క్రీడలతో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది
రామగిరి(నల్లగొండ) : క్రీడాపోటీలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని జిల్లా అదనపు ఎస్పీ జి.రమేష్ అన్నారు. నల్లగొండలోని మేకల అభినవ్ స్టేడియంలో రెండు రోజులుగా కొనసాగుతున్న జిల్లా స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025–26 ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఎండి.అక్బర్ అలీ మాట్లాడుతూ ప్రభుత్వపరంగా క్రీడలకు పూర్తి ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. అనంతరం గెలుపొందిన జట్లకు, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్.నర్సింహారావు, సైదులు, వెంకటేశ్వర్లు, విద్యాసాగర్, మాధురి, నీరజ, నరసింహ, ఎస్‌జీఎఫ్ సెక్రెటరీ విమల, పీడిలు ప్రసాద్, అంజయ్య, జ్యోతి, వనిత, ధరణి, క్రీడా ఉపాధ్యాయులు, శంభు లింగం, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
చివరి రోజు హోరాహోరీగా..
చివరి రోజులు క్రీడలు ఆధ్యంతం హోరాహోరీగా కొనసాగాయి. వివిధ క్రీడా విభాగాల్లో వివిధ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. కబడ్డీ విన్నెర్స్‌గా కోదాడ, రనర్స్‌గా ప్రభుత్వ పాలిటెక్నిక్ నల్లగొండ, ఖోఖో విన్నెర్స్ ప్రభుత్వ పాలిటెక్నిక్ నాగార్జునసాగర్, రన్నర్స్‌గా ప్రభుత్వ పాలిటెక్నిక్ నల్లగొండ నిలిచింది.
ఫ అదనపు ఎస్పీ రమేష్
ఫ ముగిసిన ఇంటర్ పాలిటెక్నిక్ క్రీడాపోటీలు


