నల్లగొండ టౌన్ : కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నల్లగొండలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. అనంతరం నిరసన తెలుపుతున్న నాయకులను పోలీసులు అరెస్టు చేసి వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం, వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండెంపల్లి సరోజ, సయ్యద్ హశం, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, అవుట రవీందర్, నలపరాజు సైదులు, పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, కొండా అనురాధ, కొండ వెంకన్న, అద్దంకి నరసింహ, గంజి రాజేష్, కత్తుల యాదయ్య, సుంకరబోయిన వెంకన్న, సాగర్ల మల్లయ్య, నర్సిరెడ్డి, రాము తదితరులు పాల్గొన్నారు.


