కరుణానంద స్వామి ఆరాధనోత్సవాలు
నకిరేకల్ : పట్టణంలోని అచల గురు మందిరంలో కరుణానంద (మంచుకొండ పాపయ్య) స్వాములవారి 33వ రాజయోగి ఆరాధన మహోత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. సద్గురు శ్రీ పూర్ణానంద కర్నాటి పాండరమ్మ మాతాజీ తన శిష్య బృందంతో ఆరాధన కీర్తనలు ఆలపించారు. స్వామీజీ చిత్రపటంతో ఊరేగింపు, జెండా పూజలు చేశారు. గురువులు మిట్టపల్లి కృష్ణమూర్తి, సుగుణ, మల్లికార్జున, పసుపర్తి ధనమ్మ, శ్రీదేవి, శివకుమార్, గుండా అనసూయ, కాసం సుకన్య, చిలుకురి ప్రసాద్, గుండా భిక్షపతితోపాటు మరో 25 మంది సద్గురువులు ప్రవచనాలు వినిపించారు. సర్వశ్రీఅబ్బాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గురు మందిర అధ్యక్షుడు దేవరశెట్టి మధుసూదన్, ఉపాధ్యక్షులు శివకోటి ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి కోటగిరి పద్మజారమేష్, కోశాధికారి కోటగిరి రమాదేవి, గౌవర సలహాదారులు కాసం దయానందం, తొనుపూనురి గాంధీ, గుండా సోమనాథం, అనసూయ, పాలవర్గ సభ్యులు రేపాల నిర్మల, గుడిపాటి జయ, శివకోటి రాజ్యలక్ష్మీ పాల్గొన్నారు.


