ఉగాది పచ్చడి తింటాం.. చేయడం రాదు: శివాని, శివాత్మిక

Shivani, Shivatmika about Ugadhi  - Sakshi

శివాని, శివాత్మిక

హైదరాబాద్‌లో ఉంటే అమ్మ, నాన్న,  మేమిద్దరం కలిసి పండగ జరుపుకుంటాం. అమ్మ ఉగాది పచ్చడి, గారెలు, పులిహోర, పాయసం.. ఇలా అన్నీ చేస్తుంది. ఒకవేళ మేం చెన్నైలో ఉంటే... అక్కడి మా బంధువులతో పండగ జరుపుకుంటాం. మా ఇద్దరికీ పచ్చడి తినడం తప్ప చేయడం రాదు. మా చిన్నప్పుడు ఇద్దరం ముగ్గులు వేసేవాళ్లం. పండగ అంటే మాకు ముగ్గులే ఎగ్జయిటింగ్‌.

ఇక పండగ రోజున కొత్త బట్టలంటే అది ఆ రోజు మూడ్‌ని బట్టి ఉంటుంది. ఒక్కోసారి ఫుల్‌ ట్రెడిషనల్‌గా డ్రెస్‌ చేసుకుంటాం.. చక్కగా నగలు పెట్టుకుని గుడికి వెళతాం. చీర, లంగా, ఓణీ, చుడీదార్‌.. ఇలా ఏదో ఒకటి ప్రిఫర్‌ చేస్తాం. ఇప్పుడు చెన్నైలో ఉన్నాం. ఈసారి ఫుల్‌ ట్రెడిషనల్‌గా రెడీ అవుతాం. ఈ ఉగాది అందరి జీవితాల్లో ఆనందం నింపాలని కోరుకుంటూ.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.

ఇంకా మంచి ఆర్టిస్ట్‌గా గుర్తింపు సంపాదించుకోవాలనుకుంటున్నాను. ఇంకా మంచి నటిగా ఎదగాలని ఉంది. అలాగే మంచి డాక్టర్‌ అవ్వాలన్నది లక్ష్యం. ప్రస్తుతం ఫైనల్‌ ఇయర్‌ మెడిసన్‌ చేస్తున్నాను. ఏం చేసినా నిబద్ధతతో చేయాలనే నిర్ణయం తీసుకున్నాను. వర్కవుట్, షూటింగ్, చదువు, హార్స్‌ రైడింగ్‌.. ఏదైనా మరింత క్రమశిక్షణగా చేయాలనుకుంటున్నాను.   
– శివాని

ఈ సంవత్సరం చేతినిండా పని ఉండాలని కోరుకుంటున్నాను. తెలుగు, తమిళంలో సినిమాలు చేయాలనుకుంటున్నాను. అలాగే ఇతర భాషల్లోనూ అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. కెరీర్‌పరంగా ఎదగాలన్నదే ప్రస్తుత లక్ష్యం. వీలైతే ఏదైనా స్పోర్ట్‌ నేర్చుకోవాలని ఉంది. ఏడాది మొత్తం చాలా ప్రశాంతంగా గడిచిపోవాలని ఉంది. ఆరోగ్యం బాగుండాలి.
 – శివాత్మిక 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top