మనుధర్మశాస్త్రంతోనే సామాజిక అసమానతలు
నల్లగొండ టౌన్ : ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మనదేశంలో సామాజిక అసమానతలకు మనుధర్మ శాస్త్రమే కారణమని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు నాగార్జున అన్నారు. గురువారం నల్లగొండ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వివిధ సామాజిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మనుధర్మ శాస్త్రానికి సంబంధించిన ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనువు రాసిన మనుధర్మ శాస్త్రాన్ని తొంభై ఏళ్ల క్రితమే డాక్టర్ బీఆర్.అంబేద్కర్ దహనం చేశారని, ఆ రోజును పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. అశాసీ్త్రయమైన ఈ మనుస్మృతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రద్దు చేసేలా జీవో తెచ్చి అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పందుల సైదులు, మానుపాటి భిక్షం, ఇందూరి సాగర్, గోలి సైదులు, కొండ వెంకన్న, అద్దంకి రవీందర్, తెలగమల యాదగిరి, గాదె నరసింహ, బొల్లు రవీందర్, అవుట రవీందర్, దండెంపల్లి సత్తయ్య , మల్లం మహేష్, కోట సైదులు, నలుపరాజు సైదులు, మురళి, సీహెచ్.తిరుపతయ్య, గోలి మల్లేష్, జయచందన్, పెరికె నరసింహ, చింత రామలింగయ్య, సైదులు తదితరులు పాల్గొన్నారు.


