1,59,280 ఓట్లు గల్లంతే! | - | Sakshi
Sakshi News home page

1,59,280 ఓట్లు గల్లంతే!

Aug 11 2026 2:12 AM | Updated on Aug 11 2026 2:12 AM

నల్లగొండ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ సోమవారంతో ముగిసింది. జిల్లాలో మొత్తం 15,16,253 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 13,56,973 మంది ఓటర్లకు సంబంధించిన ఎన్యుమరేషన్‌ ఫారాలు మాత్రమే డిజిటలైజ్‌ అయ్యాయి. దీంతో జిల్లాలో ఇప్పటివరకు 89.50 శాతం డిజిటలైజేషన్‌ పూర్తయింది. మరో 1,59,280 ఫారాలు.. అంటే 10.50 శాతం డిజిటలైజేషన్‌కు నోచుకోలేదు. డిజిటలైజ్‌ కాని 1,59,280 ఫారాల భవితవ్యం ఇప్పుడు కీలకంగా మారింది. ఈ ఓట్లు తొలగిపోతాయని తెలుస్తోంది.

1,714 పోలింగ్‌ కేంద్రాల్లో 100 శాతం పూర్తి..

జిల్లాలో మొత్తం 1,812 పోలింగ్‌ స్టేషన్లు ఉండగా.. 1,714 పోలింగ్‌ స్టేషన్లలో 100 శాతం డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తయింది. మరోవైపు మొత్తం జిల్లాస్థాయిలో 1,59,280 ఫారాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటల ప్రోగ్రెస్‌ రిపోర్టు వెల్లడించింది.

యూఈఎఫ్‌గా నమోదు

ఇంటింటి సర్వే సమయంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, మృతి చెందినవారు లేదా అందుబాటులో లేని ఓటర్ల కారణంగా ఏయే ఇళ్లకు, వ్యక్తులకు ఎన్యూమరేషన్‌ ఫారాలు అందలేదో, ఇచ్చిన ఫారాలు తిరిగి రాలేదో.. ఆ వివరాలను ఎన్నికల యంత్రాంగం యూఈ ఎఫ్‌గా కింద లెక్కించింది. ఈ జాబితాలో 1,59,280 ఓట్లు ఉన్నా యి. ఈ ఓట్లకు సంబంధించిన కారణా లు తదుపరి పరిశీలనలో తేలనున్నాయి.

ఫ ముగిసిన సర్‌ ప్రక్రియ..

ఫ 15.16 లక్షల ఓటర్లలో 13.56 లక్షల ఫారాల డిజిటలైజ్‌

ఫ 10.50 శాతం ఎన్యుమరేషన్‌ ఫారాలు పెండింగ్‌

జిల్లాలో సర్‌ ప్రక్రియ ఇలా..

నియోజకవర్గం మొత్తం ఓటర్లు డిజిటలైజ్‌ శాతం పెండింగ్‌

దేవరకొండ 2,69,098 2,32,197 86.29 36,901

నాగార్జునసాగర్‌ 2,34,722 2,13,407 90.92 21,315

మిర్యాలగూడ 2,40,574 2,09,003 86.88 31,571

నల్లగొండ 2,49,571 2,17,494 87.15 32,077

మునుగోడు 2,63,757 2,46,509 93.46 17,248

నకిరేకల్‌ 2,58,531 2,38,363 92.20 20,168

మొత్తం 15,16,253 13,56,973 89.50 1,59,280

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement