వైష్ణవి సమాధి వద్దే నిద్రపోతూ..! | Youtuber Vishnavi Brothers Slumber by Sisters Grave | Sakshi
Sakshi News home page

వైష్ణవి సమాధి వద్దే నిద్రపోతూ..!

Mar 20 2026 3:42 PM | Updated on Mar 20 2026 5:59 PM

Youtuber Vishnavi Brothers Slumber by Sisters Grave

జగిత్యాల:  అదొక అన్న ఆత్మ వేదన.. చెల్లెలు ఇక తిరిగిరాదని తెలిసినా ఆమె సమాధి వద్దే పడుకుని కన్నీళ్లు ఇంకిపోయేలా విలపిస్తున్న రోదన. ఇటీవల యూట్యూబర్‌ వైష్ణవి భర్త చేతిలో ప్రాణాలు కోల్పోయింది.  ఆ హృదయ విదారక ఘటనను తలుచుకుని వైష్ణవి అన్న సంతోష్‌ కుమిలిపోతున్నాడు. చెల్లెలు సమాధి వద్దే  నిద్రిస్తున్నాడు. తన చెల్లెలకు ఏమి ఇష్టమో దాన్ని తినిపించడానికి సమాధి వద్దే ఉంటున్నాడు. 

జీవితం ముగిసినా బంధం మాత్రం శాశ్వతం. నిద్రలోనూ చెల్లి జ్ఞాపకాలు.. అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి. చెల్లి సమాధి వద్ద అన్న నిద్రపోవడం అనేది కేవలం శరీర విశ్రాంతి కాదు, అది హృదయపు ఆవేదనకు ప్రతిరూపం. మట్టి కింద నిశ్శబ్దంగా ఉన్న చెల్లి జ్ఞాపకాలతో, అన్న కన్నీటి చుక్కలు రోదిస్తున్న తీరు వారి  మధ్య అనురాగపు బంధానికి నిదర్శనం.

చెల్లెలు ఇక రాదని తెలుసు. సమాధిలో ఉన్న చెల్లెలు పైకి లేచి రాదని తెలుసు. కానీ  చెల్లెలు ఇక లేదనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. వైష్ణవి ఇష్టంగా తినే అహారం సమాధివద్ద పెడుతున్నాడు సంతోష్‌. ఈ  హృదయ విదారక ఘటనను చూసి చుట్టపక్కల వారు సైతం కన్నీటి పర్యంతమవుతున్నారు.

వైష్ణవి హత్య కేసులో ముగ్గురి అరెస్ట్
కోరుట్ల మండలం మాదాపూర్‌లో మూడురోజుల క్రితం హత్యకు గురైన యూట్యూ బర్ వైష్ణవి ఘటనలో నిందితులైన హరిబాబు తల్లి చిత్తరి లక్ష్మి, సోదరులు చిత్తరి ఆనంద్, చిత్తరి ఆశో క్ ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

వైష్ణవిని హత్య చేసిన ఆమె భర్త చిత్తరి హరిబాబును ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ వైష్ణవి బంధు వులు గురువారం కోరుట్ల కొత్త బస్టాండ్ వద్ద ధర్నా కు దిగారు. ఫ్లకార్డులతో మాదాపూర్ నుంచి తర లివచ్చిన ఆమె తల్లిదండ్రులు, బంధువులు న్యా యం చేయాలని నినాదాలు చేశారు. దీంతో జాతీ య రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచి పోయింది. 

నాలుగు నెలల గర్భిణిని చంపిన భర్త 


 

Advertisement
 
Advertisement
Advertisement