క్రీడలతో ఓర్పు
ఫ కలెక్టర్ చంద్రశేఖర్
నల్లగొండ : క్రీడలు శారీరక, మానసిక దృఢత్వంతో పాటు ఓర్పును ఇస్తాయని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని అన్నెపర్తి 12వ పోలీస్ బెటాలియన్‌లో ఐదు రోజులపాటు నిర్వహించిన స్పోర్ట్స్ మీట్–2025 ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసు.. ఒక ఉద్యోగం కాదని, బాధ్యత అని చెప్పారు. దైనందిన జీవితంలో ఎన్నో ఒత్తిడిలను ఎదుర్కొని విధులు నిర్వహించే పోలీసులకు స్పోర్ట్స్ మీట్ నూతన ఉత్తేజాన్ని కల్పిస్తాయన్నారు. కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో ఓర్పు


