ఆ దమ్ము ప్రభుత్వానికి ఉందా?.. ఎస్‌ఎల్‌బీసీపై జగదీష్‌రెడ్డి షాకిం​గ్‌ కామెంట్స్‌ | Jagadish Reddy Comments On Revanth Government | Sakshi
Sakshi News home page

ఆ దమ్ము ప్రభుత్వానికి ఉందా?.. ఎస్‌ఎల్‌బీసీపై జగదీష్‌రెడ్డి షాకిం​గ్‌ కామెంట్స్‌

Apr 13 2025 4:06 PM | Updated on Apr 13 2025 4:18 PM

Jagadish Reddy Comments On Revanth Government

సాక్షి, నల్గొండ జిల్లా: ఎస్‌ఎల్‌బీసీని శాశ్వతంగా మూసేస్తున్నారని.. సొరంగంలో ఉన్న మృతదేహాలను తీసుకొచ్చే దమ్ము లేదంటూ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఈ నెల‌ 27న వరంగల్ సభ నేపథ్యంలో నల్లగొండలో బీఆర్ఎస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణా నీళ్ల విషయంలో‌ ప్రభుత్వం దద్దమ్మలా మారిందన్నారు.

‘‘మిర్యాలగూడలో రైతులపై మిల్లర్లు దాడి చేస్తున్నారు. కేసీఆర్ పాలన పోవడంతో నల్లగొండ జిల్లా అనాథలా మారింది. మిల్లర్ల వద్ద కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లంచాలు తీసుకున్నాడు. అందుకే మద్దతు ధర ఇవ్వడం లేదు. కాంగ్రెస్ పార్టీకి కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లు, మిల్లర్లే కనిపిస్తున్నారు. చంద్రబాబు నీళ్లు తరలించుకుపోతుంటే కాంగ్రెస్‌కు సోయి లేదు’’ అంటూ జగదీష్‌రెడ్డి ధ్వజమెత్తారు.

 

Advertisement
 
Advertisement
Advertisement