వరుణుడు కరుణించి రైతులు మురవాలని పూజలు | - | Sakshi
Sakshi News home page

వరుణుడు కరుణించి రైతులు మురవాలని పూజలు

Aug 11 2026 2:18 AM | Updated on Aug 11 2026 2:18 AM

న్యూస్‌రీల్‌

పూర్ణాహుతి ఘట్టం..

25 కిలోలు.. రూ.1900
నాణ్యమైన పాత సన్న బియ్యం 25 కిలోల బస్తా ధర రూ.1,750 నుంచి రూ.1,900 వరకు పలుకుతోంది.

మరింత అభివృద్ధి చేయాలి

కాంగ్రెస్‌ పాలనలో యాదగిరిగుట్టను మరింత అభివృద్ధి చేయాలని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు.

మంగళవారం శ్రీ 11 శ్రీ ఆగస్టు శ్రీ 2026

- 8లో

నాగార్జునసాగర్‌ : వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు మురవాలని ప్రభుత్వం సోమవారం నాగార్జునసాగర్‌ కృష్ణాతీరంలో మహావరుణ యాగం చేపట్టింది. కృష్ణమ్మ ఒడ్డున విజయవిహార్‌ ప్రాంగణం ఉదయం నాలుగు గంటల నుంచే వేద పండితుల మంత్రోచ్ఛరణలతో మార్మోగింది. రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి నదులు పరవళ్లు తొక్కాలని, జలాశయాలు, చెరువులు, కుంటలు నిండాలని ఆకాంక్షిస్తూ చేపట్టిన వరుణయాగం తెల్లవారు జామున 4.05 గంటలకు భారీనీటి పారుదల శాఖామంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతులు గోవుపూజ, యాగశాల ప్రదక్షిణతో మొదలైంది. 108 మంది రుత్విక్కు లు 11 హోమగుండాల్లో శాస్త్రోక్తంగా వైదిక క్రతువులను నిర్వహించారు. యాగంలో ప్రధాన ఘట్టమైన పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు పాల్గొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వరుణుడిని ప్రసన్నం చేసుకునే సంకల్పంతో..

సనాతన హిందూ సంప్రదాయంలో యజ్ఞయాగాలకు విశిష్ట స్థానం ఉంది. వేదకాలం నుంచే వర్షాలకు అధిపతిగా భావించే వరుణ దేవుడిని ఆరాధి స్తూ ప్రత్యేక క్రతువులు నిర్వహించే సంప్రదాయం ఉంది. ఇదే సంప్రదాయంలో భాగంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రభుత్వం ఈ మహావరుణ యాగాన్ని చేపట్టింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనకుండా, రైతులకు సాగునీరు అందుబాటులో ఉండేలా వర్షాలు సమృద్ధిగా కురవాలని, రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు పెరగాలని, యాగం సందర్భంగా సంకల్పించారు.

11 హోమ గుండాల్లో వైదిక క్రతువులు

విజయవిహార్‌ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 11 హోమగుండాలు యాగానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.108 మంది రుత్విక్కులు వైదిక విధానాలను అనుసరిస్తూ మత్రోచ్ఛరణలతో హోమ క్రతువు నిర్వహించారు. హోమగుండాల్లో పవిత్ర ద్రవ్యాలను సమర్పిస్తూ వరుణ దేవుడిని ఆరాధించారు. యాగశాల చుట్టూ దేవతా విగ్రహాలు, కలశాలు, పుష్పాలంకరణలు ఏర్పాటు చేయడంతో వాతావరణం మరింత శోభాయమానంగా కనిపించింది.

కలశ ఇష్టికి ప్రత్యేక ప్రాధాన్యం

వరుణ యాగంలో కలశ ఇష్టికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందని వేద పండితులు తెలిపారు. వరుణ దేవుడిని ఆహ్వానిస్తూ నిర్ధిష్ట మంత్రోచ్ఛరణలతో ఆహుతులు సమర్పించడం, కలశాలను పవిత్ర జలంతో సిద్ధం చేసి పూజించడం వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూజాసామగ్రి, పండ్లు, పుష్పాలు, ధాన్యాలు తదితరాలతో హోమగుండాల చుట్టూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ప్రజలు వీక్షించేలా ఎల్‌ఈడీ తెరలు

యాగశాలలో జరుగుతున్న వైదిక కార్యక్రమాలను ప్రజలు ప్రత్యక్షంగా తిలకించేలా విజయవిహార్‌ ప్రాంగణంలో ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. యాగశాలలోకి ప్రవేశించలేని భక్తులు, ప్రజలు కూడా పూర్ణాహుతి కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. యాగం సందర్భంగా భద్రత, పార్కింగ్‌, తాగునీరు తదితర సౌకర్యాలను అధికారులు సమకూర్చారు. యాగం సందర్భంగా భద్రత, పార్కింగ్‌, తాగునీరు తదితర సౌకర్యాలను అధికారులు సమకూర్చారు. పూజల్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, పి.సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బీర్ల అయిలయ్య, కుందూరు జైవీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, బాలునాయక్‌, మందుల సామేలు, మురళీనాయక్‌, రాంచంద్రనాయక్‌, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ గద్వాల విజయలక్ష్మి, డెయిరీ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ గుత్తా అమిత్‌రెడ్డి, దేవాదాయ శాఖ డైరెక్టర్‌ హన్మంతరావు, నల్లగొండ కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌, డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్‌ నేత, యాదగిరిగుట్ట ఆలయ ఈఓ భవానీశంకర్‌ పాల్గొన్నారు.

ఫ ప్రధాన ఘట్టమైన పూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు

ఫ 108 మంది రుత్విక్కులతో 11 హోమగుండాల్లో వైదిక క్రతువులు

ఫ వేద మంత్రోచ్ఛరణలతో మార్మోగిన ప్రాంగణం

యాగంలో చివరి ఘట్టమైన మహాపూర్ణాహుతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రుత్విక్కులు వేద మంత్రాలను పఠిస్తూ పూర్ణాహుతి ద్రవ్యాలను హోమాగ్నికి సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు యాగశాలలో పాల్గొని రుత్విక్కుల సూచనల మేరకు పూర్ణాహుతి నిర్వహించారు. యాగం విజయవంతంగా పూర్తయి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురువాలని ప్రార్థనలు చేశారు.

వరుణయాగం సాగిందిలా..

పెద్దవూర : వేకువజామున 4.05 గంటలకు గోపూజతో మహా వరుణయాగం

ప్రారంభమైది.

రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి కోదాడ ఎమ్యెల్యే పద్మావతి దంపతులు యాగం ప్రారంభం నుంచి యాగ క్రతువులో పాల్గొన్నారు.

4.45 గంటలకు శాంతి మంత్ర పఠనం గావించారు.

6.30 గంటల వరకు విఘ్నేశ్వర పూజ, స్వస్తివాచకం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, అఖండ దీపారాధనలు చేశారు.

6.30 నుంచి 9 గంటల వరకు అంకురారోహణం, చతుర్‌ మండల స్థాపనాలు, సర్వదాభద్ర మండల స్థాపనలు చేశారు.

11.45 గంటల వరకు అన్ని దేవాలయాల రుత్వికులతో లక్ష వరుణ జపాలు, లక్ష రుశ్యశృంగ జపం, క్షీరతర్ఫణం చేశారు.

మధ్యాహ్నం 2.30 గంటల వరకు వేద పండితులతో చతుర్వేద పారాయణం, శాతానువాక, వారానువాక పారాయణం నిర్వహించారు.

3.15 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన సతీమణి గీతారెడ్డి దంపతులు యాగశాల వద్దకు వచ్చారు.

3.25 గంటలకు పూర్ణాహుతి సమర్పణ, హారతి.

3.46 గంటలకు యాదాద్రి దేవస్థానం సిద్దాంతి సత్యనారాయణ శర్మ ప్రసంగంతో మహా వరుణయాగం ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement