చికాగోలో ఘనంగా ఉగాది, శ్రీరామ నవమి వేడుకలు! | Chicago Telugu Association Celebrates Ugadi And Sri Ramanavami 2024, Photos Goes Viral - Sakshi
Sakshi News home page

చికాగోలో ఘనంగా ఉగాది, శ్రీరామ నవమి వేడుకలు!

Published Wed, Apr 17 2024 2:39 PM | Last Updated on Wed, Apr 17 2024 4:07 PM

Chicago Telugu Association Celebrates Ugadi and Sri  Ramanavami - Sakshi

అమెరికా ఇల్లినాయిస్‌లోని చికాగోలో చికాగో తెలుగు అసోసీయేషన్‌(సీటీఏ) ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం చికాగోలోని బాలాజీ టెంపుల్‌ ఆడిటోరియంలో జరిగిది. ఈ వేడకలకు దాదాపు 500 మందికి పైగా హాజరయ్యారు. సీటీఏ కల్చరల్‌ డైరెక్టర్ శ్రీమతి సుజనా ఆచంట, ఈ కార్యక్రమానికి హాజరైన వారికి స్వాగతం పలకి, వేడుకను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.

ముఖ్యంగా కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య రూపాలు, శాస్త్రీయ సంగీతం, తెలుగు భాష స్కిట్‌లు ఎంతగానో అరించాయి. అలాగే ఉగాది పచ్చడి పోటీలు కూడా నిర్వహించారు. శోభా తమ్మన, జానకి నాయర్, ఆశా అడిగా, వనిత వీరవల్లి వంటి గౌరవనీయ గురువులు ఆధ్వర్యంలో దాదాపు వందమందికి పైగా పిల్లలు శాస్త్రీయ నృత్యాలు, సంగీతంతో  అలరించారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో గురు రమ్య ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శించిన అనతి నీయారాతో సహా..ముగింపులో రవిశంకర్ మరియు అతని బృందం పాడిన 'భో శంభో', 'బ్రహ్మ ఒకటే' వంటి భక్తి పాటలు హైలెట్‌గా నిలిచాయి.

ఈ ఈవెంట్‌కి అతిధులుగా సత్య, ఏటీఏకు చెందిన కడిమళ్ల, కరుణాకర్‌ మాధవరం తదితరులు విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో సీటీఏ కల్చరల్‌ కమిటీ సభ్యులు రాణి వేగే, సుజనా ఆచంట, అనిత గోలి, శ్రీ, చిట్టినేని, మధు ఆచంట, అనూష విడపలపాటి, ప్రత్యేక వాలంటీర్ల బృందం, సాయిచంద్ మేకల, భవానీ సరస్వతి, మాధవి తిప్పిశెట్టి, రత్న చోడ, వెంకట్ తొక్కాల,నాగభూషణ్ భీమిశెట్టి, పృద్వి సెట్టిపల్లి, సునీల్, రమేష్, నరేంద్ర, బాల, చక్రధర్, వివేక్ కిలారు, రామానుజం, శశిధర్, రమేష్, మృదుల, సీటీఏ బోర్డు సభ్యులు ప్రవీణ్ మోటూరు, రావు ఆచంట, శేషు ఉప్పలపాటి, అశోక్ పగడాల, ప్రసాద్ తాళ్లూరు, వేణు ఉప్పలపాటి, రాహుల్ విరాటపు, రమేష్ మర్యాల, 
తదితరులు కీలకపాత్ర పోషించారు. కాగా, సీటీఏ అధ్యక్షుడు నాగేంద్ర వేగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి, జయప్రదం చేయడంలో సహాయసహకరాలు అందించిన సీటీఏ బోర్డు సభ్యులకు వాలంటీర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

(చదవండి: అమెరికా వాతావరణం కన్నా మేరా భారత్ మహాన్ !)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement