రోడ్డు విస్తరణ చేపట్టాలని నిరాహార దీక్ష | - | Sakshi
Sakshi News home page

రోడ్డు విస్తరణ చేపట్టాలని నిరాహార దీక్ష

Aug 11 2026 2:12 AM | Updated on Aug 11 2026 2:12 AM

నార్కట్‌పల్లి : మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని కోరుతూ బీజేపీ మండల అధ్యక్షుడు మెడబోయిన శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సోమవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ నాయకుడు గోలి మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నకిరేకంటి మొగులయ్య నూకల వెంకటనారాయణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగస్వామి మాట్లాడుతూ.. మంత్రి కోమటిరెడ్డి స్పందించి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించాలని.. లేకుంటే తన పదవికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మేడబోయిన శ్రీనివాస్‌, జిల్లా కౌన్సిల్‌ మెంబర్‌ నడింపల్లి శ్రవణ్‌ కుమార్‌ జిల్లా కార్యవర్గ సభ్యుడు మునుకుంట్ల గణేశ్‌, మండల ప్రధాన కార్యదర్శి బిల్లకంటి శ్రీకాంత్‌, పాలకూరి రమేష్‌, కొరివి శంకర్‌, పసునూరి సంపత్‌, తరాల శ్రీనివాస్‌, పాల్వాయి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement