నేర నిరూపణలో బెస్ట్
గంజాయిపై ఉక్కుపాదం
షీటీమ్స్ సహాయంతో..
నల్లగొండ : నేరాల నిరూపణలో నల్లగొండ పోలీసులు ది బెస్ట్‌గా నిలిశారు. ఫోనెన్సిక్ డిజిటల్ ఆధారాలతో వివిధ నేరాలను నిరూపించి నిందితులకు జీవిత ఖైదుతోపాటు మరణ శిక్షలు పడేలా ఎంతో కృషిచేశారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది మొత్తంగా నేరాల సంఖ్య తగ్గింది. 2024–25 సంవత్సరంలో జరిగిన నేరాల వివరాలను బుధవారం నల్లగొండలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ శరత్‌చంద్ర పవార్ వెల్లడించారు. ఆయన వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి..
132 మంది నేరస్తులకు శిక్షలు
జిల్లాలో 2024–2025 సంతవ్సంలో వందలాది కేసుల్లో ఫోరెన్సిక్ డిజిటల్ ఆధారాలు సేకరించడంతో 132 మంది నేరస్తులకు శిక్షలు పడ్డాయి. గతేడాది మాత్రం కేవలం 65 మందికే శిక్షలు పడ్డాయి. ఈ ఏడాది పడిన శిక్షల్లో మరణ శిక్షలు, జీవిత ఖైదు, 14 ఏళ్లు, ఏడేళ్లు, ఏడాదికిపైగా శిక్షలు పడ్డాయి. ప్రధానంగా పలు విషయాల్లో గతేడాది 62 కేసులు నమోదు కాగా, ఈ సంవత్సరం 55 కేసులకు తగ్గాయి. 24 మర్డర్ కేసులను ఛేదించాం.
లోక్ అదాలత్‌లో పెండింగ్ కేసులు పరిష్కారం
జిల్లా పోలీస్ శాఖ వివిధ కేసులకు సంబంధించి లోక్‌అదాలత్‌లో గతేడాది 18,257 కేసులు పరిష్కారం కాగా, ఈ సంవత్సరం 49,943 కేసుల పరిష్కారమయ్యాయి. దీంతో పెండింగ్ కేసులు భారీగా తగ్గాయి. గతేడాదిలో 700 ఆస్తినేరాల కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం 637కు తగ్గాయి. మహిళలపై జరిగిన నేరాల్లో కేసులు స్వల్పంగా పెరిగాయి. గతేడాది 684 కేసులు నమోదు కాగా 703కు చేరాయి. వరకట్న హత్యకేసులు రెండే నమోదయ్యాయి. ఆత్మహత్య ప్రేరేపణ కేసులు తటస్థంగా ఉన్నాయి. మహిళా వేధింపు కేసులు గతంలో 313 నమోదు కాగా ఈ సంవత్సరం 346కు పెరిగాయి. మహిళల హత్య కేసులు 9 నుంచి 11కు పెరిగాయి. హత్యాచార కేసులు 101నుంచి 87కు తగ్గాయి. మహిళల అపహరణ కేసులు 26 నుంచి 27కు పెరిగాయి. లైంగిక వేధింపుల కేసులు 216 నుంచి 196కు తగ్గాయి. పోక్సో చట్టం కింద గతేడాది 121, ఈఏడాది 117కేసులు నమోదయ్యాయి.
స్వల్పంగా పెరిగిన సైబర్ నేరాలు
గతేడాదితో పోలిస్తే సైబర్ నేరాలు స్వల్పంగా పెరిగాయి. 2024లో 235 కేసులు నమోదు కాగా బాధితులు పోగొట్టుకున్న రూ.16.31 కోట్లలో రూ.1.25 కోట్లు రికవరీ చేశాము. ఈ ఏడాది 255 కేసుల్లో రూ.4.62 కోట్లకు రూ.1.48 కోట్లు బాధితుల ఖాతాల్లో జమ చేశాం.
పక్కాగా రోడ్డు ప్రమాదాల నివారణ
జిల్లాలో గతేడాది 109 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 1,197 మంది గాయాలపాలయ్యారు. ఈ సంవత్సరం 87 ప్రమాదాల్లో 1,078మంది గాయాలపాలయ్యారు. ఎంవీ యాక్టు కేసులు 2024లో 1,58,138 కేసులు నమోదు కాగా రూ.5.33 కోట్లు జరిమానా విధించాం. ఈ సంవత్సరం 2,13,137 కేసులు నమోదు కాగా రూ.5.48 లక్షల జరిమానా విధించాం. ఆపరేషన్ స్మైల్ అండ్ ముస్కాన్ గతేడాది బాల కార్మికులు కేసులు 102 నమోదు కాగా ఈ ఏడాది 151 కేసులు నమోదు అయ్యాయి. తద్వారా 205 మంది బాల కార్మికులకు వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించారు.
జిల్లా పోలీస్ శాఖ గంజాయిపై ఉక్కుపాదం మోపింది. గతేడాది 108 కేసులు నమోదు కాగా వారి వద్ద నుంచి రూ.9.97 కోట్ల ప్రాపర్టీని సీజ్ చేయగా, ఈ సంవత్సరం 17 కేసుల్లో రూ.63.65 లక్షల ప్రాపర్టీని సీజ్ చేశాం. గంజాయి తాగే అమ్మే వారి విషయంలో వారి తల్లితండ్రులతో కలిసి కౌన్సిలింగ్ ఇచ్చాం. ఎస్‌హెచ్‌ఓ యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు నిర్వహించడంతో కేసులు తగ్గాయి.
గత సంవత్సరం కంటే తగ్గిన నేరాల సంఖ్య
ఫ ఫోరెన్సిక్ డిజిటల్ ఆధారాలతో కేసులను ఛేదించిన జిల్లా పోలీసులు
ఫ శిక్షలు పడిన నేరస్తుల సంఖ్య పెరుగుదల
ఫ సైబర్ నేరాలతోపాటు మహిళలపై పెరిగిన వేధింపులు
ఫ 2025–వార్షిక నేర నివేదికను వెల్లడించిన ఎస్పీ శరత్‌చంద్ర పవార్
జిల్లాలో పోలీసులతోపాటు రెండు షీ టీమ్‌లు సమర్థవంతంగా పనిచేశాయి. తద్వారా మహిళా అక్రమ రవాణా, ఇసుక అక్రమ రవాణా, పీడీఎస్ బియ్యం కేసులను పూర్తిగా అరికట్టగలిగాం. మత్తు పదార్థాల రవాణా విషయంలో 253 కేసుల్లో 251 మంది వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి రూ.79.88 లక్షల విలువ చేసే మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాం.
కేసుల వివరాలు ఇలా..
విభాగం గతేడాది ఈ ఏడాది
వివిధ కేసుల్లో శిక్షలు 65 132
లోక్‌అదాలత్‌లో
పరిష్కారం 18,257 49,943
ఆస్తినేరాలు 700 637
లైంగిక వేధింపులు 216 196
పోక్సో చట్టం కింద 121 117
గంజాయి కేసులు 108 17
సైబర్ 235 255
రోడ్డు ప్రమాదాలు 109 87


