కళతప్పిన పార్కులు | - | Sakshi
Sakshi News home page

కళతప్పిన పార్కులు

Apr 19 2025 9:40 AM | Updated on Apr 19 2025 9:40 AM

కళతప్

కళతప్పిన పార్కులు

అన్ని మున్సిపాలిటీల్లోనూ నిర్వహణ లోపం

ఆహ్లాదం పంచని పార్క్‌లు

దేవరకొండ: దేవరకొండ మున్సిపల్‌ పరిధిలో గత ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రగతి నిధులతో మూడు చోట్ల చిల్డ్రన్‌ ప్లే పార్కులు ఏర్పాటు చేశారు. చిన్నారులు ఆడుకుంనేందుకు వివిధ ఆట పరికరాలు సమకూర్చారు. ఆహ్లాదాన్ని పంచేలా చెట్లను పెంచారు. ఏర్పాటు చేసిన కొన్ని రోజుల పాటు బాగానే ఉన్నా.. నిర్వహణ లోపంతో నేడు ఆహ్లాదం కరువైంది. సంజయ్‌కాలనీ, ముత్యాలమ్మ బజార్‌ పార్క్‌ల్లో ఆటవస్తువులు కొన్ని ధ్వంసం కాగా చెత్తా చెదారంతో నిండి ఉన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు పరికరాలను ధ్వంసం చేస్తుండడంతో నిర్వహణ కష్టతరంగా ఉందని మున్సిపల్‌ అధికారులు పేర్కొంటున్నారు.

మున్సిపల్‌ పార్కులు వెలవెలబోతున్నాయి. నిర్వహణ లోపానికితోడు పిల్లలు ఆడుకునేందుకు వివిధ రకాలు వస్తువులు లేకపోవడంతో వాటివైపు ఎవరూ వెళ్లడం లేదు. కొన్నిచోట్ల ఇదివరకు ఏర్పాటు చేసిన ఆట వస్తువులు ధ్వంసమయ్యాయి. పచ్చదనం కోసం నాటిన మొక్కలు ఎండిపోయి ఆహ్లాదం కరువైంది. మరికొన్ని చోట్ల పార్కులకు జనం వస్తున్నా వసతులు కరువయ్యాయి. ఉదయం పూట కొన్ని పార్కుల్లోనే జనం వాకింగ్‌కు వెళ్తున్నారు. మిగతా వాటికి జనం పెద్దగా రావడం లేదు. ఫలితంగా పార్కులు కళతప్పాయి. ఈ విషయాలు ‘సాక్షి’ విజిట్‌లో వెలుగుచూశాయి.

ఫ విరిగి మూలకుపడిన ఆట వస్తువులు ఫ ఎండిన గ్రీనరీ.. కనిపించని పచ్చదనం

ఫ చిన్నారులకు కరువైన ఆహ్లాదం ఫ వాటివైపు వెళ్లని పట్టణ వాసులు

కళతప్పిన పార్కులు 1
1/3

కళతప్పిన పార్కులు

కళతప్పిన పార్కులు 2
2/3

కళతప్పిన పార్కులు

కళతప్పిన పార్కులు 3
3/3

కళతప్పిన పార్కులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement