రూ.114 కోట్ల విలువైన 57 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాయం చేసిన మిల్లర్లు | - | Sakshi
Sakshi News home page

రూ.114 కోట్ల విలువైన 57 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాయం చేసిన మిల్లర్లు

Jan 10 2026 9:30 AM | Updated on Jan 10 2026 9:30 AM

రూ.114 కోట్ల విలువైన 57 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాయ

రూ.114 కోట్ల విలువైన 57 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాయ

త్వరలోనే సబ్‌ కమిటీ భేటీ..

వెనువెంటనే చర్యలు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో ఆరుగురు మిల్లర్లు రూ.114 కోట్ల విలువైన 57 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాయం చేశారు. తమవద్ద ధాన్యం ఉందని, అధికారులే సీఎంఆర్‌ తీసుకోవడం లేదని బుకాయించిన మిల్లర్ల బండారం బయట పడింది. అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఆరు మిల్లుల్లో ధాన్యం లేదని తేలిపోయింది. వారిపై రెవెన్యూ రికవరీ (ఆర్‌ఆర్‌)యాక్ట్‌ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సీఎంఆర్‌ ఇవ్వకుండా ఎగ్గొట్టిన మిల్లర్లపై చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆయా మిల్లర్లకు సంబంధించిన ఆస్తుల క్రయవిక్రయాలను నిలిపివేయాలని రిజిస్ట్రేషన్ల శాఖకు లేఖ రాయాలని నిర్ణయించింది.

చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక కమిటీ

రాష్ట్రంలో పదేళ్ల కాలంలో సీఎంఆర్‌ ఎగ్గొట్టిన మిల్లర్లపై చర్యలు చేపట్టేందుకు పౌరసరఫరాల శాఖ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా 2016 నుంచి ఇప్పటివరకు సీఎంఆర్‌ ఎగ్గొట్టిన మిల్లర్లను గుర్తించడం, వారు ఎగ్గొట్టిన ధాన్యం పరిమాణం, దాని విలువ తేల్చడంతోపాటు వెంటనే ఆయా మిల్లర్లపై ఆర్‌ఆర్‌ యాక్ట్‌ అమలు చేసేందుకు పౌరసరఫరాల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అండ్‌ టాస్క్‌ఫోర్స్‌ విభాగం చీఫ్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రిటైర్డ్‌ డీఎస్‌ఓ వెంకటేశ్వర్లును స్పెషల్‌ ఆఫీసర్‌గా, రిటైర్డ్‌ తహసీల్దార్‌ ఎస్‌.ప్రభాకర్‌, డీపీఓ ఎస్‌.రాజ్‌కుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ సైదులుతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ధాన్యం ఎగ్గొట్టిన మిల్లులకు సంబంధించిన వ్యవహారాలను, చేపట్టాల్సిన తదుపరి చర్యలను పర్యవేక్షించనున్నారు.

నల్లగొండలో 57 వేల మెట్రిక్‌ టన్నులు పక్కదారి

ప్రభుత్వానికి సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) కింద ఇవ్వాల్సిన ధాన్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టించారు. సీఎంఆర్‌ కింద ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం కాకినాడ పోర్టుకు తరలించారని వచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు జిల్లాలోని ఆరు మిల్లులపై విచారణకు ఆదేశించారు. దీనిపై ఏర్పాటు చేసిన అధికారులు కమిటీ రంగంలోకి దిగింది. 2022–23 యాసంగి సీజనన్‌కు సంబంధించి చిట్యాలలోని వరలక్ష్మి మిల్‌ 59,538 క్వింటాళ్లు, నల్లగొండలోని రామ్‌లక్ష్మణ్‌ 78,110 క్వింటాళ్లు, మునుగోడులోని మురళీమనోహర్‌ ఆగ్రోఫుడ్‌ 4500 క్వింటాళ్లు, నల్లగొండ ఆర్జాలబావి సమీపంలోని సుమాంజలి 67,662 క్వింటాళ్లు, గౌతమి ఇండస్ట్రీస్‌ 1,59,803 క్వింటాళ్లు, నల్లగొండలోని కనకమహాలకి్‌ష్మ్‌ పార్‌బాయిల్డ్‌ మిల్లు 80,260 క్వింటాళ్లు మొత్తంగా 44,987 మెట్రిక్‌ టన్నుల వేలం ధాన్యం లేనట్లు తేలింది. దానికి సంబంధించిన సీఎంఆర్‌ బియ్యం కూడా లేవని తేలింది. పైగా అది ప్రభుత్వం వేలం వేసిన ధాన్యం. ఆ ధాన్యం లేకపోగా, కనీసం బియ్యం కూడా మిల్లుల్లో లేదని కమిటీ తేల్చింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖకు నివేదించింది. మరోవైపు మరికొన్ని మిల్లుల్లోనూ మరో 12 వేల మెట్రిక్‌ టన్నులు, మొత్తంగా 57 వేల మెట్రిక్‌ ధాన్యం లేదని దీంతో తదుపరి చర్యలపై యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది.

ధాన్యం మాయం చేసిన మిల్లర్ల విషయంలో తదుపరి కార్యాచరణపై త్వరలోనే పౌర సరఫరాల శాఖ సబ్‌ కమటీ భేటీ కానుంది. ఈ నెలాఖరులో నిర్వహించే ఆ సమావేశంలో ధాన్యం ఎగ్గొట్టిన మిల్లర్లనుంచి రికవరీ చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. దీంతో జిల్లాలోనూ అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై చర్యలు చేపడతారు.

ఫ అధికారులే సీఎంఆర్‌ తీసుకోవడం లేదంటూ వాదన

ఫ కానీ.. ఆరు మిల్లుల్లో ధాన్యం లేదని తేల్చిన అధికారుల కమిటీ

ఫ రెవెన్యూ రికవరీ యాక్ట్‌ కింద వారిపై చర్యలకు సన్నద్ధం

ఫ ఆయా మిల్లర్ల ఆస్తుల క్రయ విక్రయాలు నిలిపివేత

ఫ రిజిస్ట్రేషన్ల శాఖకు లేఖ రాయనున్న పౌరసరఫరాల శాఖ

ఫ సబ్‌కమిటీ భేటీ అనంతరం

మిల్లర్లపై చర్యలకు సిఫారసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement