విద్యార్థులకు కంటి పరీక్షలు
విద్యార్థులందరూ కంటి పరీక్షలు చేయించుకోవాలి
నల్లగొండ టౌన్ : విద్యార్థుల్లో దృష్టి లోపం నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తోంది. రాష్ట్రీయ బాల స్వస్థ్ కార్యక్రమం ద్వారా కంటి పరీక్షల శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించారు. మొదటిరోజున 1,166 మంది బాలబాలికలకు కంటి పరీక్షలు చేశారు. 105 బాలికలు, ఆరుగురు బాలురకు కంటి అద్దాలు అవసరమని గుర్తించి ఇంటెంట్ పెట్టారు.
జిల్లాలో 89,873 మంది విద్యార్థులు
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 89,873 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో బాలురు 43,688 మంది, బాలికలు 46,185 మంది ఉన్నారు. వారందరికీ కంటి పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఏడు నుంచి ఎనిమిది వైద్య బృందాలను నియమించింది. ఒక్కో బృందంలో కంటి వైద్య నిపుణుడితో పాటు ఆప్తాలమిస్టు ఇతర సిబ్బంది ఉన్నారు. సోమవారం నుంచి ప్రారంభమైన వైద్య శిబిరాలు సెలవు దినాలు మినహాయించి అన్ని పాఠశాలల్లో పనిదినాల్లో నిర్వహిస్తారు. ఫిబ్రవరి 24 వరకు శిబిరాలు కొనసాగనున్నాయి.
ఫ పాఠశాలల్లో ప్రారంభమైన
కంటి వైద్య శిబిరాలు
ఫ మొదటిరోజు 1,166 మందిని
పరీక్షించిన వైద్యులు
ఫ అవసరం ఉన్నవారికి
ఉచితంగా అద్దాల పంపిణీ
ఫ ఫిబ్రవరి 24 వరకు
కొనసాగనున్న క్యాంపులు
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులందరూ తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలి. అవసరం ఉన్నవారికి ఉచితంగా కంటి అద్దాలు అందజేస్తారు.
– డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీఎంహెచ్‌ఓ
విద్యార్థులకు కంటి పరీక్షలు


