భట్టి బడ్జెట్‌.. అంతా బోగస్‌: హరీష్‌రావు | Harish Rao Reaction To Bhatti Vikramarka Budget | Sakshi
Sakshi News home page

భట్టి బడ్జెట్‌.. అంతా బోగస్‌: హరీష్‌రావు

Mar 20 2026 3:38 PM | Updated on Mar 20 2026 3:52 PM

Harish Rao Reaction To Bhatti Vikramarka Budget

సాక్షి, హైదరాబాద్‌: భట్టి బడ్జెట్‌ బోగస్‌ బడ్జెట్‌ అని అర్థమవుతోందని.. ఈ బడ్జెట్‌లో సకల జనులకు దక్కింది గుండు సున్నా అంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు మండిపడ్డారు. ‘‘మీ ప్రభుత్వంలో స్కాములు తప్ప.. స్కీములు ఉన్నాయా?. మూడేళ్లు కూడా నిండకముందే రూ.3 లక్షల కోట్లు అప్పు చేశారు. వెనుక ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చోపెట్టుకుని రాజ్యాంగ విలువలపై మాట్లాడటం సిగ్గుచేటు’’ అంటూ హరీష్‌రావు దుయ్యబట్టారు.

‘‘టెండర్ల మీద ఉన్న ప్రేమ పేదల మీద లేదు. పాలన గాడి తప్పడంతో తలసరి ఆదాయం తగ్గింది. బడ్జెట్‌ ప్రజల్ని తీవ్ర నిరాశపరిచింది. ఆరు గ్యారెంటీలకు నిధుల కేటాయింపు జరగలేదు. గత బడ్జెట్‌లో నిధులు కేటాయింపు చేసినా ఖర్చు చేయలేదు. తిరిగి ఈ బడ్జెట్‌లో అదే పాట పాడారు. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై శ్వేత పత్రం ఇవ్వాలని డిమాండ్‌ చేసినా.. పట్టించుకోలేదు. క్యూర్‌,ప్యూర్‌,రేర్‌ పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారు. తెలంగాణను మూడు ముక్కలు చేశారు. హైదరాబాద్‌ను మూడు ముక్కలు చేశారు. బడ్జెట్‌ అంతా బోగస్‌ అని తేలిపోయింది, ముచ్చటంతా మూడు ముక్కలాట కోసమే ఆరు గ్యారెంటీలపై లేదు’’ అని హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ సర్కార్ రోజుకో స్కాం అసెంబ్లీలో మొత్తం బయటపెడతా

Advertisement
 
Advertisement
Advertisement