నేడు కొలువుదీరనున్న పంచాయతీ పాలకవర్గాలు
నేడు ప్రమాణ స్వీకారం
నిధులొస్తేనే అభివృద్ధి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : గ్రామ పంచాయతీలు సమస్యల సుడిగుండంలో ఉన్నాయి. 23 నెలల నుంచి గ్రామాల్లో పత్యేక అధికారుల పాలన కొనసాగుతుండడంతో.. ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. దీంతో కార్యదర్శులే అప్పులు చేసి గ్రామాల్లో అత్యవసర పనులు చేపట్టారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు ముగియడంతో.. సోమవారం కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. వారికి గ్రామాల్లోని పాత సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. గ్రామాల్లో పేరుకుపోయిన పలు సమస్యలు, అప్పుల చిట్టా, పెండింగ్ బిల్లులు చెల్లించడమే వారికి ప్రధాన సవాల్‌గా మారనుంది. ప్రభుత్వాలు కరుణించి ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తే.. కాస్త ఉపశమనం లభించనుంది.
866 పంచాయతీల్లో పాలకవర్గాలు
రాష్ట్ర వ్యాప్తంగా 2019లో గ్రామ పంచాతీయల ఎన్నికలు జరిగాయి. అదే ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన బాధ్యతల స్వీకరించిన పాలక వర్గాల కాల పరిమితి గతేడాది (2024) ఫిబ్రవరి 2వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. జిల్లాలో కొత్తగా ఏర్పడిన పంచాయతీలతో కలిసి 866 పంచాయతీల్లో ఈనెల 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది. వివిధ కారణాలతో మూడు పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోయాయి.
ఆగిపోయిన ఆర్థిక సంఘం నిధులు
జిల్లాలో 23 నెలల ప్రత్యేక అధికారుల పాలనతో అంతకుముందు 2, 3 నెలలకు సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు మాత్రమే విడుదలయ్యాయి. నిబంధల ప్రకారం పాలక వర్గాలు ఉంటేనే కేంద్రం ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది. పాలక వర్గాలు లేకపోవడంతో కేంద్రం నిధులను ఆపేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు ఇవ్వలేదు. దీంతో గ్రామ పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా మారిపోయింది. అటు సర్పంచ్‌లు చేసిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా, ఇటు పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వం చేపట్టిన ఏ ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు రాకపోవడంతో వారు అప్పుల పాలయ్యారు. పారిశుద్ధ్యం, వీధి లైట్ల మరమ్మతు, తాగునీటికి సంబంధించిన మోటార్ల మరమ్మతు, ట్రాక్టర్ల నిర్వహణ, డీజిల్ వంటి అత్యవసరమైన వాటికి అప్పులు తెచ్చి పనులు చేశారు. చివరకు కరెంట్ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. కొత్త పాలకవర్గాలు కొలువుదీరుతుండడంతో.. పాత బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత వారిపైనే పడనుంది.
ఫ కొత్త సర్పంచ్‌లకు సమస్యల స్వాగతం
ఫ నిధుల్లేక అస్తవ్యస్తంగా పల్లె పాలన
ఫ ప్రభుత్వాలు కరుణిస్తేనే..
గ్రామాల్లో అభివృద్ధి పనులు
నల్లగొండ : కొత్త పంచాయతీ పాలకవర్గాలు సోమవారం కొలువు దీరనున్నాయి. ఇటీవల పంచాయతీలకు ఎన్నికలు పూర్తయిన విషయం తెలిసిందే. జిల్లాలో 869 గ్రామపంచాయతీలకు గాను 866 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించారు. వీటి పరిధిలో సోమవారం గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు.. సర్పంచులు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆ తర్వాత గ్రామపంచాయతీ పాలకవర్గం మొదటి సమావేశం నిర్వహించనున్నారు.
ç³…^éĶæ$-¡ÌZÏ VýS™èl {糿¶æ$-™èlÓ… {糆 ¯ðlÌê MóS…{§ýl… C^óla BÆý‡-Šి£ýl®MýS çÜ…çœ$… °«§ýl$-ÌS-™ø Æ>çÙ‰ {糿¶æ$-™èlÓ… MýS*yé MýSÍí³ °«§ýl$-Ë$ CçÜ*¢ Ð]l_a…¨. ©…™ø _¯]l² ç³…^éĶæ$-†MìS Æý‡*.50 ÐólË$, ò³§ýlª ç³…^éĶæ$-¡ÌSMýS$ Æý‡*. 2 ÌS„ýSÌS ¯]l$…_ Æý‡*.3 ÌS„ýSÌS Ð]lÆý‡MýS$ {糆 ¯ðlÌê BĶæ* {V>Ð]l*-ÌZϰ f¯é¿ê¯]l$ ºsìæt °«§ýl$-ÌS¯]l$ C_a…¨. B °«§ýl$-ÌS-™ø {V>Ð]l$…-ÌZ AÀ-Ð]l–-¨® 糯]l$-ÌS¯]l$ ^ólÔ>Æý‡$. ´ëÌS-¯]l-ÌZ GÌê…sìæ Cº¾…-§ýl$-Ë$ G§ýl$-Æý‡$-M>Ìôæ§ýl$. ©…™ø ´ër$ G…ï³, GÐðl$ÃÌôæÅ C™èlÆý‡ °«§ýl$-Ë$ MýS*yé §é°MìS ™øyýl$-V> Ð]l^ólaÑ. §é…™ø {V>Ð]l*-ÌZÏ A°² AÀ-Ð]l–-¨® 糯]l$-Ë$ fÇVóSÑ. C糚yýl$ G°²MýS-Ë$ ç³NÇ¢ AƇ$$-¯]l…-§ýl$¯]l BǦMýS çÜ…çœ$… °«§ýl$-Ë$ Ð]lÝë¢-Ķæ$°, {ç³çÜ$¢™èl… MöË$Ð]l#-©Æó‡ Mö™èl¢ ´ëÌSMýS Ð]lÆ>Y-Ë$ ¿êÑçÜ$¢-¯é²Æ‡$$. AÑ Ð]lõÜ¢¯ól AÀ-Ð]l–-¨® 糯]l$-Ë$ Ð]l¬…§ýl$MýS$ ÝëVýS-¯]l$-¯é²Æ‡$$.
నేడు కొలువుదీరనున్న పంచాయతీ పాలకవర్గాలు


