రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ విడుదల చేయాలి
నల్లగొండ టూటౌన్ : రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ జిల్లా అధ్యక్షుడు కొంపల్లి భిక్షపతి డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండ కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన నిరాహార దీక్షలో ఆయన మాట్లాడారు. 2024 మార్చి తరువాత ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగుకు రావాల్సిన పెన్షన్ బకాయిలు ఏకమొత్తంగా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. బెనిఫిట్స్ అందక చాలా కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతు న్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణారెడ్డి, ముజాహిద్ అలీఖాన్, గణేష్, శంకరయ్య, వెంకటేశ్వర్లు, వెంకట్‌రెడ్డి, భిక్షం, లక్ష్మారెడ్డి, భాస్కర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, శ్యాంసుందర్, నారాయణరెడ్డి, భాస్కర్, ఏడుకొండలు, భాలయ్య, రాధాకృష్ణ, సుధారాణి, సుజాత, నాగమణి, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.


