మామిడి చెట్లు కూలిపోయాయి | - | Sakshi
Sakshi News home page

మామిడి చెట్లు కూలిపోయాయి

Apr 19 2025 9:40 AM | Updated on Apr 19 2025 9:40 AM

మామిడ

మామిడి చెట్లు కూలిపోయాయి

వడగండ్ల వర్షంతో పెను నష్టం జరిగింది. మామిడి చెట్లు కూలిపోయాయి. రెండు వేలపైనే మామిడి కాయలు రాలిపోయాయి. రాలిన కాయలన్ని పండుబారడంతో పారబోశాం. ప్రతి ఏటా మామిడి తోటల నుంచి వచ్చే రాబడిపైనే మా కుటుంబం ఆధారపడి ఉంది. ఇప్పుడు చెట్లు కూలిపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.

– కరెంద జానకిరాములు, ఓగోడు

ప్రభుత్వం ఆదుకోవాలి

నాకున్న ఏడెకరాల్లో నిమ్మతోట వేశా. 480 నిమ్మచెట్లు ఉన్నాయి. నిమ్మకాయ తెంచే దశలో వచ్చిన భారీ ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షానికి చేతికందే నిమ్మకాయ నేలరాలింది. ఈదురుగాలులకు తోటలోని 132 నిమ్మచెట్లు నేలకూలాయి. చివరకు అప్పులే మిగిలాయి. ప్రభుత్వం ఆదుకోవాలి.

– జేరిపోతుల చంద్రమౌళి, మాధారంకలాన్‌

మామిడి చెట్లు కూలిపోయాయి
1
1/1

మామిడి చెట్లు కూలిపోయాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement