క్రీస్తు బోధనలు అనుసరణీయం
రామగిరి(నల్లగొండ) : క్రీస్తు బోధనలు ప్రపంచానికి సేవాగుణాన్ని నేర్పించాయని, అవి మనకు అనుసరణీయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాకేంద్రంలోని సెంటినరీ బాప్టిస్టు చర్చిలో గురువారం జరిగిన క్రిస్మస్ వేడుకలకు మంత్రి హాజరై కేక్ కట్ చేశారు. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఏసుక్రీస్తు బోధనలు మనకు ప్రేమ, శాంతి, త్యాగం, సేవా భావాన్ని గుర్తుచేస్తాయన్నారు. ఏసు ప్రభువు కృపతో ప్రజలంతా ఆనందంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో చర్చి పెద్దలు క్రిస్టోఫర్, బెనర్జీ, విలియమ్స్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, పశల శౌరయ్య తదితరులు పాల్గొన్నారు.
సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చింది
సోనియాగాంధీ వల్లే తెలంగాణ రాష్ట్ర వచ్చిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ క్రిస్మస్ వేడుకలకు హాజరైన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది యువకులు బలిదానాలకు పాల్పడుతుంటే చలించిన సోనయాగాంధీ ఆమె పుట్టిన రోజు డిసెంబర్ 9న రాష్ట్రాన్ని ప్రకటిచిందన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 75 శాతం సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు గెల్చుకోవడం శుభపరిణామన్నారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఫార్మసీ, లా కోర్సులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఫ మంత్రి కోమటిరెడ్డి
ఫ నల్లగొండలో క్రిస్మస్
వేడుకలకు హాజరు


