నల్లగొండ టౌన్ : ఎస్సీ వర్గీకరణ అనంతరం మాలలు, మాల అనుబంధ కులాలకు విద్య, ఉద్యోగాలు, పదోన్నతుల్లో అన్యాయం జరుగుతోందని జాతీయ మాలమహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్నారు. ఎస్సీ రోస్టర్ విధానాన్ని సవరించకపోతే ఆగస్టు 31న మాలల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామన్నారు. నల్లగొండలోని క్లాక్‌టవర్ వద్ద మాలమహానాడు జాతీయ స్టీరింగ్ కమిటీ సభ్యుడు గోలి సైదులు అధ్యక్షతన నిర్వహించిన మహా ధర్నాలో పిల్లి సుధాకర్ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ అనంతరం గ్రూప్–3లోని మాల, అనుబంధ కులాల విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాల జేఏసీ కన్వీనర్ సర్వయ్య మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన హక్కులను పరిరక్షించుకునేందుకు మాలలు ఐక్యంగా పోరాడాలన్నారు. కార్యక్రమంలో మాలమహానాడు ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు కొండబాబు, జిల్లా అధ్యక్షుడు బోగరి విజయ్, నల్లవెల్లి నల్లల కనకరాజు, మేడి అంజయ్య, వెన్న రాజు, బుట్టి సత్యనారాయణ, సర్వే సార్, గోరేటి రమేష్, కట్ట వినయ్, చింతమల్ల విజయ్‌కుమార్, వల్లం రవి, రాగుల రాఘవులు, గుబ్బల ఆదినారాయణ, మణెమ్మ, రావుల శ్రీనివాస్, గాజుల భాస్కర్ పాల్గొన్నారు.
ఫ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్


