‘తెలంగాణ మరో శ్రీలంక కాబోతోంది’ | BJP MP Bandi Sanjay Slams elangana Budget | Sakshi
Sakshi News home page

‘తెలంగాణ మరో శ్రీలంక కాబోతోంది’

Mar 20 2026 7:34 PM | Updated on Mar 20 2026 7:41 PM

BJP MP Bandi Sanjay Slams elangana Budget

కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌పై బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి  బండి సంజయ్‌ పెదవి విరిచారు. తెలంగాణ మరో శ్రీలంక కాబోతోందంటూ విమర్శించారు బండి సంజయ్‌. ‘ చిప్ప చేతికిచ్చే పాలన కాంగ్రెస్‌ది. మనది బిచ్చపు బతుకులేనా...?, ఇప్పుడు తెలంగాణా సమాజం ఆలోచించాల్సిన సమయం.. ఇది ప్రజలను వంచించే బడ్జెట్. అంకెల ఆర్భాటాలు, కేటాయింపుల ప్రగల్భాలే తప్ప ఒరిగేదేమీ లేదు. రైతుభరోసా విషయంలో రైతులు అమాయకులనుకుంటున్నాడు 

ముఖ్యమంత్రి. కేవలం పద్దెనిమిది వేల కోట్ల రూపాయిలు మాత్రమే కేటాయిస్తావా..?, ఆరు వాయిదాలకు నాల్గు వాయిదాలు మాత్రమే ఇస్తుండు. మిగిలిన రెండు వాయిదాలు ఎగ్గొట్టే ప్లాన్ వేసిండు. ఈ ఒక్కసారిచ్చి పాతదివ్వక, వచ్చేదివ్వక ఖేల్ ఖతం, దుకాణం బంద్ అంటుడు ఈ ముఖ్యమంత్రి. రైతుకూలీలకు 12 వేలిస్తామని చెప్పి ఏమైందిప్పుడు..?

బీఆర్ఎస్ చేసిన 8 లక్షల కోట్లు అప్పు తీరుస్తామన్నవాడు.. ఇంకా అదే పాట పాడుతున్నాడు.  ఆరు గ్యారంటీలు గాలికొదిలేసిండు ఈ సీఎం. ఇంకా లక్ష కోట్ల అప్పు చేస్తానని చెబుతుండు.. బీఆర్ఎస్ ఏం ఇచ్చిందని గాడ్ది గుడ్డు చూపిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా గాడ్ది గుడ్డు చూపించిండు’ అని ధ్వజమెత్తారు. 

Advertisement
 
Advertisement
Advertisement