సీజేఐ నివాసంలో ఉగాది వేడుకలు | Sakshi
Sakshi News home page

సీజేఐ నివాసంలో ఉగాది వేడుకలు

Published Sun, Apr 3 2022 6:05 AM

Ugadi celebrations at the residence of CJI NV Ramana - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నివాసంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. శనివారం సాయంత్రం జరిగిన వేడుకలకు జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ హిమా కోహ్లీ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రామకృష్ణ ప్రసాద్‌ పాటు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయవాదులు, సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు, డీఆర్డీవో చైర్మన్‌ సతీశ్‌ రెడ్డి, తెలుగు సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం, వేద ఆశీర్వచనం, సినీ గాయకులు కారుణ్య, సాహితీల సంగీత విభావరి జరిగింది. తెలుగు వంటకాలతో ఘనంగా విందు ఏర్పాటు చేశారు.
 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement