టీసీఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు | TCSS conducts Ugadi Celebrations in Singapore | Sakshi
Sakshi News home page

టీసీఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు

Apr 7 2019 11:18 AM | Updated on Apr 7 2019 11:29 AM

TCSS conducts Ugadi Celebrations in Singapore - Sakshi

సింగపూర్ : తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (టీసీఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో ఉగాది 2019 వేడుకలు ఘనంగా జరిగాయి. సెంగ్ కాంగ్ లోని శ్రీ అరుళ్ముగు వేలు మురుగన్ జ్ఞానమునీశ్వర్ ఆలయంలో ఏప్రిల్ 6న శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలు జరిపారు. శ్రీ వికారి నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వ దినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకల్లో భాగంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో సుమారు 800 మంది ప్రవాసీ తెలంగాణ వాసులు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సంప్రదాయ ఉగాది పచ్చడి, ప్రసాదం పంపిణీ చేశారు.

ఈ వేడుకల్లో పాల్గొన్న వారికి, ప్రసాదం దాతలకు సొసైటీ తరపున అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు గడప రమేశ్, గర్రేపల్లి శ్రీనివాస్, కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త, కార్యనిర్వాహక సభ్యులు ప్రవీణ్ కుమార్ చేన్నోజ్వాల, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, గార్లపాటి లక్ష్మారెడ్డి, గోనె నరేందర్, గింజల సురేందర్ రెడ్డి, ఇతర కమిటీ సభ్యులు నంగునూరి వెంకట్ రమణ, పెరుకు శివ రామ్ ప్రసాద్, అనుపురం శ్రీనివాస్, కల్వ లక్ష్మణ్ రాజు, బొండుగుల రాము, జూలూరి సంతోష్ కుమార్, నడికట్ల భాస్కర్, రోజారమణి బొడ్ల, జూలూరి పద్మజ, కొల్లూరి శ్రీధర్, కరుణాకర్ గుత్తికొండ, ఆవుల శివ ప్రసాద్‌లు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా నంగునూరి వెంకట్ రమణ, గోనె నరేంద్ర, కల్వ రాజు, రోజా రమణి, పద్మజ, ప్రసాద్‌లు వ్యవహరించారు.



 



Advertisement
 
Advertisement
Advertisement