మంత్రి కోమటిరెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు
నల్లగొండ : క్రిస్మస్ పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని క్రైస్తవులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం పండుగ శుభాకాంక్షలు. ఏసుక్రీస్తు బోధనలు ప్రేమ, శాంతి, త్యాగం, సేవా భావాన్ని మనకు గుర్తుచేస్తాయని పేర్కొన్నారు. ఈ క్రిస్మస్ పర్వదినాన ప్రతి కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, సుఖశాంతులు వెల్లివిరియాలని మంత్రి ఆకాంక్షించారు.
30 రోజుల్లో మూత్రశాలలు నిర్మిస్తాం
పెద్దవూర : ముప్పై రోజుల వ్యవధిలోనే మూత్రశాలల నిర్మాణం పూర్తిచేస్తామని పెద్దవూర ఎంఈఓ తరి రాములు, పోతునూరు గ్రామ సర్పంచ్ పెండ్యాల సంతోష్‌రావు అన్నారు. పెద్దవూర మండలం పోతునూరు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకే మూత్రశాల ఉండడంతో బాలికలు, మహిళా టీచర్లు పడుతున్న ఇబ్బందులపై బుధవారం సాక్షి దినపత్రికలో ప్రచురించిన కథనానికి ఎంఈఓ, గ్రామ సర్పంచ్ స్పందించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద మంజూరైన రూ.3 లక్షలతో నాలుగు మూత్రశాలలు, ఒక మరుగుదొడ్డి నిర్మించనున్నట్లు తెలిపారు. రెండు, మూడు రోజులలో పనులు ప్రారంభిస్తామన్నారు. కాగా పాఠశాలలో 38 మంది బాలికలతోపాటు ఐదుగురు మహిళా ఉపాధ్యాయులకు ఒకే మూత్రశాల ఉంది. బాలురు, పురుష ఉపాధ్యాయులు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితమే పాఠశాలలో మూత్రశాలల పనులను ప్రారంభించాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా నిలిచాయి.
జిల్లా కబడ్డీ జట్లకుక్రీడాకారుల ఎంపిక
నాగార్జునసాగర్ : నల్లగొండ జిల్లా సీనియర్స్ సీ్త్ర, పురుషుల కబడ్డీ జట్లకు ఎంపికై న క్రీడాకారుల జాబితాను జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.భూలోకరావు, జి.కర్తయ్య బుధవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఎంపికై న వారు ఈ నెల 25 నుంచి 28 వరకు కరీంనగర్‌లో జరిగే అంతర్ జిల్లాల తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. పురుషుల విభాగంలో కె.కోటేష్(తుంగతుర్తి), టి.రాజశేఖర్(మల్లేపల్లి), డి.సాయికిరణ్(తుంగతుర్తి), ఎన్.లక్ష్మణ్(ఆలగడప), జి.లోకేష్(అనుముల), పి.ఉదయ్(ఆర్జాలబావి), అఖిల్‌చారి(దేవరకొండ), ఎం.డి.నౌషద్(నిడమనూరు), శ్రీకాంత్(దేవరకొండ), సీహెచ్.శ్రీనయ్య(నర్కట్‌పల్లి), వి.మల్లేష్(పాల్వాయి), ఎంఈ.రాకేష్(కాల్వపల్లి), టి.ఉదయరాజు(మదారిగూడెం), బి.అంజి(గుడిపల్లి), పి. భరత్(గర్నెకుంట) ఎన్నికయ్యారు. వీరికి కోచ్‌గా కె.సైదులు, మేనేజర్‌గా జి. కృష్ణమూర్తులు వ్యవహరిస్తారు. సీ్త్రల విభాగంలో ఎస్‌కె.నౌషియా(హాలియా), ఆర్.నందిని(మల్లేపల్లి), టి.హన్సిక(తిరుమలగిరిసాగర్), కె.అంజలి(దుగ్గెపల్లి), ఎం.అభినయశ్రీ(కట్టంగూ రు), పి.వైష్ణవి (నారాయణపురం), యూ.సంతోషిని(నల్లగొండ), వి.వర్షిత(కేతపల్లి), ఐ. చందన్(కుర్మేడ్), బి.గిరిజ(నల్లగొండ), ఎ.పూజిత(మల్లేపల్లి), కె.మానస(చిల్కాపురం), ఆర్.శిరీష(మదారిగూడెం), బి.శిరీష(మొల్కపట్నం) ఎంపికయ్యారు. వీరికి కోచ్‌గా అన్వర్‌ఖాన్, మెనేజర్‌గా చంద్రశేఖర్ వ్యవహరిస్తారని వారు పేర్కొన్నారు.
పోలీస్ క్రికెట్ టోర్నీలో నల్లగొండ జట్టు విజయం
రామగిరి(నల్లగొండ) : మండలంలోని అన్నెపర్తి బెటాలియన్‌లో బుధవారం నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ డీఎస్పీ పరిధిలో మూడు, ఏఆర్, డీపీఓ జట్లు మొత్తం ఐదు జట్లకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీల్లో నల్లగొండ జట్టు విన్నర్, ఏఆర్ జట్టు రన్నర్‌గా నిలిచాయి. అనంతరం విన్నర్ జట్టు కు ఏఎస్పీ రమేష్ టోర్నీ కప్ అందజేశారు.
మంత్రి కోమటిరెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు


