వివాహేతర సంబంధం.. భార్య కళ్లెదుటే ప్రియుడ్ని.. | Wife And Husband Arrested In Peddapalli Agricultural Market Death Incident, More Details Inside | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం.. భార్య కళ్లెదుటే ప్రియుడ్ని..

Apr 30 2025 6:57 AM | Updated on Apr 30 2025 9:09 AM

Peddapalli Agricultural Market Incident

 వివరాలు వెల్లడించిన ఏసీపీ కృష్ణ

పెద్దపల్లిరూరల్‌: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో సోమవారం పొలం కుమార్‌ను హతమార్చిన కేసులో నిందితులు వేల్పుల సంతోష్‌, వేల్పుల శైలజను మంగళవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. విలేకరుల సమావేశంలో వివరాలను ఏసీపీ గజ్జి కృష్ణ వెల్లడించారు. కొన్నిరోజులుగా కుమార్‌తో శైలజ సన్నిహితంగా ఉండడాన్ని చూసి వివాహేతర ఉందని సంతోష్‌ అనుమానించాడు. పద్ధతి మార్చుకోవాలని శైలజను మందలించాడు. 

అయితే తన వెంటపడుతూ ఇబ్బంది పెడుతున్నాడని ఆమె చెప్పడంతో కుమార్‌పై సంతోష్‌ కోపం పెంచుకున్నాడు. అయితే బంధువుల వద్ద శైలజతో సంబంధం ఉందని కుమార్‌ చెబుతున్నాడు. శైలజకు కూడా ఫోన్లు చేస్తుండడంతో కుమార్‌ను చంపాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈక్రమంలో సోమవారం మాట్లాడుకుందాం రమ్మని కుమార్‌కు ఫోన్‌చేసి చెప్పడంతో వ్యవసాయమార్కెట్‌కు కారులో చేరుకున్నాడు. ఈలోగా పెద్దపల్లికి వచ్చిన సంతోష్‌.. జెండా వద్ద ఓ కత్తిని కొనుగోలు చేసి భార్య శైలజకు కుమార్‌ను చంపుదామనే విషయాన్ని చెప్పాడు.

 శైలజ దొంగతుర్తి నుంచి బస్సులో పెద్దపల్లికి చేరుకోగా.. ఆమెను బైక్‌పై తీసుకుని మార్కెట్‌ యార్డుకు చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు కుమార్‌, సంతోష్‌ గొడవపడ్డారు. ఆ సమయంలోనే తన వద్ద ఉన్న కత్తి తీసి మెడ, చాతి, ముఖంపై పొడిచి చంపారు. కుమార్‌ చనిపోయాడని నిర్ధారించుకుని నిందితులు పరారయ్యారు. ఈమేరకు నిందితులైన భార్యాభర్తలు సంతోష్‌, శైలజు దొంగతుర్తిలో ఉన్నారనే సమాచారంతో అక్కడకు వెళ్లి పోలీసులు అరెస్టు చేశారు. సమావేశంలో సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్సై మల్లేశ్‌ పాల్గొన్నారు.

వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్‌ వచ్చిందని..!


 

 

 

Advertisement
 
Advertisement
Advertisement