గాంధీ పేరు తొలగింపుపై నిరసన
నల్లగొండ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించినందుకు నిరసనగా ఆదివారం నల్లగొండలో కాంగ్రెస్ శ్రేణులు నల్ల రిబ్బన్లు ధరించి, గాంధీ చిత్రపటాలతో ర్యాలీ నిర్వహించారు. రామగిరిలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. మోదీ ఫాసిస్టు ఆలోచనలు చేస్తున్నారని నినాదాలు చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్, మాధవి, సునీత, కన్నారావు, సుధాకర్, దేవదాస్, ముంతాజ్ అలీ, వెంకటయ్య, శ్రీనివాస్, కోటి, పరమేశ్, శివ, గౌతమ్, కిరణ్, వెంకటేశ్వర్లు, సోమన్న, స్వామి, వెంకన్న, రాజేందర్‌రెడ్డి, సాగర్‌రెడ్డి, పర్వతాలు, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, వెంకన్నగౌడ్ పాల్గొన్నారు.


