు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మధ్య దూరాన్ని మరింత పెంచాయి. శుభకృత్ తెలుగు సంవత్సర ఉగాది ముందస్తు వేడుకల కోసం ఆహ్వానాలు వెళ్లినా.. సీఎం కేసీఆర్‌గానీ, మంత్రులుగానీ ఎవరూ రాలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ కూడా హాజరుకాలేదు. దీనికితోడు ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులను ఉద్దేశించి మాట్లాడుతూ.. గవర్నర్ తమిళిసై వ్యక్తం చేసిన అభిప్రాయాలు, తర్వాత మీడియాతో నిర్మొహమాటంగా చేసిన వ్యాఖ్యలు వేడిని మరింతగా పెంచాయి. ఈ నేపథ్యంలో ప్రగతిభవన్‌కు, రాజ్‌భవన్‌కు మధ్య పూడ్చలేని స్థాయికి విభేదాలు పెరిగాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజ్‌భవన్‌లో జరిగిన ఉగాది వేడుకల్లో తమిళిసై దంపతులతో హరియాణా గవర్నర్ దత్తాత్రేయ, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి నేతలు, ప్రముఖుల హాజరుతో.. రాజ్‌భవన్‌లో శుక్రవారం సాయంత్రం ముందస్తు ఉగాది వేడుకలను నిర్వహించారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, మాజీఎమ్మెల్యే లక్ష్మీనారాయణ, బీజేపీనేతలు సుధాకర్‌రెడ్డి, సి.అంజిరెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య, ఐఐటీ డైరెక్టర్ మూర్తి, పలు యూనివర్సిటీల వీసీలు, పలువురు ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. అందరినీ గవర్నర్ పేరుపేరునా పలకరించి, మాట్లాడారు. పంచాంగ శ్రవణం నిర్వహించాక.. ఎనిమిది మందికి గవర్నర్ చేతుల మీదుగా ఆర్థికసాయం అందజేశారు. తెలుగు యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడారు. తమిళిసై ప్రసంగం ఆమె మాటల్లోనే.. పిలిస్తే.. ప్రొటోకాల్ పక్కనపెట్టి వెళ్లేదాన్ని.. ‘‘నేను రాష్ట్రంలోని 119 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపించాను. కొందరు వచ్చారు. రానివారి గురించి నేనేమీ చెప్పేది లేదు. నా ఆహ్వానాన్ని గౌరవించనందుకు నేనేమీ బాధపడడం లేదు. ప్రగతిభవన్‌లో ఉగాది కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఉంటే ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి అయినా వెళ్లేదాన్ని. యాదాద్రికి వెళ్లాలని ఉన్నా నన్ను ఆహ్వానించలేదు. నేను వివాదాలను, గ్యాప్‌ను సృష్టించే వ్యక్తిని కాదు. కొన్ని అంశాల్లో భేదాభిప్రాయాలు ఉన్నాయి. నేను ఎన్నిసార్లు ఆహ్వానాలు పంపినా పట్టించుకోవడం లేదు. ఇగ్నోర్ చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ పిలిచాం. కానీ రాలేదు. సమ్మక్క సారలమ్మ జాతరకు ఎవరో పిలుస్తారని ఎదురుచూడకుండా వెళ్లాను. రాష్ట్ర ప్రభుత్వానికి, రాజభవన్‌కు మధ్య దూరం (గ్యాప్) రావడానికి కారణం తెలియదు. నేను తెలంగాణ సోదరిని.. రాజ్‌భవన్‌లో ఉన్నది గవర్నర్ కాదు, తెలంగాణ సోదరి. నేను చాలా స్నేహశీలిని, నవ్వుతున్నంత మాత్రాన బలహీనంగా ఉన్నట్టు కాదు. నేను చాలా శక్తివంతురాలిని. ప్రేమాభినాలతో తప్ప నా తలను ఎవరూ వంచలేరు. నేను అహంభావిని కాదు. చురుకైన మహిళను. తెలంగాణ ప్రజలకు చేయి అందించేందుకు ఇక్కడ మీ సోదరి ఉంది. మీకు సాయం చేసేందుకు చేయూతనిస్తా.. ఇదే ప్రజలకు నా సందేశం. గత రెండున్నరేళ్లుగా తెలంగాణ ప్రజలకు మేలు చేసేందుకు రాజ్‌భవన్ ఎంతో చొరవ తీసుకుంది. ఇది ప్రజాభవన్.. తెలంగాణ సోదర సోదరీమణులు, పెద్దల కోసం రాజ్‌భవన్ తలుపులు తెరిచే ఉన్నాయి. వచ్చే నెల నుంచి ప్రజా దర్బార్ విజ్ఞాపనల పెట్టె ద్వారా తెలంగాణ ప్రజల నుంచి అనేక సూచనలు వస్తున్నాయి. అందులో వచ్చే వినతులను పరిశీలించి నా బృందం ఎంపిక చేసిన వారికి అవసరమైన సాయం కూడా చేస్తున్నాం. ప్రస్తుతం రాజ్‌భవన్ నుంచి అందుతున్నది చిరుసాయం మాత్రమే. రాబోయే రోజుల్లో ఎక్కువ మందికి అందేలా చూస్తాం. ఉగాది నుంచి తెలంగాణ కొత్త శకాన్ని చూడబోతోంది. ఉమ్మడి ప్రయత్నాలతో ఓవైపు తెలంగాణను అభివృద్ది చేస్తూనే.. ప్రజాదర్బార్ ద్వారా ప్రజలను కలుస్తున్నా. వచ్చేనెల నుంచి ప్రజాదర్బార్ క్రమం తప్పకుండా ఉంటుంది. రాజ్‌భవన్ పరిమితులు ఏమిటో నాకు తెలుసు. అయినా తెలంగాణ ప్రజలను కలిసి వారి వినతులు స్వీకరించి పరిష్కరించడం ద్వారా మేలు చేసేందుకు ఉత్ప్రేరకంగా పనిచేస్తా. పరస్పరం గౌరవించుకుందాం.. ఉగాది వేడుకలకు రావాలంటూ తెలంగాణలో అత్యున్నత స్థాయి వ్యక్తి నుంచి రాజ్‌భవన్ ఉద్యోగి వరకు ఆహ్వానాన్ని పంపించా. చాలా మంది నా ఆహ్వానానికి స్పందించి గౌరవించి వచ్చారు. కొత్త ఏడాది నుంచి తెలంగాణలో కొత్త శకాన్ని ప్రారంభిద్దాం. ప్రేమాభిమానాలతో ఒకరినొకరు అర్థం చేసుకుని, పరస్పరం గౌరవించుకుంటూ ముందుకు సాగుదాం. ప్రస్తుతం కరోనా సమస్య ముగిసింది. వాక్సినేషన్, సామాజిక దూరం వంటి జాగ్రత్తలు పాటించడం వల్లే ఈ రోజు తిరిగి సురక్షితంగా కలుసుకోగలుగుతున్నాం. సురక్షిత ప్రపంచంలోకి అడుగు పెడుతూ.. సమస్యలు పరిష్కరించుకుంటూ తెలంగాణ అభివృద్ధి కోసం ఐక్యంగా పనిచేద్దాం. నా ఆహ్వానం మేరకు పుదుచ్చేరి స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌తోపాటు పలువురు అధికారులు కూడా ఉగాది వేడుకలకు వచ్చారు. నేను తెలంగాణ ప్రజలు, సంస్కృతిని ప్రేమిస్తున్నా. ఇలాంటి పండుగలు పుదుచ్చేరి, తెలంగాణ మధ్య బంధాన్ని బలోపేతం చేస్తాయి’’ అని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. సంబంధిత వార్త: రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు.. సీఎం కేసీఆర్ దూరం -
రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు.. సీఎం కేసీఆర్ దూరం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ మధ్య దూరం మరింత రోజురోజుకీ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకలకు కేసీఆర్‌తో పాటు మంత్రులు కూడా హాజరుకాలేదు. కాగా రాజ్‌భవన్‌లో శుక్రవారం శ్రీ శుభకృత్ నామ ఉగాది ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాంలో పాల్గొనాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేసీఆర్‌ను ఆహ్వానించారు. ప్రగతి భవన్‌కు ఆహ్వానం కూడా పంపారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు కూడా గైర్హాజరయ్యారు. స్టేజ్‌పై ఉన్న ఫ్లెక్సీలోనూ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. ఫ్లైక్సీలో కేసీఆర్ ఫోటో కనిపించలేదు. రాజ్‌భవన్‌లో జరిగిన ఉగాది వేడుకలకు మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు , ఈటెల రాజేందర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చడా వెంకట్ రెడ్డి, టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శినం మొగులయ్య, పలువురు జడ్జీలు, ప్రముఖులు హాజరయ్యారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వేడుకల్లో పాల్గొన్నారు. చదవండి: ‘తెలంగాణ సర్కార్ ఏం చేస్తోందో వచ్చి చూడండి’ -
ఉగాది వేడుకల్లో పాల్గొననున్న సీఎం వైఎస్ జగన్ దంపతులు
సాక్షి, అమరావతి: శుభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్భంగా రేపు(శనివారం) తాడేపల్లిలో జరగనున్న వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు పాల్గొననున్నారు. ఉదయం 10.36కి పంచాంగ పఠనంలో సీఎం దంపతులు పాల్గొంటారు. పంచాంగ పఠనం కోసం గ్రామీణ వాతావరణంలో ఏర్పాటు పూర్తి చేశారు. చదవండి: శుభకృత్‌లో అన్నీ శుభాలు కలగాలి: సీఎం జగన్ శ్రీ శుభకృత్ నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని, సమృద్ధిగా వానలు కురవాలని; పంటలు బాగా పండాలని, రైతులకు మేలు జరగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలన్నారు. -
Ugadi 2022: శుభకృత్‌లో అన్నీ శుభాలు కలగాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: శ్రీశుభకృత్ నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని, సమృద్ధిగా వానలు కురవాలని; పంటలు బాగా పండాలని, రైతులకు మేలు జరగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలన్నారు. చదవండి: ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుతున్నాయి: సీఎం జగన్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శుభకృత్ సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని అభిలషించారు. ప్రతి ఒక్కరూ ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ శుభకృత్ నామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, ప్రతి ఇల్లు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. — YS Jagan Mohan Reddy (@ysjagan) April 2, 2022 -
Ugadi 2022: విరబూసిన వేప..
-
Ugadi 2022: షడ్రుచుల ఉగాది