సాక్షి, హైదరాబాద్: విద్యా విధానంలో కీలక మార్పులు తెస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానం ఉంటుందని.. ఇకపై టెన్త్ పరీక్షలు ఉండవంటూ స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న విద్యా విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ విద్యా విధానం అమలులోకి వస్తోందన్నారు. చిట్‌చాట్‌లో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏ గ్యారెంటీ ఎప్పుడు అమలు చేయాలో మా దగ్గర ప్రణాళిక ఉంది. గత ప్రభుత్వం అప్పులు తప్పులు కప్పిపుచ్చి పాలన చేసింది. ఆ తప్పులు మేం చేయలేం’’ అని రేవంత్ పేర్కొన్నారు. మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 3.47లక్షల కోట్ల అప్పులు చేశాం. కేసీఆర్ చేసిన అప్పు కట్టడానికే మేము అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ 26 నెలల్లో 3.3 లక్షల కోట్ల కేసిఆర్ చేసిన అప్పులే మేం కట్టాం. ఒక్క ఎకరాకు నీరు ఇవ్వకపోయినా 44 వేల కోట్ల కాళేశ్వరం అప్పు తీర్చాం. ఫోన్ ట్యాపింగ్ అరెస్టులు కొనసాగుతాయి. చట్టప్రకారమే ఫోన్ ట్యాపింగ్‌పై దర్యాప్తు జరుగుతోంది’’ అని రేవంత్ పేర్కొన్నారు.
‘‘డ్రగ్స్ కేసుపై బీజేపీ మౌనం ఎందుకు?. కేబినెట్ విస్తరణపై వార్తలు వచ్చిన ప్రతీ సారి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. కేబినెట్ విస్తరణ ఎప్పుడు చేయాలో నాకు తెలుసు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అవసరం ఉన్నప్పుడు చేస్తా. మూసీ పై ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. నదికి రెండు వైపులా 50 మీటర్ల చొప్పున మాత్రమే భూ సేకరణ చేస్తాం’’ అని రేవంత్ చెప్పారు.


