చండూరు : ప్రజా సమస్యలపై పోరాడడమే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ గంగిడి మనోహర్‌రెడ్డి అన్నారు. శనివారం చండూరులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను స్థానిక ఎమ్మెల్యేలు.. బీజేపీ సర్పంచ్‌లు, కౌన్సిలర్లకు మంజూరు చేయకపోవడం శోచనీయమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పనిచేయాలని లేనిపక్షంలో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి ప్రతీ కార్యకర్త ప్రజాక్షేత్రంలో పనిచేసి రాష్ట్రంలో బీజేపీని అదికారంలోకి తీసుకురావాలన్నారు. సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు ముదిగొండ ఆంజనేయులు, భూతరాజు శ్రీహరి, దోనూరి వీరారెడ్డి, కర్నాటి ధనుంజయ, కోమటి వీరేశం, బొమ్మరబోయిన రాజు, జక్కల రాజు, సోమ నరసింహ, వరికుప్పల గిరి, నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


