
ఆక్లాండ్ నగరంలో తెలంగాణా అసోసియేషన్ అఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త సంవత్సరాది విశ్వవాసు సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలను నిర్వహించుకున్నారు
ఈ కార్యక్రమం లో తెలుగుతనం, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పంచాంగ శ్రవణంతో రాశి ఫలితాలను స్థితిగతులను విని ఆనందించారు. ఆ తర్వాత చిన్నారులు పెద్దలు వివిధ తెలుగు సాంప్రదాయ పాటలు, నృత్యాలతో అలరించడమే కాకుండా సాంప్రదాయ పిండి వంటలతో సామూహిక భోజనాలు చేశారు.

కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన టే అటటు డెంటల్ క్లినిక్ మోనిక శ్రీకాంత్ తోపాటు సామజికసేవాలో ముందున్న తెలుగు ప్రతినిధులను ఉగాది పురస్కారాలతో గౌరవంగా సన్మానించుకోవడం తోపాటు చిన్నారులకు నృత్యకారులకు బహుమతులని అందజేయడం జరిగింది.
అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ అద్యేక్షతన జరిగిన ఈ వేడుకలో ప్రముఖ వ్యాపారవేత్త శివ కిలారి, రవి సంకర్ అల్ల, సత్యనారాయణ తట్టల, అసోసియేషన్ మాజీ అధ్యక్షలు పట్లోళ్ల నరేందర్ రెడ్డి, మేకల ప్రసన్న కుమార్,శైలందర్ రెడ్డి, విశ్వనాధు బాల, విజేత యాచమనేని, మధు ఎర్ర, శైలజ బాలకుల్ల, లింగం గుండెల్లి, శశికాంత్ గున్నాల, కావ్య, వర్ష పట్లోళ్ల, మేకల స్వాతి,కిరణ్మయి, విశ్వనాథ్ అవిటి, సలీం, ప్రమోద్, విజయ్ శ్రీరామ్, చంద్రకిరణ్,రమేష్ రామిండ్ల, మనోహర్ కన్నం, హరీష్, రమేష్ ఆడెపు, పవన్, అనిల్ మెరుగు తదితరులతో పాటు పెద్ద ఎత్తున ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
(చదవండి: హాంగ్‌కాంగ్‌లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు)