‘భూ భారతి’తో సమస్యల పరిష్కారం
మర్రిగూడ : భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు గురువారం మండల కేంద్రంలోని కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు ఇక కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. రికార్డుల సవరణలు చేసే అవకాశం భూభారతిలో ఉందన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న భూముల వివరాలన్నీ ఆ గ్రామ పరిధిలో ప్రదర్శిస్తామన్నారు. శివన్నగూడ ప్రాజెక్టు నిర్వాసితులకు చింతపల్లిలోనే ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందజేస్తామన్నారు.
భూభారతి చట్టం విప్లవాత్మకం : ఎమ్మెల్యే
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం దేశంలోనే ఒక విప్లవాత్మకమైందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. భూభారతి చట్టం వల్ల 99శాతం సమస్యలు తహసీల్దార్, ఆర్డీఓ స్థాయిలోనే పరిష్కారమవుతాయన్నారు. శివన్నగూడ ప్రాజెక్టును రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని దాని ద్వారా మునుగోడు నియోజకవర్గంలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీఓ శ్రీదేవి, తహసీల్దార్లు బక్క శ్రీనివాస్, దేవాసింగ్, ఎంపీడీఓ రామకృష్ణశర్మ, మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు, వైస్ చైర్మన్ నక్క శ్రీనివాస్‌యాదవ్, పీఏసీఎస్ చైర్మన్లు బాలం నరసింహ, నర్సిరెడ్డి పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
‘భూ భారతి’తో సమస్యల పరిష్కారం


