బిహార్ సీఎం ప్రవర్తన తీరు దేశానికే అవమానకరం
రామగిరి(నల్లగొండ): ముస్లిం మహిళా డాక్టర్ హిజాబ్‌ను లాగిన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బహిరంగ క్షమాపణ చెప్పాలని జమీయత్ ఉలేమా ఏ హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా సయ్యద్ ఎహేసానుద్దీన్ ఖాస్మీ డిమాండ్ చేశారు. సోమవారం నల్లగొండలోని క్లాక్ టవర్ సెంటర్‌లో ముస్లింలు, మైనారిటీ సంఘాల నాయకులు నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఒక ముఖ్యమంత్రి ఇలా ప్రవర్తించడం దేశానికే అవమానకరమన్నారు. ఈ నిరసన కేవలం ముస్లిం మహిళల గౌరవం కోసమే కాకుండా దేశంలోని ప్రతి మహిళ స్వేచ్ఛ కోసం జరుగుతున్న పోరాట మన్నారు. కార్యక్రమంలో జమియత్ ఉలేమా ఏ హింద్ జిల్లా కార్యదర్శి మౌలానా అక్బర్ ఖాన్, మౌలానా యాసిర్, ఎండీ అఫ్జల్ ఉద్దీన్, ఫుర్ ఖాన్, సీపీఎం నాయకుడు ఎండీ సలీం, మహబూబ్ అలీ, ఎండీ మాజీబుద్దీన్, కౌన్సిలర్ అమీర్, లతీఫ్ పాషా, ఐద్వా మహిళా నాయకులు పాల్గొన్నారు.


